Jr Ntr : ఇన్నేళ్ల తర్వాత ఆయన పేరు తెరపైకి తీసుకొచ్చిన ఎన్టీఆర్.. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లమ్..!
Jr Ntr : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రం దేవర. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ సోలో మూవీ.. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం చెలరేగిపోయింది. వసూళ్ల వర్షాన్ని కురిపించింది. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి లాభాల బాట పట్టింది. రాజమౌళితో సినిమా చేశాక సదరు హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుందనే సెంటిమెంట్‌ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా రాబట్టిన దేవర మొదటి వారానికి గాను రూ. 407 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.
దేవర ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరి. చాలా మంది ఎన్నో రకాలుగా అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. ఎన్టీఆర్ సడెన్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేసే సరికి అతని పేరు మారుమ్రోగిపోతుంది.
Jr Ntr : ఇన్నేళ్ల తర్వాత ఆయన పేరు తెరపైకి తీసుకొచ్చిన ఎన్టీఆర్.. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లమ్..!
ఇంతకీ ఈ హరి ఎవరు? ఎందుకు తారక్ హరి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు? తారక్ ఇంతలా ఈయన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? హరిపై వస్తున్న నిందలు ఏంటి ? అసలు హరి తారక్ కి ఏమవుతారు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. హరి ఎవరో కాదు. కళ్యాణ్ రామ్ కి స్వయానా బామ్మర్ది. కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడు. ఎన్టీఆర్ ఫ్యామిలి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. కళ్యాణ్ రామ్ అన్నా, ఎన్టీఆర్ అన్నా హరికి చాలా ఇష్టం. వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సినిమా వ్యవహారాల మొత్తం హరినే చూసుకుంటారు. గతంలో తారక్ మ్యానేజర్ గా పని చేసిన కోనేరు మహేష్ తో కలిసి ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు హరి. కోనేరు మహేష్ చనిపోయాక తారక్ వెన్నంటే వున్నారు హరి. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడానికి,ఇంకా కొన్ని విషయాలలో హరినే ప్రధాన కారకుడిగా ఉన్నారంటూ ట్రోల్ చేశారు. వారందరికి ఎన్టీఆర్ ఇలా సమాధానం ఇచ్చాడని అంటున్నారు.
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
This website uses cookies.