Karthika Deepam 08 Oct Today Episode : బుల్లితెరపి ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1478 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప, డాక్టర్ బాబు ని చూసి గబగబా డాక్టర్ బాబు దగ్గరికి వస్తుంది. అప్పుడు కార్తీక్ ఏంటి వంటలక్క ఓసారి దీపా ఇక్కడ వచ్చావ్ అని అనగానే.. మీరేంటి నాకు చెప్పకుండా అలా వచ్చేసారు మీ పుట్టినరోజుకి బట్టలు పండ్లు పంపిణీ చేద్దాం అని చెప్పాను కదా అనగానే… కార్తీక్ మోనితకి కూడా ఏదో మాట ఇచ్చానంట తను ఇక్కడికి తీసుకొచ్చింది . అయినా మీకు ఇచ్చిన మాట కూడా చేసేద్దాం ఏం కంగారు పడకు అని దీపకి మాటిస్తాడు. ఇక మౌనిత కంగారుపడి ఫామ్ ఫిలప్ చేయకుండానే కార్తీక్ ని ఆక్కడనుంచి తీసుకెళ్లి పోతుంది. ఇక డాక్టర్ జీవితంలోనే కాదు ఫామ్ ఫిలప్ చేయడంలో కూడా కార్తీక్ ని భర్తగా ఊహించుకోలేక పోతుంది అని అంటారు. ఇక గండ నేత్రదానం ఇచ్చినట్లుగా డ్రామాడుతూ కారులో ఉన్న ఆపిల్ ని దొంగతనం చేసి అది తీసుకెళ్లి సౌర్యకి కళ్ళు దానం ఇచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ విషయాన్ని సౌర్య, చంద్ర కూడా నమ్ముతారు. ఇక దీప ఇప్పుడేం చేద్దాం అన్నయ్య అనే డాక్టర్ని అడుగుతూ ఉంటుంది.
అప్పుడు డాక్టర్ ,వలలో చిక్కిన చెప ఎక్కడికి పోతుంది మన చేతికి దొరుకుతుంది నువ్వేం కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. వాళ్లు కూడా అక్కడ్నుంచి వెళ్తూ ఉంటారు. మౌనిత కార్తీక్ కావేరి వాళ్ళ ఇంట్లో కూర్చుని టీ తాగుతూ ఉత్సవాల గురించి మాట్లాడుతూ ఉండగా… కార్తీకి ఒకపక్క డౌటు వస్తూనే ఉంటుంది. మోనీత, కావేరి కలిసి ఏదో ఒక డ్రామా ప్లే చేస్తూనే కార్తీక్ నమ్మేలా చేస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ చదువు అనగానే గతం గుర్తు చేసుకుంటూ నాకేదో గుర్తుకొస్తుంది అని చెప్తూ ఉంటాడు.అప్పుడు మౌనిత నువ్వు నరసయ్య వాళ్ళ పిల్లల్ని చదివిస్తానని మాట ఇచ్చావు కదా అదే గుర్తుకొస్తుంది అని చెప్తూ ఉంటుంది. కానీ కార్తీక్ అది కాదు మౌనిత. నువ్వేదో చెప్తావు నాకు ఇంకోటి ఏదో గుర్తొస్తుంది మొన్న కూడా అలాగే అన్నావు నువ్వు ఒకటి చెప్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఈరోజు కూడా అలాగే గుర్తొస్తుంది అనగానే… అప్పుడు కావేరి నువ్వు కళ్ళముందు జరిగేది వదిలేసి గతం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని అంటూ మౌనిత కార్తీక్ ని బయటకు తీసుకెళ్ళు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, మౌనిత బయటికి వెళ్తారు. కట్ చేస్తే డాక్టర్, పెద్దావిడ, దీప రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. అప్పుడు డాక్టర్, దీపకి సాయం కావాలని అడుగుతూ ఉంటాడు.
అప్పుడు దీపని రాజ్యలక్ష్మి నీ సమస్య ఏంటమ్మా చెప్పు అని అనగానే దీప జరిగిందంతా చెప్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి మా ఊరు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా అని అనగానే దీప నేను చెప్పేది నిజమమ్మ నా భర్తకి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి సరే ఇప్పుడు ఈ ఉత్సవాలు కానిద్దాం తర్వాత నీ విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్తుంది. అప్పుడు దీప సరే అన్నయ్య నేను డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళొస్తాను అని బయటికి వెళ్తా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ బాబు, పెద్ద ఆవిడ దీప గురించి చెప్పి సాయం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సరేలే ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత చూద్దాం ఈ విషయంలో కొంచెం ఆచితూచి అడగేయాలి అని అంటూ ఉంటుంది రాజ్యలక్ష్మి. కట్ చేస్తే మౌనిత కార్తీక్ వస్తుండగా మౌనిత కావేరి కలిసి సెట్ చేసిన మనుషులు వాళ్ళని పలకరిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మౌనిత మీకు ఇప్పటికైనా అనుమానం పోయిందా కార్తీక్ అనగానే… కార్తీక్ వంటలక్కది కూడా ఈ ఊరే కదా… వాళ్ల ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు మౌనిత కోపంగా ఆ వంటలక్క గురించి నువ్వు వదిలేయి అని చెప్తూ ఉంటుంది.
ఆ వంటలక్క భర్తతోనే మాట్లాడాలి. వంటలక్క నా వెంట పడడం నీకు ఇష్టమా అని అంటూ తన ఇంటికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అంతలో దీప అక్కడికి వస్తుంది. అప్పుడు దీప కార్తీక్ బాబు మీకోసం నేను వెతుకుతున్నారు ఎక్కడికి వెళ్లిపోయారు అనగానే… అప్పుడు కార్తీక్ మీ భర్తతో నేను మాట్లాడాలి మీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు సరే రండి అని తీసుకెళ్తూ ఉండగా.. మౌనిత దీపపై మండిపడుతూ ఎందుకే నాకెంత అన్యాయం చేస్తున్నావ్ నా భర్త నన్ను వదలవా అని డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. అంతలో కావేరి సెట్ చేసిన ఇద్దరు మనుషులు వచ్చి దీపని నానా మాటలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు కార్తీక్ వాళ్ళ మాటలను నమ్మి నాకు ఇప్పుడు మూడు లేదు నేను తర్వాత వస్తాను వంటలక్క మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీప డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అందరూ బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. తర్వాత మౌనిత దీప నడుమన గట్టి ఘర్షణ జరుగుతుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.