Home » Entertainment » Janhvi Kapoor Praise On Allu Arjun
Entertainment

Janhvi Kapoor : యాడ్స్‌తోను మ‌తులు పోగొడుతున్నారంటూ అల్లు అర్జున్‌పై జాన్వీ క‌పూర్ ప్ర‌శంస‌లు

Authored By
Sam C
The Telugu News | Updated on: August 27, 2022 2:42 pm
Advertisement

Janhvi Kapoor : అల్లు అర్జున్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పుష్ప‌ సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్‌కు క్రేజ్ పెరిగింది. అయితే ఇటీవలే న్యూయార్క్ వెల్లిన అల్లు అర్జున్‌కు హాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇక ఇటీవ‌ల అల్లు అర్జున్ యాడ్స్‌తోను దుమ్ము రేపుతున్న విష‌యం తెలిసిందే. వ‌రుస యాడ్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నాడు. కొన్ని వివాదాల‌లోను ఈ అమ్మ‌డు ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సినిమాల‌కే కాకుండా యాడ్స్‌కి కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజాగా జాన్వీ క‌పూర్ కూడా అల్లు అర్జున్ గురించి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. యాడ్స్‌తో కూడా మెస్మ‌రైజ్ చేసే రేంజ్ అంటూ అల్లు అర్జున్ ది అంటూ జాన్వీపై ప్ర‌శంస‌లు కురిపించింది. ప్ర‌స్తుతం జాన్వీకి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. తన డైలాగ్స్, డ్యాన్స్, యాక్టింగ్ తో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో వరుస యాడ్స్ దుమ్ములేపుతున్నాడు బన్నీ. ఇటీవ‌ల మరో యాడ్ తో మందుకొచ్చాడు స్టైలీస్ స్టార్. పాపులర్ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా యాడ్ లో నటించి అదరగొట్టాడు. అయితే ఈ యాడ్ ని ఓ సాంగ్ రూపంలో తీసుకొచ్చారు యాడ్ నిర్వాహకులు.

Janhvi Kapoor praise on Allu Arjun

Advertisement

ఇది సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది.ఈ సాంగ్ చూసిన బన్నీ ఫ్యాన్స్ యమ ఖుషీగా ఉన్నారు. ఈ యాడ్ సాంగ్ ని బుట్ట బొమ్మ సింగర్ అర్మాన్ మాలిక్ తో పాడించారు. ఈ యాడ్ లో అర్మాన్ అల్లు అర్జున్ తో కలిసి నటించాడు. అంతేకాకుండా ఫేమస్ కొరియన్ మోడల్, యాక్టర్ ట్రిబె కూడా బన్నీతో కలిసి స్టెప్పులు వేశారు. ‘మేము ఆగము…’ అంటూ సాగే ఈ కోకా కోలా యాడ్ సాంగ్ ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ లో రూపొందించారు. ఈ పాటలో అల్లు అర్జున్ తన మార్క్ స్టెప్పులతో అలరించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బన్నీ కోకా కోలా యాడ్ చేయడంతో అతని క్రేజ్ విదేశాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి