JR NTR : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డ్ వచ్చాక తన రేంజ్ అమాంతం పెరిగింది. నటనపరంగా తారక్ ని మించినవారు ఎవరు లేరు అని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో తారక్ రేంజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ట్విట్టర్ లో 2.5 కోట్ల మెన్షన్ తో సంచలనం సృష్టించాడు. ఒక స్టార్ హీరో రేంజ్ ఎలివేట్ చేసే గ్రాఫ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి లేని అత్యున్నత గ్రాఫ్ ఎన్టీఆర్ కి సొంతం. ఇటీవల ఆస్కార్, గోల్డెన్ గ్లోబల్ ప్రచారంతో అతడిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగింది.
కొన్ని వరుస ప్రాజెక్టులతో అతను సామాజిక మాధ్యమాలలో గొప్ప చర్చగా మారాడు. ప్రస్తుతం తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పని చేసే ముందు రెండు పాన్ ఇండియా సినిమాకు ఒకే చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ వార్ 2 ‘ కూడా ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివతో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాలో చేస్తున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఇప్పటికి ట్విట్టర్ లో రికార్డ్ స్థాయిలో మెన్షన్స్ ని సాధించాడు. పాన్ ఇండియా స్థాయిలో తారక్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇకపై తారక్ బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లకి పోటీగా నిలవనున్నాడు. ఇకపై టాలీవుడ్ బాద్షా గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలుస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.