
Kajal Aggarwal workout video viral
Kajal Aggarwal: కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైంది.రీసెంట్‌గానే బిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టన్నింగ్ బ్యూటీ ఇప్పుడు లోకనాయకుడుకమల్‌హాసన్ పక్కన క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్-2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇండియన్ 2 అనేక అవాంతరాలను దాటుకొని మళ్లీ తిరిగి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం కాజల్ చాలానే కష్టపడుతుంది. కేరళ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తోంది. గుర్రపు స్వారీలు నేర్చుకుంటుంది. జిమ్ లో కూడా పలు కసరత్తులు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది.
తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో దశాబ్దానికి పైగా హీరోయిన్‌గా మెప్పించిన అమ్మడు కాజల్ అగర్వాల్ … గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. బాబు కూడా పుట్టిన తర్వాత పూర్తి సమయాన్ని కుటుంబానికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రొఫెషన్‌గా బిజీగా మారడానికి సమాయత్తమైంది. అందులో భాగంగా ఆమె ఫిట్‌నెస్‌ను తిరిగి తెచ్చుకునే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేయగా, దానికి సంబంధించిన వీడియోని ఇటీవల షేర్ చేసింది.
Kajal Aggarwal workout video viral
ఈ సినిమా ప్రారంభంలో ఈ పాత్ర కోసం ఆమె చాలానే కష్టపడింది. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. అయితే ఆమె షూటింగ్ చేయాల్సిన షెడ్యూల్ సమయానికి కరోనా రావటం.. కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అలాగే శంకర్‌కి, నిర్మాతలతో పొసగక పోవటంతో ఇండియన్ 2 ఆగిపోయింది. చాలా గ్యాప్ తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ గ్యాప్‌లో కాజల్ పెళ్లి చేసుకుని పిల్లాడిని కూడా కనేసింది. ఏదైతేనేం.. సినిమా నుండి తప్పుకోకుండా తనకు కలిసి వచ్చింది. ఈ సినిమాతో కాజల్ మళ్లీ తన పాత ఫాంని చూపిస్తూ దూసుకుపోనుందని అంటున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.