Home » Entertainment » Jathi Ratnalu Punch Prasad In Anchor Suma Cash Show
Entertainment

Anchor Suma : పంచ్ ప్రసాద్‌కే పంచ్.. పగలబడి నవ్వేసిన యాంకర్ సుమ శ్రీముఖి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 3, 2022, 6:30 pm
Advertisement

Anchor Suma : పంచ్ ప్రసాద్ గురించి జబర్దస్త్ వీక్షకులందరికీ తెలిసిందే. పంచ్ ప్రసాద్ తన ఆరోగ్య సమస్యలతో మధ్యలో జబర్దస్త్ షోకు దూరమయ్యాడు. రెండు కిడ్నీలు పాడవ్వడంతో ఆమధ్య సీరియల్ కండీషన్‌లోకి వెళ్లిపోయాడు. తన ఆరోగ్యం ఎంత బాగా లేకపోయినా, కిడ్నీల సమ్యలున్నా వాటిపై జోకులు వేస్తుంటాడు. తాను కూడా ఎంతో స్పోర్టీవ్‌గా తన రోగం మీదే కౌంటర్లు వేసుకుంటాడు.జబర్దస్త్ కమెడియన్‌గా పంచ్ ప్రసాద్‌కు మంచి గుర్తింపు లభించింది. ఆటో పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు.

Advertisement

అలాంటి పంచ్ ప్రసాద్ ఒక్కోసారి అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంటాడు. తన భార్య గురించి, తన ప్రేమ కథ గురించి చెబుతూ అందరినీ ఏడిపించేస్తుంటాడు. తన భార్యే తనకు కిడ్నీ దానం చేస్తోందని ఎన్నో సార్లు సభాముఖంగా చెప్పేశాడు.ఇప్పుడు పంచ్ ప్రసాద్ శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, రెచ్చిపోదాం బ్రదర్ అనే షోలతో సందడి చేస్తున్నాడు. అయితే ఈ మధ్య రెచ్చిపోదాం బ్రదర్ అనే షో రావడం లేనట్టుంది. మొత్తానికి మరో కొత్త షోలో ప్రసాద్ రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నాడు.

Jathi ratnalu Punch Prasad In Anchor Suma Cash Show

Advertisement

శ్రీముఖి హోస్ట్ చేస్తోన్న జాతి రత్నాలు స్టాండప్ కామెడీ షోలో పంచ్ ప్రసాద్ కనిపించబోతోన్నాడు.జాతి రత్నాలు టీం అంతా కూడా సుమ క్యాష్ షోకు వచ్చింది. ఇందులో పంచ్ ప్రసాద్ ఆటో పంచులతో రఫ్పాడించాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం పంచ్ ప్రసాద్‌కే పంచ్ వేశాడు. నేను ఇక్కడ ఉండటానికి కారణం పంచ్ ప్రసాద్.. ఎందుకంటే నేను అక్కడ ఉందామని అనుకున్నా.. కానీ ఆయన అక్కడ ఉండటం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అంటూ కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి