Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్క అభిమాని ఇలాగే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చివరి సారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు ఏళ్లు అయ్యింది. రాజమౌళితో సినిమా అంటే ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కాని ముందస్తుగా ప్లాన్ లేకుండా ఎన్టీఆర్ ఉన్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అయిన వెంటనే చకచక సినిమా లు చేసే విధంగా ఎన్టీఆర్ ఎందుకు ప్లాన్ చేయలేదు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చేసిన మరో హీరో రామ్ చరణ్ ఎలా చకచక సినిమాలు చేస్తున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ ఆలోచన బాగుందంటూ కొందరు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ చేస్తూ ఆచార్య సినిమా ను చేశాడు. ఆచార్య లో చిన్నా చితక పాత్ర ఏమీ కాదు. ఆచార్య మాత్రమే కాకుండా తాజాగా శంకర్ సినిమా ను కూడా మొదలు పెట్టాడు. శంకర్ సినిమా ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయితే వెంటనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తాడు. వచ్చే ఏడాది ఆరంభంలో శంకర్ సినిమా ఆ వెంటనే గౌతమ్ సినిమా వస్తుంది. అంటే ఈ ఏడాది లో చరణ్ రెండు సినిమాలు వస్తే వచ్చే ఏడాది లో కూడా చరణ్ నుండి రెండు సినిమా లు వస్తాయి. కాని ఎన్టీఆర్ నుండి ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ వస్తే వచ్చే ఏడాదిలో ఒక సినిమా వస్తుంది. అది కూడా కరోనా పరిస్థితులు సహకరించకుంటే వచ్చే ఏడాది లో ఎన్టీఆర్ సినిమా ఉంటుందా లేదా అనేది అనుమానమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికి అయినా ఎన్టీఆర్ కథల ఎంపిక విషయంలో స్పీడ్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ సినిమా ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా ఏదో సమస్య లేదా మరేదో విషయం కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా పడింది కనుక ఎన్టీఆర్ తదుపరి సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొందరు హీరోలు ఈ కరోనా టైమ్ ను అనువుగా మార్చుకుని మరిన్ని సినిమాలు చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఈ అయిదు ఆరు ఏళ్ల కాలంలో రెండే సినిమాల ను ఇవ్వబోతుండటం చర్చ నీయాంశంగా మారింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించినంత వరకు అయితే ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవు అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.