JR NTR : తెలుగు ఎంటర్టైన్మెంట్ బుల్లితెర రంగంలో జెమినీ టీవీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర ప్రస్థానం ప్రారంభమైన ఆరంభంలో ఈ టీవీ మరియు జెమినీ టీవీ పోటీ పడి మరి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే విషయంలో నువ్వా నేనా అన్నట్లు గా వ్యవహరించేవి. ఆ సమయంలో ఎక్కువ శాతం జెమినీ టీవీ కార్యక్రమాలకు మరియు అందులో వచ్చే సీరియల్స్ కి మరియు సినిమాలకు అభిమానులు ప్రేక్షకులు ఎక్కువగా ఉండే వారు. నెంబర్ 1 గా జెమిని టివి దాదాపు పుష్కర కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా జెమినీ టీవీ యొక్క రేటింగ్ తగ్గుతూ వచ్చింది.
తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి స్టార్ మా మరియు జీ తెలుగు చానల్స్ రాకతో జెమిని టీవీ ప్రభావం తగ్గింది. మరోవైపు ఈటీవీ మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. జబర్దస్త్ మరియు ఇతర కార్యక్రమాల కారణంగా ఈ టీవీ కి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ స్టార్ మా మరియు జీ తెలుగు ఛానల్స్ కారణంగా జెమినీ టీవీ దెబ్బ తినాల్సి వచ్చింది. మళ్లీ జెమినీ టీవీ ని నెంబర్ వన్ గా నిలిపేందుకు ఆ సంస్థ యొక్క యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసే అవకాశాలు ఉన్నా కూడా జెమినీ టీవీ మాత్రం నెంబర్ వన్ కి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇటీవలే అత్యధిక బడ్జెట్ ఖర్చు చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ తో చేయించారు.
అంతేకాకుండా తమన్నాతో ఒక వంటల కార్యక్రమం కూడా నిర్వహించారు. రెండు కార్యక్రమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కానీ కొంత మేరకైనా రైటింగ్ అయితే రాలేదు. ఆయినా కూడా జెమినీ టీవీ తమ ప్రయత్నాలను చేస్తూనే ఉంది. తాజాగా బుల్లి తెర కామెడీ కార్యక్రమాలు ఓ రేంజ్ లో సూపర్ ఉన్నాయి. కనుక జెమినీ టీవీలో కూడా జబర్దస్త్ కామెడీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. జెమినీ టీవీలో ఆ కామెడీ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు జడ్జ్ గా వ్యవహరించబోతుండగా జబర్దస్త్ కమెడియన్స్ ఇందులో కనిపించబోతున్నారట. వారితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు కూడా కార్యక్రమంలో కనిపించబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. మరి ఈసారైనా జెమినీ టీవీ కి కాలం కలిసి వచ్చి రేటింగ్ పెరిగిన చూడాలి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్లోని కంటెస్టెంట్స్ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
This website uses cookies.