karthik deepam 16 october 2021 full episode
Karthika Deepam 16 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 16 అక్టోబర్, 2021 శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు నాకు కావాలి దీప. ఇప్పటికే ఒకసారి మిమ్మల్ని పోగొట్టుకున్నాను. మళ్లీ పోగొట్టుకునే ఓపిక నాకు లేదు. మోనిత క్రిమినల్ మైండ్ నీకు తెలియదు దీప అంటే.. తెలిసి మీరు మాత్రం ఏం చేశారు చెప్పండి అంటుంది దీప. ఆదిత్య చెప్పినట్టు అమెరికా వెళ్లిపోదామండి.. అని అంటుంది దీప. దానికి భయపడి పారిపోయినట్టు అవుతుందేమో కదా అంటాడు కార్తీక్. భయపడి ఏంటి.. భయపడాల్సి వస్తోంది కదా కార్తీక్. దానికి భయపడతూనే ఉన్నాం కదా.. అంటుంది దీప. ఆలోచించండి డాక్టర్ బాబు అంటుంది.
karthik deepam 16 october 2021 full episode
చూద్దాం.. దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం. ఏమార్గం కనిపించకపోతే అమెరికా వెళ్దాం అంటాడు కార్తీక్. మరోవైపు శౌర్య… ఆ ప్రియమణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆలోచిస్తున్నాను అంటుంది శౌర్య. ఆలోచించడానికి ఏం మిగిలింది మీకు. ఆనవసరమైన చెత్త అంతా బుర్రలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆలోచించింది చాలు. ఇంకేం ఉంది ఆలోచించడానికి అని ప్రశ్నిస్తుంది దీప. ప్రియమణి.. ఆ మోనిత ఆంటి దగ్గర పనిచేసిందట.. నిజమా కాదా.. అని అడుగుతుంది శౌర్య. మనికి మోనిత ఆంటికి గొడవలు అవుతున్నాయి కదా.. తనను ఎందుకు తీసుకొచ్చారు అంటే.. తనకు గడవడం లేదంటే తీసుకొచ్చా అంటుంది. రేపు మోనిత ఆంటిని కూడా పాపం అని ఇంటికి తీసుకురా అంటుంది శౌర్య.
కట్ చేస్తే.. హిమ రూమ్ కు వెళ్తాడు కార్తీక్. తన చేయి పట్టుకొని ఏడుస్తాడు. హిమ.. నా మీద నీకు కోపం రావడం కన్నా.. నువ్వు ఆ కోపంతో జ్వరం తెచ్చుకున్నావు కదా అది నాకు బాధగా ఉంది అమ్మా. నాకోసం బాధపడుతూ నువ్వు హెల్త్ పాడు చేసుకోవద్దు. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు గొడవ పడ్డాం. అలిగాం.. మళ్లీ మాట్లాడుకున్నాం కదరా. నువ్వంటే నాకు ఇష్టం హిమ అంటాడు కార్తీక్. దీంతో తన చేయి లాక్కొని నువ్వంటే నాకు నచ్చడం లేదు డాడీ అంటుంది. నాకు తెలుసు అమ్మా. నేను నీకు నచ్చట్లేదు. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను నమ్ము అమ్మా.. అంటాడు కార్తీక్.
నీకు చెప్పినా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి అంటే.. నేను ఇక్కడ ఉండను డాడీ అంటుంది హిమ. మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అంటే అప్పుడు.. ఇప్పుడు కాదు అంటుంది. నేను బస్తీకి తిరిగి వెళ్లిపోతాను డాడీ అంటుంది. నువ్వు వెళ్లిపోతే నేను ఎలా ఉంటాను అమ్మా. నామీద కోపం ఉంటే తిట్టేయ్.. అరిచేయ్ కానీ.. ఇలా మాట్లాడకుండా ఉంటే ఊపిరి ఆడనట్టు ఉంటుంది.. అని అంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది.
హే రౌడీ మనమందరం బస్తీకి వెళ్లిపోదామా అని అంటాడు. ఈమాట నేను అనలేదు హిమ అంది.. అంటుంది. వెళ్దామా అందరం అక్కడే బస్తీలో ఉందామా? మీ అమ్మ మళ్లీ వంటలక్క అవుతుంది.. అని అన్నా కూడా కార్తీక్ మాటలను ఎవ్వరూ పట్టించుకోరు. హిమ.. ఎప్పుడూ పడుకుంటు జ్వరం తగ్గదు. పదా అలా బయటికి వెళ్లొద్దాం అని చెప్పి హిమను బయటికి తీసుకొస్తుంది శౌర్య. జ్వరం తగ్గిందా అని అడుగుతుంది. ఏమో.. నీరసంగా ఉంది ఇంకా అంటుంది హిమ.మనం నిజంగానే బస్తీకి వెళ్తున్నామా? అని అడుగుతుంది హిమ. ఏమో.. అమ్మను అడిగాను.. ఇంకా ఏం చెప్పలేదు.
నాన్న మీద నీకు ఇంకా కోపం పోలేదా అని అడుగుతుంది. పోలేదు.. మరి నీకు అని అడిగితే నాకు కూడా పోలేదు అంటుంది శౌర్య. డాడీ తప్పు చేసినట్టు అమ్మకు తెలుసు కదా. మరి డాడీని ఎందుకు అడగడం లేదు. మనకు ఎందుకు చెప్పడం అదు.. అప్పుడు అమ్మకు మోనిత ఆంటిని డాడీ పెళ్లి చేసుకోవడం ఇష్టం కావచ్చు కదా.. అని హిమ అంటుంది. మరి అమ్మ బస్తీకి వెళ్దామని అంటే ఎందుకు వద్దంటుంది అని అంటుంది హిమ. ఆ ప్రియమణి.. మోనిత ఆంటి వంట మనిషి అట. అమ్మే తీసుకొచ్చిందట.. అని అంటుంది.
కట్ చేస్తే.. ప్రియమణి ఏడ్చుకుంటూ కార్తీక్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుంది. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. ప్రియమణి ఏమైంది అని అడుగుతుంది. పిల్లలు నన్ను అదోలా చూస్తున్నారు అని అంటుంది ప్రియమణి. తర్వాత మాట్లాడుతాను వెళ్లు అంటుంది దీప.
karthik deepam 16 october 2021 full episode
కట్ చేస్తే సౌందర్య.. మోనిత దగ్గరికి వస్తుంది. ఏంటి.. లేడీ హిట్లర్ వచ్చింది అని అనుకుంటుంది మోనిత. లోపల భయపడుతూనే బయటికి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నావు. భయం నీ కళ్లలో కనిపిస్తోంది అంటుంది సౌందర్య. నాకోసం ఏం తేలేదా.. ఉత్త చేతులతో వచ్చారా? అంటుంది మోనిత. ఇక్కడి నుంచే నా కార్యాచరణ ప్రారంభించాను. న్యూస్ పేపర్ లో నా ఆర్టికల్ చదివారుగా అని మోనిత అనేసరికి.. నువ్వు ఒక్క పేపర్ నే వాడావు. కానీ నేను మాత్రం అన్నింటినీ.. వాడుకుంటాను అంటుంది సౌందర్య. అన్నింట్లోనూ నీ నిజ స్వరూపం బయటపెట్టిస్తాను. నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్షి అని అంటుంది సౌందర్య. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
This website uses cookies.