Karthik Deepam Nirupam On krishnastami
Karthik Deepam కార్తీకదీపం సీరియల్ Karthik Deepam లోని డాక్టర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. అందులో ఆయన వేసే పంచ్‌లు, సెటైర్లు అందరూ వింటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కార్తీక్, డాక్టర్ బాబు పాత్ర మాటలు, చేతలకు దూరంగా ఉంది. కేవలం ఓ బొమ్మలాంటి పాత్రను చేస్తున్నారు. చివరకు మోనిత.. డాక్టర్ బాబును కట్టిపడేసి బంధించేస్థాయికి వెళ్లిపోయింది. కార్తీక్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అలా కార్తీకదీపం రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు పోతోంది.
Karthik Deepam Nirupam On krishnastami
అయితే డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రల్లో నిరుపమ్ తెరపై ఎలా ఉంటాడో.. తెర వెనుక దానికి భిన్నంగా ఎంతో సరదాగా ఉంటాడు. అలాంటి నిరుపమ్ సోషల్ మీడియాలో వేసే పంచ్‌లు, సెటైర్లు మామూలుగా ఉండవు. స్వతాహాగా రైటర్ అవ్వడంతో ప్రాసల్లో మంచి గ్రిప్ ఉన్నట్టుంది. ఆయన పెట్టే కొటేషన్లు, చేసే కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఆయన వేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణాష్టమి సందర్భంగా డాక్టర్ బాబు కన్నయ్యలా మారిపోయాడు.
Karthik Deepam Nirupam On krishnastami
రాధాకృష్ణుడిలా మంజులా నిరుపమ్ పోజులు పెట్టేశారు. ఏదో ఒక ఈవెంట్‌లో అలా పోజులు పెట్టిన ఫోటోను జన్మాష్టమి సందర్భంగా షేర్ చేస్తూ.. గీతా సారం గురించి చెప్పాడు. కృష్ణుడు చెప్పింది తనలా ఉండమని కాదు.. తను చెప్పింది ఫాలో అవ్వమని.. అదే గీతా సారం.. అందరికీ కృష్ణుడి బర్త్ డే శుభాకాంక్షలు అని తన స్టైల్లో నవ్వులు పూయించాడు. మొత్తానికి డాక్టర్ బాబు కాస్తా రైటర్ బాబు అనిపించుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Karthik Deepam Nirupam On krishnastami
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.