JR NTR Samantha combination another movie
Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనేది చాలా అరుదు. ఒకే హీరోహీరోయిన్ కలిసి నటించిన సినిమాలు ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. మిగతావి డిజాస్టర్లుగా నిలిచాయి. సామ్, తారక్ విషయంలోనూ అదే ఫార్ములా రిపీట్ అయ్యింది. కానీ గతంలో మాత్రం చిరు, వెంకీ, నాగ్ మాత్రం విషయంలో హిట్ పెయిర్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సీనియర్ నటి మీనా, విక్టరీ వెంకటేశ్ కలిసి చేసిన మూవీలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదిలాఉండగా తారక్, సమంత మరోసారి స్క్రీన్ కనిపించనున్నట్టు వార్తలు జోరుగా వస్తున్నాయి.
గతంలో సమంత, ఎన్టీఆర్ కలిసి బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు చేశారు. ఆ నాలుగింటిలో రెండు సూపర్ హిట్ అవ్వగా మిగతావి వీరిద్దరి కెరీర్‌లో డిజాస్టర్స్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ చాలా హ్యపీగా ఫీలవతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. జనవరి 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో తారక్ కొత్త మూవీని ప్రారంభించనున్నారు.
JR NTR Samantha combination another movie
ఇందులో మెయిన్ లీడ్‌గా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌ను తీసుకున్నట్టు తెలిసింది.అయితే, సెకండ్ హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందట. దీనిపై ఇప్పటికే సమంతను సంప్రదించినట్టు తెలుస్తోంది. సామ్ కూడా తారక్ మూవీలో చేసేందుకు పాజిటివ్ గానే ఉందట.. అన్ని కుదిరితే మరోసారి తారక్ , సమంత మరోసారి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టనున్నారు. అయితే, ఈ చిత్రంలో సామ్ నెగెటిల్ రోల్ లీడ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందనేది మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.