
Kanthara : కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు.. టార్గెట్ గట్టిగానే సెట్ చేశారుగా..!
Kanthara : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ కన్నడనాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ఒక్క కన్నడ భాషలోనే ఈ సినిమాకి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రావడం విశేషం. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత కన్నడంలో 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఇదే. తెలుగులో 60 కోట్ల వరకు కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఇప్పుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార:చాప్టర్ 1’ టైటిల్ తోనే ఈ సినిమా రానుంది. ‘కాంతారా 2’ని పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో ఒకే సారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే రిషబ్ శెట్టి ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది.
దీని తర్వాత అతని నుంచి రాబోయే సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ హైఎండ్ లో ఉంటాయి. ఈ మూవీ చిత్రీకరణ 30 శాతం మాత్రమే పూర్తైందని నిర్మాత తెలిపారు. ఈ ప్రీక్వెల్ కోసం చిత్ర యూనిట్ కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. వీలైనంత త్వరగా మూవీ చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనే లక్ష్యంతో యూనిట్ ముందుకువెళ్తోంది. మొదటి పార్ట్‌కి మంచి ఆదరణ లభించడంతో రెండో పార్ట్‌పై అంచనాలు మరింతగా ఉన్నాయి. మొదట 125 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం బడ్జెట్ మరింత పెరిగి 150 కోట్లకు చేరుకుందని టాక్. సినిమా కథ పరంగా, రిషబ్ శెట్టి దీనిని లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్‌గా మలిచారని సమాచారం.
Kanthara : కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు.. టార్గెట్ గట్టిగానే సెట్ చేశారుగా..!
ఈ ప్రీక్వెల్ 1000 కోట్ల మార్క్‌ను చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించనున్నాడని టాక్ నడుస్తుంది.
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ హీట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగా…
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ…
This website uses cookies.