Kamal Haasan : హాస్పిటల్ లో కమల్ హాసన్ టెన్షన్ పడుతున్న అభిమానులు..!!
Kamal Haasan : భారతదేశ విలక్షణ కమలహాసన్ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. బుధవారం రాత్రి చెన్నైలోనే శ్రీరామచంద్ర హాస్పిటల్ లో కమల్ హాసన్ జాయిన్ అయి కొన్ని వైద్య పరీక్షలు కూడా చేయటం జరిగిందట. గత కొద్ది రోజుల నుండి తీవ్ర జ్వరంతో కమల్ బాధపడుతున్నారట. ఇదే సమయంలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారట.
దీంతో కమల్ ఆరోగ్యం క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి.. హుటాహుటిన తీసుకెళ్లడం జరిగింది. అయితే వైద్యులు..కొన్ని టెస్ట్ లు చేసి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని తెలిపారుట. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తున్న.. కమల్ హాసన్ టెలివిజన్ రంగంలో కూడా హోస్టుగా రాణిస్తున్నారు. సినిమాలపరంగా వరుసపరాజయాలతో ఉన్న కమల్ ఇటీవల “విక్రమ్” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవటం జరిగింది.
Kamal Haasan in the hospital
కెరియర్ పరంగా మంచి టైం వచ్చిన క్రమంలో కమల్ అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కమల్ త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో.. “ఇండియన్ 2” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న “ఇండియన్ 2” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
