
kajal aggarwal latest baby bump pics goes viral
Kajal Aggarwal :కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ని చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. 2020 అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఏకంగా నెల రోజుల పాటు మాల్దీవ్స్ లో హనీమూన్ ఎంజాయ్ చేశారు ఈ జంట. ఇక ఈ ఏడాది మొదట్లో కాజల్ ప్రగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించి అందరికి షాకిచ్చాడు కాజల్ భర్త. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని పొందేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ప్రశాంతంగా బిడ్డను కని, తర్వాత కెరీర్ గురించి ఆలోచన చేయవచ్చు. బిడ్డ పుట్టాక కాజల్ బహుశా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం కలదు. హీరోయిన్ ఆఫర్స్ ఇకపై కష్టమే.
ప్రెగ్నెన్సీ తర్వాత కాజల్ ఇంటి పట్టునే ఉంటుంది. గర్భం దాల్చడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలుసుకుంటోంది. స్పెషల్ కేర్ తీసుకుంటోంది. కొత్త విషయాలను నేర్చుకుంటోంది. తాజాగా కాజల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బాల్కనీలో అలా కాజల్ నిల్చుంది. అందులో కొద్దిగా బేబీ బంప్ కనిపిస్తోంది. సూర్యకిరణాలు నన్ను తాకుతున్నాయి.. అవే ఎంతో సురక్షితమైనవి అన్నట్టుగా కాజల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తొలిసారి బేబి బంప్‌లో కనిపిస్తున్న కాజల్‌ని చూసి ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
kajal aggarwal latest baby bump pics goes viral
కాజల్ హీరోయిన్ గా నటించిన మల్టీస్టారర్ ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది.-చిరంజీవి చరణ్ నటిస్తున్న ఈ మూవీలో ఆమె చిరుకు జంటగా నటించారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆచార్యలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక హిందీలో ఒక చిత్రంతో పాటు, తమిళంలో మూడు చిత్రాల వరకూ నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో అధిక చిత్రాలు చేసిన కాజల్… హిందీలో కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. సౌత్ లో లాంగ్ కెరీర్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ నిలిచారు. పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్ వ్యాపార వృద్ధికి కాజల్ తన వంతు సాయం చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.