
kajal aggarwal is pregnant
Kajal Aggarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్‌లో కొనసాగుతోంది కాజల్ అగర్వాల్.. తాజాగా గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.. తన హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తేజ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీకల్యాణం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత చందమామ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సుమంత్ తో కలిసి పౌరుడు, నితిన్ తో కలిసి ఆటాడిస్తా వంటి మూవీస్ చేసినా హిట్ మాత్రం దక్కలేదు.
ఇక 2009 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర మూవీలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో ఈ అమ్మడి దశ తిరిగిపోయింది. ఏకంగా టాప్ హీరోయిన్ గా మారింది. ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు గానూ ఉత్తమ నటిగా సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్టింగ్ రెండు, మూడు తమిళ మూవీస్ లో యాక్ట్ చేసినా ప్రస్తుతం టాలీవుడ్ లోనూ కొనసాగుతోంది.చిరంజీవి తన రాజకీయ అనుభవాల తర్వాత ఖైదీ నంబర్ 150 మూవీతో భారీ అంచనాల మధ్య ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
kajal aggarwal is pregnant
ఈ మూవీలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేసిన ఈ పంచదార బొమ్మ.. మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అందరూ స్టార్ హీరోలతో దాదాపుగా మూవీస్ చేసిందనే చెప్పాలి. తాజాగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.. ప్రెగ్నెంట్ అని ముందు నుంచీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాజల్ చెల్లెలు, నటి నిషా అగర్వాల్ ఇటీవల ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. కాజల్ ప్రెగ్నెంట్ విషయమై ఓ అభిమాని ఆమెను ప్రశ్నించగా.. ఆమె ఏం మాట్లాడకుండా నవ్వుతూ అవును అన్నట్టుగానే తల ఊపింది. దీంతో కాజల్ నిజంగానే తల్లి కాబోతోందని కన్ఫార్మ్ అయింది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.