star hero in JR NTR movie bollywood crazy heroine
JR NTR : మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. 1920 దశకం నాటి కథతో వచ్చిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 47 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 608.17 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 155.17 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుని హవాను చూపించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై చాలా రోజులు అవుతున్నా కూడా సినిమా హవా కొనసాగుతూనే ఉంది. తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
JR ntr question appears in exam paper
అతడి నటనకు యావత్ ప్రేక్షకులు సెల్యూట్ కొట్టారు.కొమురం భీముడో పాటలో తారక్ ఎక్స్‌ప్రెషన్స్‌కు జనం ఫిదా అయ్యారు. ఇప్పుడు తారక్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అతడిని ఓ ఎగ్జామ్‌లోని క్వశ్చన్ పేపర్ ఎక్కేలా చేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ఓ ప్రశ్న అడిగారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్‌తో మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి, ఆయన్ను ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయాలి’ అంటూ ఓ ప్రశ్న కనిపించింది. దీంతో ఈ క్వశ్చన్ పేపర్‌ను తారక్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. తారక్ అంటే మాములు విషయమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…
This website uses cookies.