Jyothi Rai : గుప్పెడంత మనసు జగతి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మనసు ఉంది.. ఏం చేసిందంటే..!
Jyothi Rai : బుల్లితెర ప్రేక్షకులకి గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో జగతి మేడమ్ పాత్రలో కనిపించి సందడి చేసింది జ్యోతిరాయ్. పేరుకు కన్నడ నటినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు చాలా దగ్గరైంది. సీరియల్‌లో చాలా పద్దతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. జ్యోతిరాయ్ పిక్స్ క్షణాలలోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే తన హాట్‌నెస్‌తో రచ్చలేపే జ్యోతిరాయ్ తాజాగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసింది. తద్వారా తన లాగే తన మనసూ ఎంతో అందమైనదని మరోసారి నిరూపించుకుంది.
‘భీమ్లా నాయక్’ సినిమాలో పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించారు కిన్నెర మొగిలయ్య. ఆయన తాజా ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి చెప్పుకున్నారు. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ చేసిన యాంకర్ శివ మాధవ్.. మొగిలయ్య కష్టాలను డైరెక్టర్ సుకు పూర్వజ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ ఆగిపోవడంతో మొగిలయ్య పరిస్థితి దయనీయంగా మారిందన్న విషయం తెలుసుకుని సుకు పూర్వజ్-జ్యోతి పూర్వజ్ దంపతులు చలించిపోయారు. అక్షయ తృతీయ రోజున తన వంతుగా 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం తాను కూడా ఇబ్బందుల్లో ఉన్నానని, అయితే తన ఇబ్బందుల కంటే మొగిలయ్య కష్టాలే తనను కలిచివేశాయని జ్యోతి రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.
Jyothi Rai : గుప్పెడంత మనసు జగతి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మనసు ఉంది.. ఏం చేసిందంటే..!
మొగిలయ్య ప్రతిభకు తాను చేస్తున్న డబ్బు సాయం పెద్దది కాదని, ఆయనకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలంటూ ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా మొగిలయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది..ఇక డైరెక్టర్ సుకు పూర్వజ్ కూడా మొగిలయ్య ప్రతిభకు దాసోహం అయ్యారు. తను దర్శకత్వం వహించబోయే సినిమాల్లో మొగిలయ్యను భాగస్వామి చేసి ఆయనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మొగిలయ్యకు ఏదైనా పాత్ర ఇవ్వడం లేదా ఆయనతో పాటలు రాయించడం, పాడించడం చేస్తానని చెప్పారు.
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
This website uses cookies.