Karthika Deepam 9 May Today Episode : ఫంక్షన్ లో హిమను చూసి జ్వాల షాక్.. నిరుపమ్, హిమకు పెళ్లి అని తెలుసుకొని హిమపై మరింత పగ పెంచుకున్న జ్వాల

Karthika Deepam 9 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1347 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ గురించే తలుచుకుంటూ ఉంటాడు ప్రేమ్. ఐలవ్యూ హిమ.. నువ్వంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే చెప్పలేకపోతున్నా. కాదు కాదు.. నువ్వంటే బోలెడంత ఇష్టం.. అనుకుంటాడు. ఈరోజు మమ్మీ వాళ్ల మ్యారేజ్ ఫంక్షన్ లో ఎలాగైనా హిమకు ప్రపోజ్ చేస్తాను. నావల్ల కాదు. నా ప్రేమ హిమకు చెప్పేస్తాను అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు.. రెస్టారెంట్ లో కూర్చున్న జ్వాల.. డాక్టర్ సాబ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య నువ్వు లక్కీనే. డాక్టర్ సాబ్ ఇంకేం చెబుతాడు. ఐలవ్యూ అని చెబుతాడు. నేను ఎంత అదృష్టవంతురాలినో అని అనుకుంటుంది.

karthika deepam 09 may 2022 full episode

మరోవైపు నిరుపమ్ కు ఫోన్ చేస్తుంది జ్వాల. నువ్వు ఇంకా వెళ్లలేదా అని అడుగుతాడు. ఏసీలో కాసేపు కూర్చొని వెళ్తాను అంటుంది. ఇంతలో మళ్లీ నిరుపమ్ రెస్టారెంట్ కు వస్తాడు. నీకో గిఫ్ట్ ఇద్దామని వచ్చా అంటాడు. ఏంటిది అంటే తీసి చూడు అంటాడు నిరుపమ్. చూస్తే అందులో ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ను చూసి జ్వాల షాక్ అవుతుంది. ఈ ఫోన్ నాకేనా అంటే.. అవును అంటాడు. మమ్మీ ఫంక్షన్ కు వస్తుందో రాదో అనుకున్నా కానీ.. మమ్మీని నువ్వే ఫంక్షన్ కు ఒప్పించావు. నువ్వు నిజంగా గ్రేట్.. గొప్ప హెల్ప్ చేశావు అంటాడు నిరుపమ్.

దీంతో నాకు దీన్ని వాడటం రాదు అంటుంది. దీంతో ఫోన్ ను ఎలా వాడాలో అన్నీ చూపిస్తాడు నిరుపమ్. ఇద్దరూ కలిసి ఫోటో దిగుతారు. మరోవైపు హిమ.. శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్యకు నా గురించి తెలిస్తే ఎలా రెస్పాండ్ అవుతుందో అని అనుకుంటుంది.

నేను నీతో ఇంత ప్రేమగా ఉంటే.. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా అని నన్ను ఏం అంటుంది అని అనుకుంటుంది. నా మీద కోపం ఎక్కువైపోయి మళ్లీ ఎక్కడికైనా వెళ్లిపోతే ఎలా. బావా ఎంత పని చేశావు.. నువ్వు జ్వాలను ఎందుకు పిలిచావు అని అనుకుంటుంది హిమ.

మరోవైపు ఆనంద రావుకు ఫోన్ చేసి సంతోషం వ్యక్తం చేస్తుంది సౌందర్య. స్వప్న, సత్యం పెళ్లి రోజు ఫంక్షన్ చేస్తున్నామని చెబుతుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. ఏంటి అమ్మమ్మ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అంటాడు. ఈ మ్యారేజ్ డే ఫంక్షన్ కు మా మమ్మీ వస్తోంది అంటాడు.

Karthika Deepam 9 May Today Episode : అందరికీ ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా అని ప్రేమ్ తో చెప్పిన సౌందర్య

ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడుగుతుంది. దీంతో అన్ని పనులు పూర్తి చేశాం. రేపు అక్కడ సింపుల్ గా చాలా బాగుంటుంది చూడు.. అంటుంది. నేను మీకు అందరికీ అక్కడ ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటుంది సౌందర్య. దీంతో ఏంటది చెప్పు అంటాడు.

ఇప్పుడు చెప్పను అంటుంది సౌందర్య. మరోవైపు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. హిమకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. శౌర్యకు ఫోన్ కనెక్ట్ అవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఇంతలో ఫంక్షన్ కు అందరూ చుట్టాలు వస్తూ ఉంటారు.

ప్రేమ్.. మాత్రం అమ్మమ్మ ఏం చెబుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జ్వాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నిరుపమ్. హిమకు తన ప్రేమను జ్వాలతో చెప్పించాలని అనుకుంటాడు నిరుపమ్. మరోవైపు ప్రేమ్.. హిమ దగ్గరే ఉంటాడు.

తనకు ఎలా తన ప్రేమ విషయం చెప్పాలా అని అనుకుంటాడు. నువ్వంటే వాడికి కొంచెం శ్రద్ధ ఎక్కువే అంటుంది సౌందర్య. మరోవైపు జ్వాల.. ఫంక్షన్ కు వెళ్లేందుకు రెడీ అవుతుంది. పిన్నీ.. ఈ చీర ఎలా ఉంది. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. ఈ చీరలో నువ్వు గొప్పింటి అమ్మాయిలా కనిపిస్తున్నావు తెలుసా అని అంటాడు ఇంద్రుడు.

దీంతో నేను పుట్టింది గొప్పింట్లోనే బాబాయి అని మనసులో అనుకుంటుంది. చంద్రమ్మ కూడా అదే అంటుంది. పదమ్మా.. ఫంక్షన్ కు టైమ్ అవుతుంది అంటే.. నువ్వు కూడా వస్తున్నావా అని అంటుంది జ్వాల. వద్దులే అమ్మ.. అక్కడికి వచ్చాక పాడు చేతులు ఊరుకోవు అంటాడు.

సరే.. నీకోసం కారు తెప్పించాను అంటాడు ఇంద్రుడు. మరోవైపు సత్యం అప్పుడే కారులో వస్తాడు. స్వప్న కూడా వస్తుంది. ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకుంటారు. ఏంటి నాతో కలిసి వద్దామనుకుంటున్నారా అని అడుగుతుంది స్వప్న.

నాకు అంత ఆశ లేదు అంటాడు. ఈ ఫంక్షన్ కు వచ్చానని.. రావడానికి ఒప్పుకున్నానని ఓవర్ చేయకండి అంటుంది స్వప్న. దీంతో ఇది మన మ్యారేజ్ యానివర్సరీ డే అంటాడు సత్యం. జీవితంలో కలిసి నడవలేకపోయినా.. ఫంక్షన్ కు అయినా కలిసి వెళ్దాం పదా అంటాడు.

ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే జ్వాల వస్తుంది. అక్కడ సౌందర్యను చూసి షాక్ అవుతుంది. నిరుపమ్, హిమకు ఈ సందర్భంగా పెళ్లి చేయబోతున్నాం అని చెబుతుంది. దీంతో ప్రేమ్, జ్వాల షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

7 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

8 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

9 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

11 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

12 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

13 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

14 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

15 hours ago