Home » Entertainment » Karthika Deepam 01 October 2022 Full Episode
Entertainment

Karthika Deepam 01 Oct Today Episode : మోనితకి వెన్నులో వణుకు పుట్టిస్తున్న దుర్గ… దీప కు మోనిత గురించి చెప్తున్నా కార్తిక్…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 1, 2022 9:53 am
Advertisement

Karthika Deepam 01 Oct Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1472 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దుర్గ మౌనిత కి నామీద కోపం ఇంకా పోలేదు నేను ఇక్కడ ఉండను అని హోటల్ కి వెళ్ళిపోతున్న దుర్గని.. కార్తీక్ ఆపి తన కోపం ఎన్ని రోజులు ఉండదులే నీ బిజినెస్ పనులు అయ్యేవరకు ఇక్కడే ఉండు అని చెప్తాడు. అప్పుడు దుర్గ సరే సార్ నా లగేజ్ తెచ్చుకుంటాను అని దుర్గ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. దీప మౌనిత కొద్దిసేపు ఘర్షణ పడి తర్వాత అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక దుర్గ నా ఎంట్రీ తోనే మౌనిత వణికి పోతుంది దీపమ్మ అని అంటాడు. దుర్గ. అప్పుడు దీప దానికి నువ్వు చుక్కలు చూపించాలి. అది నా డాక్టర్ బాబుని వదిలేసి వెళ్లిపోయేలా చేయాలి అని దుర్గకి చెప్పి పంపిస్తుంది. ఇక మౌనిత దుర్గని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలని ఆలోచిస్తూ ఉండగా.. కార్తీక్ అక్కడికి వచ్చి దుర్గ గురించి అడుగుతూ ఉండగా.. దుర్గ ఎంట్రీ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ మీ ఫ్రెండ్ వచ్చాడు కదా ఏదైనా స్పెషల్ వంట చేసుకుని తీసుకొని రాపో అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అప్పుడు దుర్గా వామ్మో నేను హోటల్ లో తింటాను ఈమె చేతి వంట నేను సంవత్సరం తిన్నాను ఆ సంవత్సరమే నేను తినలేక పోయాను ఇంక మళ్ళీ ఎక్కడ తింటాను సార్ అని చెప్తూ ఉంటాడు.

Advertisement

అంతలో దీప భోజనం తీసుకుని వస్తుంది. ఇక కార్తీక్ దుర్గకి మౌనిత ఒక సంవత్సరం పాటు వండిపెట్టిందంట పాపం తినలేక చచ్చాడంట అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఇదంతా అబద్ధం కార్తీక్ నువ్వు నమ్మకు అని చెప్తూ ఉండగా.. దుర్గా ఇక అది నిజమని చెప్పడానికి మన మధ్యన జరిగిన చాలా విషయాలను చెప్పాల్సి వస్తుంది మోనిత అని డ్రామా ప్లే చేస్తూ ఉంటాడు. ఆ డ్రామాలో కార్తీక్ కి మౌనిత పై అనుమానం వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకులే కానీ భోజనం చేద్దాం రండి అని అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత మౌనిత దీపని పక్కకి లాక్కెళ్ళి నువ్వేం చేస్తున్నావే నీకు అర్థమవుతుందా అని అంటుంది. అప్పుడు దీప, దుర్గా గురించి నన్ను అడుగుతున్నావేంటి నీకంటే బాగా తెలుసా నాకు ..నువ్వు ఒక భార్యవి ,ఒక లవర్ వి నీకే అన్ని విషయాలు తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక మౌనిత మీలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా నన్ను కార్తీక్ని విడదీయలేవరు అని అంటూ ఉంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబుకి ఏ మందులు వాడుతున్నావో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు మౌనిత నువ్వు అడగగానే అంత ఈజీగా ఎలా చెప్తాను అనుకున్నావే అని అంటుంది. అప్పుడు దీప నీతో నిజం చెప్పించే టైం ఆరంభమైంది. నీతో నిజం చెప్పిస్తాను అని అంటుండగా… కార్తీక్ వచ్చి ఏం నిజం వంటలక్క అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దీప డాక్టర్అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన దగ్గరనుంచి కంగారుగా ఉంటున్నారు ఎందుకు కంగారుగా ఉంటున్నారు అని నేను అడుగుతున్నాను. తను ఏమి చెప్పట్లేదు అని అంటుంది. అప్పుడు కార్తీక్ అవును నిజమే మోనిత ఎందుకు అలా ఉంటున్నావు చెప్పు అని అంటాడు.

Karthika Deepam 01 october 2022 full episode

Advertisement

అప్పుడు మౌనిత అదేం లేదు అని కంగారుపడుతూ కార్తీక్ ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక తర్వాత దుర్గ, దీప ఇంటి దగ్గర కూర్చుని ఉండగా.. దీప వెల్లి నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు మౌనితకి కొంచెం కూడా టైం ఇవ్వద్దు దాన్ని ఎన్నులో వణుకు పుట్టించాలి. అది ఇక్కడి నుంచి పారిపోయేలా చేయాలి. అది నాకు ఎలాంటి ముద్ర వేసిందో దాన్ని కూడా అదే ముద్ర వేసి పారిపోయేలా చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇక సరే అని దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోనిత దుర్గని చూసి నువ్వేం చేస్తున్నావ్ రా ఇక్కడినుంచి వెళ్ళిపో లేకపోతే నేనేం చేస్తాను అని చేయి లేపుతుండగా.. అప్పుడు దుర్గ తన చేతిని పట్టుకుని రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సీన్ ని చూసిన కార్తిక్ వాళ్లపై అనుమాన పడుతూ ఉంటాడు. ఇక దుర్గ కార్తీక్ కిఏదో ఒకటి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఇక మౌనిత కూడా నిజం చెబుతూ ఉండగా.. శివ ఎక్కడ అని కార్తీక్ అడుగుతాడు అప్పుడు మౌనిత బయటికి వెళ్ళాడు అని చెప్తుంది. అంటే వారిని కూడా బయటికి పంపించావా అని అనుమానంగా మాట్లాడుతూ… అక్కడ నుంచి వెళ్లి దీప దగ్గర కూర్చొని నా మనసు అసలు ఏమీ బాగాలేదు వంటలక్క అని అంటుండగా.. దీప ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు తనకి జరిగిందంతా చెబుతూ ఉండగా శివ. సారు మేడం మిమ్మల్ని అలా రెండు గంటలు బయట తిప్పుకొని తీసుకొని రమ్మంది అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు అగాల్సిందే..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి