Home » Entertainment » Kantara Story For Jr Ntr
Entertainment

Jr NTR : కాంతార ఎన్టీఆర్ చేసుంటే.. నందమూరి ఫ్యాన్స్ ట్రెండింగ్..!

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: October 22, 2022 5:31 pm
Advertisement

Jr NTR : రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సూపర్ జోరు కొనసాగిస్తున్న సినిమా కాంతార. కన్నడ రిషబ్ శెట్టీ కథ, దర్శకత్వంతో పాటుగా సినిమాలో హీరోగా కూడా అతనే నటించాడు. డిఫరెంట్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో సత్తా చాటుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా సంచనాలు సృష్టిస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంతార తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అరవింద్ కూడా ఊహించని రేంజ్ లో ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ మూవీతో అల్లు అరవింద్ బాగా లాభాపడుతున్నారు.

Advertisement

ఇక ఇదిలాఉంటే సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ ఈ కథలో తమ హీరో ఉంటే బాగుంతుందని అనుకుటున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కాంతారా లాంటి కథ మా ఎన్.టి.ఆర్ కోసం సిద్ధం చేయండి బాసు అని దర్శక నిర్మాతలని అడుగుతున్నారు. కాంతార ఫర్ ఎన్.టి.ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో నందమూరి ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి పాత్రలో ఒక్కసారి ఎన్.టి.ఆర్ ని ఊహించుకుంటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల్లో నవసరాలను పండించగల స్టార్ ఎన్.టి.ఆర్. ఆయన టచ్ చేసిన జోనర్ లు లేవని చెప్పాలి.

kantara story for Jr ntr

Advertisement

కాంతారా లాంటి కథ తారక్ తో చేస్తే మాత్రం పాన్ వరల్డ్ సినిమాగా మిగిలిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ కూడా అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న తారక్ కాంతార లాంటి కథల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. కొరటాల శివ తర్వాత ఎన్.టి.ఆర్ లిస్ట్ లో త్రివిక్రం, సుకుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా ప్రభాస్ లానే బాలీవుడ్ డైరక్టర్స్ తో కూడా ఎన్.టి.ఆర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే ఎన్.టి.ఆర్ కూడా నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకరిద్దరు బాలీవుడ్ డైరక్టర్స్ తారక్ తో చర్చలు జరిపినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి