Home » Entertainment » Kajal Aggarwal Actress Mother Role In That Film
Entertainment

Kajal Aggarwal : తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్ .. మమ్మల్ని చంపేయ్ పోనీ అంటోన్న ఫ్యాన్స్..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 26, 2023, 1:18 pm
Advertisement

Kajal Aggarwal : తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ లక్ష్మి కళ్యాణం ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిన కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ సినిమాలలో కూడా హీరోయిన్గా నటించింది. హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది.

Advertisement

ఆ తర్వాత నుంచి కాస్త సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ గతేడాది మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ని రోజులు బిడ్డతో హ్యాపీడేస్ ని ఎంజాయ్ చేసిన కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయం చెప్పేందుకే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కాజల్ ను అడిగినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి కాజల్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Kajal Aggarwal actress mother role in that film

Advertisement

ఈ సినిమాలో కీలక పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రీ లీలకు తల్లిగా కాజల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక రెండవ షెడ్యూల్ ఫిబ్రవరి 5 నుంచి మొదలుపెట్టనుంది. మొదటిసారి బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమాలో శ్రీ లీలకు తల్లిగా కాజల్ నటిస్తుందో లేదో చూడాలి. బాలయ్య వీర సింహారెడ్డి సినిమా తర్వాత వచ్చే ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి