Home » Entertainment » Janhvi Kapoor Stunning Looks
Entertainment

Janhvi Kapoor : ప్ర‌కృతి ఒడిలో మైమ‌ర‌చిపోతున్న జాన్వీ క‌పూర్.. ఆ అందాల‌కు ముగ్ధుల‌వ్వాల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: June 11, 2022 1:04 pm
Advertisement

Janhvi Kapoor : బాలీవుడ్ కుర్ర భామ‌ల‌లో అందంతో పాటు అభిన‌యంతో అలరిస్తున్న వారిలో జాన్వీ క‌పూర్ మొద‌టి స్థానంలో ఉంటుంది. శ్రీదేవి చ‌నిపోయిన త‌ర్వాత ఇటు వెండితెర‌పై అటు సోష‌ల్ మీడియాలోను జాన్వీ కపూర్ హంగామా మాములుగా లేదు. అందాల విందుతో నిత్యం అభిమానులకు ఖుషీ చేస్తుంది. వరుసగా ఫోటో షూట్లతో మతిపోగొట్టేలా పోజులిస్తూ విజువల్‌ ట్రీట్‌నిస్తుంది జాన్వీ. ఈ అమ్మడు కెరీర్‌ ప్రారంభం నుంచే గ్లామర్‌ షోలో ఎలాంటి హద్దుల్లేవని నిరూపిస్తూ కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. సినిమాల్లో కంటే బయట ఫోటో షూట్లలోనే రెచ్చిపోయింది.

Advertisement

అందాలు ఆరబోస్తూ అభిమానులను షాకిస్తుంది. నిత్యం తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులను సంతోషపెడుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఎప్పుడు బోల్డ్‌గా క‌నిపించే జాన్వీ క‌పూర్ ప్ర‌కృతి ఒడిలో ఒదిగిపోయింది. ఈ ముద్దుగుమ్మ గ‌తంలో మాదిరిగా కాకుండా చాలా కూల్‌గా గ్లామ‌ర్ షో చేయ‌కుండా క‌నిపించింది. చాలా రోజుల త‌ర్వాత జాన్వీ కపూర్ ఇలా క‌నిపించే స‌రికి అంద‌రు షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఆమె మైండ్ బ్లోయింగ్ లుక్స్‌కి ఫుల్ రెస్పాన్స్ వ‌స్తుంది.దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది.

janhvi kapoor stunning looks

Advertisement

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆర‌బోత‌..

హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్ జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం. కేరీర్ విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అవుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ వచ్చిన అవకాశాలను మాత్రం వదులు కోవడం లేదు. బాలీవుడ్ లో ప్రస్తుతం ‘దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే గుడ్ లక్ జెర్రీ, మిలీ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపైనా చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి