Ram Charan – Junior NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, తారక్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందో రాదో తెలియదు కానీ తారక్, రామ్ చరణ్ లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి నెల నుండి రాంచరణ్ అమెరికాలోనే ఉంటున్నాడు. తనే సొంతంగా ఎన్నో అంతర్జాతీయ మీడియా చానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.
అంతే కాదు HCA అవార్డ్స్ లో ప్రెజెంటర్ అయ్యే అరుదైన అవకాశం ని దక్కించుకొని చరిత్ర తిరగరాసాడు. అంతేకాదు స్పాట్లైట్ అవార్డుని రాజమౌళితో పాటు సొంతం చేసుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్న మరణించడంతో ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయాడు. దీంతో రాజమౌళి తో పాటు రామ్ చరణ్ ని అంతర్జాతీయ మీడియా బాగా ప్రమోట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఈగో హర్ట్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి రూమర్స్ రావడం అనేది సర్వసాధారణం.అయితే మార్చి 5 న ఎన్టీఆర్ అమెరికా వెళ్లాడు.
రెండు మూడు రోజులు ఖాళీగానే హోటల్ రూమ్ లో ఉన్నాడు. వచ్చిన దగ్గరనుంచి రామ్ చరణ్ ని కలవలేదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నోసార్లు ఫారిన్ ట్రిప్ కి టీమంతా కలిసి వెళ్లేవారు. కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం మానేసి ఎవరికి వారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జనాలు చర్చించుకుంటున్నారు. మరి ఆస్కార్ అవార్డ్స్ కైనా వీళ్లు కలిసి ఉంటారా లేదా అనేది చూడాలి.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.