
#image_title
JR NTR : ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘దేవర. ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. చిత్రంలో కథానాయికలుగా శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్,మరాఠీ భామ శృతి మరాటే నటిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా మూవీని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, ఇటీవల గోవాలో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి.
డ్రోన్ షాట్ తీస్తున్న సమయంలో తేనేటీగలు ఒక్కసారిగా లేచాయని, దాదాపు 20 మంది యూనిట్ సభ్యులకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే గమనించి చిత్ర బృందాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో తారక్ కి ఏమైందో అని కంగారు పడుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేకుండా ఉండే సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా చిత్ర యూనిట్ స్పందించలేదు. ఎవరెవరు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎవరి పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. ఇద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ చిత్రం మాసివ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ తో అదిరిపోయే సబ్జెక్ట్ రెడీ చేశారు. చూస్తుంటే ఇద్దరూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
This website uses cookies.