Kajal Aggarwal : బ్యూటిఫుల్ కపుల్ ఏడాది పూర్తి.. కాజల్ గౌతమ్ రొమాంటిక్ ఫొటో వైరల్..!
Kajal Aggarwal : బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మ్యారేజ్ తర్వాత కూడా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. పలు చిత్రాల్లో కథనాయికగా నటిస్తున్నఈ భామ తాజాగా గౌతమ్ కిచ్లూతో వన్ ఇయర్ యానివర్సిరీ జరుపుకుంది.‘లక్ష్మీ కల్యాణం’ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ, భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ సత్తా చాటుతోంది.గతేడాది అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను మ్యారేజ్ చేసుకున్న చందమామ కాజల్.. మ్యారేజ్ తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
kajal aggarwal interesting instagram post
వివాహ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాజల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా భర్తతో దిగిన రొమాంటిక్ ఫొటో షేర్ చేసింద. సదరు ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఫొటోలో కాజల్ -గౌతమ్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఉండటం విశేషం. ఈ క్రమంలోనే తన భర్త సీక్రెట్ ఒకటి షేర్ చేసింది పంచదార బొమ్మ. తన భర్త రాత్రివేళ్లలో ముఖ్యంగా అర్ధరాత్రి పూట నిద్రలేచే ఉన్నావా? అని తనను అడుగుతాడని, ఆ టైంలో డాగ్ వీడియోస్ చూడు అని అంటాడని పేర్కొంది కాజల్.
Kajal Aggarwal : భర్త సీక్రెట్ షేర్ చేసిన కాజల్..
kajal aggarwal interesting instagram post
ఇకపోతే సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు కాజల్-గౌతమ్‌లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు. కాజల్-గౌతమ్ అన్యోన్యంగా దిగిన ఫొటోను చూసి ‘లవ్లీ పెయిర్.., జీవితాంతం ఇలానే ఉండండి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
