Home » Entertainment » Jessie Wants To Do Rmonace With Sewtaa Varma In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : శ్వేతా వర్మతో అలా చేయాలని ఉంది.. జెస్సీ కోరికలు మామూలుగా లేవు

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 29, 2021, 7:49 pm
Advertisement

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. ఒకప్పుడు అమాయకంగా కనిపించిన జెస్సీ ఇప్పుడు దుమ్ములేపుతున్నాడు.తనలోని కొత్త కొత్త కోరికలను బయటపెట్టేస్తున్నాడు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో శ్వేతా వర్మ, జెస్సీ పెట్టుకున్న ముచ్చట్లు మామూలుగా లేవు. ఇక ఈ ఇద్దరు నిన్న మాట్లాడుకున్న మాటలు వింటే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. జెస్సీ, శ్వేతా వర్మలు ఈ మధ్య క్లోజ్‌గా అవుతున్నారు. ఈ క్రమంలో రొమాన్స్ గురించి జెస్సీ మాట్లాడాడు.

Advertisement

Jessie Wants To Do Rmonace WIth Sewtaa Varma In Bigg Boss 5 Telugu

శ్వేతా వర్మతో రొమాన్స్ చేయాలని ఉంది.. ఆమెను నాకు జోడిగా చేయండి బిగ్ బాస్.. ఆమెతో మంచి రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేయాలని ఉంది.. మనోహర అనే పాటకు మంచిగా డ్యాన్స్ చేయాలి.. అలా పట్టుకోవాలి.. అంటూ జెస్సీ దుమ్ములేపేశాడు. తన టాలెంట్ చూపిస్తాను అంటూ జెస్సీ తెగ సంబరపడిపోయాడు. అప్పుడు శ్వేతా వర్మ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. చాలా మారిపోయావ్‌రా .. నీలో ఉన్ని కోరికలు ఉన్నాయారా? అని కౌంటర్ వేసింది.

Advertisement

Jessie Wants To Do Rmonace WIth Sewtaa Varma In Bigg Boss 5 Telugu

రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేయాలన్న జెస్సీ Bigg Boss 5 Telugu

అయితే శ్వేతా వర్మ ఓ విషయాన్ని బయటపెట్టేసింది. జెస్సీ లవర్ గురించి ప్రస్థావించింది. బెంగళూరుకు వెళ్తా అన్నావ్.. ఆమెకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పావ్? మళ్లీ ఇలా అంటున్నావ్ ఏంటి అని కౌంటర్ వేసింది. దానికి జెస్సీ సమాధానం ఇస్తూ.. నేను అడిగింది కేవలం ఓ పాటకు డ్యాన్సే కదా? అని కవర్ చేసేశాడు. మొత్తానికి జెస్సీ మాత్రం రాను రాను లవర్ బాయ్‌లా మారిపోయేట్టున్నాడు. శ్వేతా వర్మతో ట్రాక్ నడిపించేలానే ఉన్నాడు.

Advertisement

 

Jessie Wants To Do Rmonace WIth Sewtaa Varma In Bigg Boss 5 Telugu

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి