Junior NTR pan India movies
JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంత పెద్ద విజయం అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియర్స్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌ను హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది ఆశ్చర్యపరిచారు. తమ పేర్లతో కూడిన వెల్‌కమ్ కార్డును ఎన్టీఆర్‌కు వారు అందజేశారు.ఇది చూసిన ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. జపాన్‌లో అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్‌ని చూసి ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్‌లో ప్రమోట్ చేయడానికి భార్యా పిల్లలతో కలిసి జూనియన్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, రాజమౌళి సైతం అక్కడే ఉన్నారు. ఈ శుక్రవారం RRR జపాన్‌లో విడుదల కాగా, అక్కడి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇక ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తారక్.. జపనీస్‌లో మాట్లాడారు. చక్కటి యాసతో జపనీస్‌ను ఎన్టీఆర్ మాట్లాడారంటూ అందరూ నెట్టింట ఆయన్ని పొగుడుతున్నారు.
JR NTR fan cries for her happiness
అయితే కొందరు మాత్రం, ఎన్టీఆర్ జపనీస్ మాట్లాడటం అనేది రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటున్నారు. ఏదైతేనేం ఎన్టీఆర్ జపనీస్‌ను మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, తారక్‌లను చూడటానికి జపాన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. రెండు నిజ పాత్రధారులకు సంబంధించిన ఫిక్షనల్ కథాంశం ఇది.ఈ సినిమా సాధించిన విజయంతో ఎన్టీఆర్.. కొరటాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.