Karthika Deepam 02 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1447 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీకదీపం డాక్టర్ అన్నయ్య, పెద్దావిడ అందరూ తెగ బాధపడిపోతూ ఉంటారు. కానీ దీప వాళ్లకి ధైర్యం చెప్పి నేను మీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తాను. మీరు ఏమి బాధపడకండి. ఆ రాక్షసి నుండి నా భర్తని కాపాడుకోవాలి. లేదంటే అది నా భర్తని ఊరు దాటిస్తుంది నాకు కాకుండా చేస్తుంది. అని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హిమ పుట్టినరోజుకి సౌందర్య వెళ్లి బట్టలు తెచ్చుకోమని చెప్తుంది. అప్పుడు హిమ ఈసారి నాకు సెలబ్రేషన్స్, బట్టలు ఏమీ వద్దు నాయనమ్మ. ఈసారికి అదే డబ్బులు పెట్టి అనాధ శరణాలయంలో పిల్లలకి బట్టలు, స్వీట్స్ తీసుకెళ్దాం అని అంటుంది. సరేలే ఇద్దాము.. అంతే నీ సెలబ్రేషన్స్ కూడా ఎప్పటిలాగే చేసుకుందువు గాని అని అంటుంది. అప్పుడు వద్దు నాయనమ్మ ఇక్కడ నేను సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటే.. అక్కడ సౌర్య పరిస్థితి ఏంటి అని అంటుంది హిమ.
అప్పుడు సౌందర్య నేనేం చేయని అదేమో రమ్మంటే రాకుండా అక్కడ అనాధ లాగా బ్రతుకుతుంది అని అంటుంది. తనకి నా మీదనే కదా కోపం. నేను వెళ్ళిపోతే వస్తుందేమో అని హిమ అంటుంది. అప్పుడు సౌందర్య ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే నీ చెంప పగలగొడతా అని అంటుంది. అప్పుడు ఆనందరావు మీరు ఇద్దరు కూడా మా రెండు కళ్ళు లాంటోళ్లు నువ్వు అలా మాట్లాడకమ్మా అని అంటాడు. ఇక సౌందర్య వెళ్లి బట్టలు కొనుక్కోచుకో తాత నువ్వు వెళ్లి అని అంటుంది. దాంతో ఇద్దరు వెళ్ళిపోతారు. కట్ చేస్తే కార్తీక్ శివతో బయటికి వచ్చి మీ మేడమ్ ఏంటి వంట లెక్క పేరు ఎత్తగానే అంత మండిపోతుంది. అని శివని అడుగుతాడు. అప్పుడు శివ సార్ మీకు నా పేరు గుర్తుండడం లేదు.. మేడం పేరు గుర్తు ఉండడం లేదు.. కానీ ఆ వంట లెక్క పేరు, ఆవిడ మిమ్మల్ని పిలిచిన పేరు గుర్తుంచుకున్నారు.. అందుకనే ఆవిడ అంటే మేడం భయపడుతున్నారు. అని అంటాడు. అప్పుడు కార్తీక్ అంతేనంటావా.. సరేగాని మీ మేడంకు మాత్రం ఒక వంట మనిషిని తీసుకెళ్లాలి అని అంటాడు. అప్పుడు శివ బిర్యానీ స్మెల్ చూస్తూ.. ఇక్కడ ఎవరో బిర్యాని వండుతున్నారు సార్ మంచి స్మెల్ వస్తుంది అని అంటాడు.
అప్పుడు కార్తీక్ నిజమేనయ్య మంచి స్మెల్ వస్తుంది. అని మౌనిత దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎవరో వంట చేస్తున్నారు చాలా బాగా స్మెల్ వస్తుంది ఆవిడ ఎవరైనా మనం తెచ్చేసుకుందాం అని అంటూ..తనను తీసుకొని వస్తూ ఉండగా.. అప్పుడు అక్కడ వంట చేసేది దీప నే. అది చూసిన మౌనిత భయపడిపోతూ ఉంటుంది. కార్తీక్ మాత్రం నువ్వా అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ నాకు అసలు ఏమీ గుర్తుండదు కానీ మీరు గుర్తున్నారు అని దీపతో అంటాడు. అప్పుడు దీప సంతోష పడిపోతూ ఉంటుంది. తర్వాత దీప తన పేరుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అందరినీ చెప్పి.. కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మీరు మా ఇంట్లో వంట మనిషిగా చేరుతారా అని అడుగుతాడు. అప్పుడు దీప నేనేదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడ వంట చేసుకుంటున్నాను సార్.. నాకు ఒకరి ఇంట్లో లో వంట చేయడం ఇష్టం ఉండదు..
కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమి కావాలంటే అది చేసి పెడతాను అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఓహో సరేలే ఏం కావాలంటే అది చేసి పెడతావా అని అంటాడు. మౌనిత భయపడిపోతూ ఉంటుంది. తర్వాత మౌనిత నువ్వు వెళ్ళు కార్తీక్ నేను మాట్లాడొస్తా అని అంటుంది. అప్పుడు కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మౌనిత దీపతో ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి నా కార్తీక్ ని వేరు చేయలేవు అని అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు ని తీసుకెళ్లింది నువ్వు.. నా డాక్టర్ బాబు నా దగ్గరికి వచ్చేలా నేను చేసుకుంటా అని శబదం చేస్తుంది. ఇక కార్తీక్ దీప అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప బిర్యాని వండుకొని కార్తీక్ కోసం తీసుకొచ్చి తనకి వడ్డిస్తూ గతం గుర్తొచ్చేలాగా చేస్తూ ఉంటుంది. కార్తీక్ తింటూ ఉంటాడు. మౌనిత మాత్రం భయపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.