Karthika Deepam 18 August 2022 Full Episode
Karthika Deepam 04 August 2022 Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 4 గురువారం ఎపిసోడ్ 1422 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. నిరుపం నిద్రలేచి ప్రేమ్, హిమ లను గట్టిగా పిలుస్తాడు. అప్పుడు ప్రేమ్, హిమ వాళ్లు అక్కడికి వచ్చి డోర్ తీస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి తీసేస్తారు. అప్పుడు సౌర్య ,నిరూపం బయటికి వచ్చి ఇంత చిన్న తాలానికి మమ్మల్ని నైట్ అంతా రూమ్ లో ఉంచుతారా.. అని అంటారు. అప్పుడు ప్రేమ్ తాళం చిన్నదా, పెద్దదా అని కాదు. ఇక్కడ దాన్ని పగలగొట్టడానికి ఏమీ దొరకలేదు అని అంటాడు. అలా అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు సౌందర్య, సౌర్యను నిన్ను కిడ్నాప్ చేసేది ఎవరే అని అడుగుతుంది. అంటే నేనొక ఆటో దాన్ని నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు అని అంటున్నావా నాయనమ్మ. అది కాదే నువ్వు ఎందుకు అలా అపార్థం చేసుకుంటావు. అని అంటుంది సౌందర్యం. ఆనందరావు కారుకి, ఆటోకి తేడా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శౌర్య కారు, ఆటో పక్క పక్కన పెడితే ఏది గొప్ప అంటారు కారే కదా.. అని అంటుంది శౌర్య.
అప్పుడు ప్రేమ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు శౌర్య అయిపోయింది కదా వదిలేయ్ అని అంటాడు.అప్పుడు నా బతుకు అంతా ఇలా వదిలేసుకుంటూనే వస్తున్నాను. అని బాధపడుతూ ఉంటుంది. సరేలే సౌర్య నేను ఆ వివరాలు ఏమీ అడగను నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు అదే చాలు మాకు. అని అంటుంది. సౌందర్య. ప్రేమ్ శౌర్య కిడ్నాప్లో నిరూపము కూడా ఇరుక్కుపోయాడు. అని అంటుండగా.. సౌందర్య మీరు బయట ఉండి తాళం ఎలా తీయలేకపోయారు అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ నేను జరిగిందా చెప్తాను అమ్మమ్మ అని అంటుండగా.. శౌర్య టీ, పాప్కాన్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని డీటైల్స్ గా మాట్లాడుకోండి అని అంటుంది. అప్పుడు సౌందర్య, హిమ ఇప్పుడు ఆ టాపిక్ ఏం మాట్లాడకండి వదిలేయండి. ఇంతటితో అని అంటారు. మీరు ఫ్రెష్ అవ్వండి. నేను టిఫిన్ చేస్తాను అని అందరికీ చెప్తుంది సౌందర్య. అప్పుడు ప్రేమ్ అమ్మమ్మ మూడు రకాల టిఫిన్ చేయి అని అంటాడు. అప్పుడు సౌందర్య మూడు రకాల టిఫిన్ ఏంట్రా అని అంటుండగా.. అందరి మూడు బాగాలేదు కదా అందుకే అని ఒక్కడే నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ ప్రేమ్ వైపు కోపంగా చూస్తారు.
Karthika Deepam 04 August 2022 Full Episode
ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సౌందర్య ఏమైంది ఏంటి నీ బాధ,సౌర్యాన్ని కిడ్నాప్ చేశారు నీకు తెలుసా.. నాకెందుకు ఆ విషయాలు అన్ని చెప్తున్నావ్ నాకు అవసరం లేదు నా కొడుకుల కోసం నేను వచ్చాను. నా కొడుకుల్ని, నీ మనవరాలు కోసమే కన్నట్టుంది. ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు ఇద్దరు. ఈ కొరివిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఈరోజు కిడ్నాప్ చేశారు. రేపు ఏం చేస్తారు. ఈ గొడవలో నా కొడుకులు ఎక్కడ బలవుతారు అని నాకు భయంగా ఉంది. ఈ హిమ వల్ల కొందరు జీవితాలు పోయాయి. ఈ సౌర్య వల్ల ఇంకొందరి బతుకులు నాశనం అయ్యేలా ఉన్నాయి. అని అంటుంది. అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావ్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావట్లేదు అని ప్రేమ అంటాడు. నీకేమైంది ఈ కొంపను వదిలేలా లేరు.. నేను చస్తే గాని ఈ టెన్షన్ నాకు వదిలేలా లేదు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.కట్ చేస్తే శోభ తన అనుకున్నది జరగట్లేదని చిరాకు పడుతూ ఉంటుంది. స్వప్న అక్కడికి చిరాగ్గా వస్తుంది. అప్పుడు స్వప్నని ఏమైంది అని అడుగుతుంది శోభ.
అప్పుడు జరిగిందంతా చెబుతుంది. అప్పుడు శోభ స్వప్నకి ఏం చేయాలి ,ఎలా చేయాలి అని ప్లాన్ చెప్తుంది. నిరుపమని ఇంటికి తీసుకురావడానికి ఒక గట్టి ప్లానే వేస్తారు ఇద్దరూ. కట్ చేస్తే సౌందర్య ఆనందరావు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది. ఇలా జరగడానికి కారణం ఏమే అయి ఉంటుందా. సౌర్యను, నిరుపం ను కలపాలని ఇలా ప్లాన్ చేసిందా. అని అనుకుంటూ.. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే నండి అనుకున్న ముహూర్తానికి హిమ, నిరూపంలకి పెళ్లి చేయడం. అని అంటుంది సౌందర్య. ఆనందరావు అదేంటి సౌందర్య హిమకు ఇష్టం లేదు కదా.. దాన్ని ఏదో విధంగా కన్విన్స్ చేద్దాం లేండి మనం అని సౌందర్య అంటుంది. కట్ చేస్తే ఆనందరావు సౌర్య దగ్గరికి వస్తాడు. తనకి మంచి మాటలు కొన్ని చెప్తూ ఉంటాడు. అప్పుడు శౌర్య తాతయ్య మనం ప్రవచనాలు వినాల్సిన అవసరం లేదు జీవితం అనే బండి మనకి చాలా నేర్పిస్తుంది. సరే అమ్మ విశ్రాంతి తీసుకో అని ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కానీ సౌర్య నిరూపం గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది.హిమ సౌర్య, నిరుపంలాలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. వాళ్ళు కలిసేలా కనిపించట్లేదు. నేను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా.. సౌందర్య హిమ, నిరుపంల పెళ్లి కార్డు తీసుకొచ్చి చూపిస్తుంది. ఇదేంటి నానమ్మ అని అనగా సౌందర్య ఇది పెళ్లి కార్డు అనుకున్న ముహూర్తానికి నీకు నిరూపముకి పెళ్లి జరిగి తీరాలి అని గట్టిగా అంటుంది. అప్పుడు హిమ నానమ్మ నేను నిరూపం, సౌర్యలను కలపాలని అనుకుంటున్నా.. అనగానే సౌందర్య, హిమ చెంప పగలగొడుతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే మళ్లీ కొడతాను ఏమనుకుంటున్నావు. నాయనమ్మ నేను చెప్పేది విను. ఇక నువ్వు చెప్పింది వింటాల్లేవు. ఇక నేను చెప్పింది నువ్వు వినాలి. నిర్పంతో నీ పెళ్లి జరిగి తీరుతుంది థిస్ ఇస్ ఫైనల్ హిమ అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.