Home » Entertainment » Jr Ntr New Stylish Look Viral On Social Media
Entertainment

JR NTR : ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ చూసి ప్రభాస్, రాజమౌళి కూడా సూపర్ అనుకున్నారు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 12, 2022, 9:00 pm
Advertisement

JR NTR : టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ సినిమా అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ సినిమాలోనైనా ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించగలరు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్లతో సినిమాలు చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేసేందుకు జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ అక్కడికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా జపాన్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 21 రోజులు అవుతుంది. నిన్న కూడా హ్యూజ్ రేంజ్ లో కలెక్షన్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో టాప్ ట్రేడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ కొత్త లుక్ లో ఎన్టీఆర్ సూపర్ గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

JR NTR new stylish look viral on social media

Advertisement

స్టైలిష్ క్రాఫ్, వెరైటీ గడ్డంతో, గాగుల్స్ పెట్టుకొని, జీన్స్ వేసుకొని కెమెరా లుక్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో జనాలను బాగా ఆకట్టుకుంది. ఈ ఫోటోలో వెనుక ఉన్న ఒకతను కెమెరా పట్టుకొని ఫోటో తీస్తున్నాడు. అద్దంలో చూసుకుంటున్న తారక్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. అయితే ఈ మోడల్ లుక్ కొరటాల సినిమా కోసం ట్రై చేస్తున్నారా లేదా ఏదైనా యాడ్ కోసం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్కులో చూసిన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి