
Suman : కర్మ ఎవరిని వదిలిపెట్టదు..తనపై కుట్ర చేసిన వారు తప్పక అనుభవిస్తారన్న సుమన్
Suman : ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాక ప్రేక్షకాదరణ తెచ్చిపెట్టాయి.సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దేవుడి పాత్రలకే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన ఒక స్టార్ స్టేటస్‌లో ఉండాల్సిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం వెనుక పెద్ద కథ ఉంది. పెద్ద బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఆయన్ని ఓ కేసులో ఇరికించి ఆరు నెలలు జైల్లో పెట్టిన ఘటన ఉంది. సుమన్ కెరీర్‌లో అదొక చేయని మచ్చలా మిగిలింది. లేదంటే ఇప్పుడు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌ల తరహాలో మంచి స్థానంలో ఉండేవాడు సుమన్.
తాజాగా సుమన్ అప్పట్లో తను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. కావాలనే నన్ను ఇబ్బందుల్లో పడేశారు. అప్పుడు మా అమ్మ కన్నీరు కార్చింది.. అమ్మ పడ్డ కష్టాలు వర్ణనాతీతం.. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరో కుట్ర చేశారని అంటూ ఉంటారు. అది ఎవరు అనేది నాకు కూడా తెలియదు. కానీ ఎవరైనా దాని ఫలితాలు అనుభవించాల్సిందే. ఈ ఘటన వల్ల నేను ఇప్పుడు పెద్దగా బాధపడడం లేదు కానీ ఆ సమయంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను .ఆరు నెలలు చాలా కష్టంగా ఉండింది. కానీ ఇప్పుడు దాన్ని పెద్దగా నేను పట్టించుకోవడం లేదు. అయితే అమ్మ విషయంలో మాత్రం చాలా బాధ ఉంది.
Suman : కర్మ ఎవరిని వదిలిపెట్టదు..తనపై కుట్ర చేసిన వారు తప్పక అనుభవిస్తారన్న సుమన్
ఆ సమయంలో అమ్మ ఏడ్చింది ..ఎంతో స్ట్రగుల్ అయింది.. ఆ ఘటన నాకంటే అమ్మకి ఎక్కువగా దెబ్బ కొట్టింది. ఆమె చాలా కృంగిపోయింది . ఆమె బాధ నేను మరణించేంతవరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటూ వెల్లడించారు సుమన్. ఇక్కడ ఎవరు చేశారనేది తెలియదు, నేను దేనికో ఈ కర్మ అనుభవించాను. అలాగే తనకు ఎవరు చేసినా వాళ్లు కర్మ అనుభవిస్తారు, అది ఎవరినీ వదిలిపెట్టదు అంటూ షాకిచ్చాడు సుమన్. ప్రస్తుతం చాలా మందిని చూశాం, ఇలా అనుభవిస్తున్నాడు, ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు, ఆసుపత్రిలో ఇలాంటి స్థితిలో ఉన్నాడు, లేదంటే ఫ్యామిలీ విషయంలో ఇలా అయ్యిందనేది చూస్తుంటాం, వింటుంటాం. అది వాళ్ల కర్మ ఫలం అని, దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని వెల్లడించారు సుమన్.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.