Karthika Deepam 09 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ఎంతగానో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 1453 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ కిజరిగింది గుర్తుచేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నాకు గుర్తుకు రావడం లేదు అని అంటుండగా.. దీప చిన్న చిన్న గుర్తులను చెప్పు జరిగిందంతా గుర్తొచ్చేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అవును అని నేను రోడ్డు మీద నిలబడి అందర్నీ ఇంటి అడ్రస్ అడుగుతూ ఉండగా ఎవరు మీ ఇంటి అడ్రస్ నీకు తెలియకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది అని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు.. అంతలో దీప అక్కడికి వచ్చింది నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చింది అని మౌనితకి చెప్తాడు. అప్పుడు కరెక్ట్ గా చెప్పానా వంటలక్క అని అడుగుతాడు. అప్పుడు దీప సంతోషంతో జరిగింది జరిగినట్లుగా చెప్పారు అని అంటుంది. అప్పుడు దీప ని పొగుడుతూ ఉంటాడు కార్తీక్.
ఇక మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అని అంటుంది. అప్పుడు మౌనిత బాధ్యత ఏంటి నీ మనిషా అని దీపపై మండిపడుతూ ఉండగా.. కార్తీక్ మౌనితను తిట్టి సారీ చెప్పు తనకి అని అంటాడు గట్టిగా. అప్పుడు మౌనిత దీపకు మండిపోయేలా తనకి స్వారీ చెప్తూ మా ఆయన్ని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ అని అంటూ ఉండగా… అప్పుడు దీప నువ్వు మా ఆయన అని పదిసార్లు అన్నంత మాత్ర నా భర్త నీ భర్త అవ్వడు. అప్పుడు కూడా ఇలాగే చేశావు అప్పుడు నా డాక్టర్ బాబు నిన్ను తన్ని తరిమి వేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది నా డాక్టర్ బాబు నా దగ్గరికి వస్తాడు అని అంటుంది. అప్పుడు ఇక దీప నేను వెళ్తున్నాను డాక్టర్ బాబు రేపు వినాయకుడు పండుగ జరుపుకుంటున్నాను మీరు తప్పక రావాలి అని అంటుంది. అప్పుడు సరే వంటలక్క తప్పకుండా వస్తా అని అంటాడు. ఇక అప్పుడు దీప సంతోషంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య వినాయకుడు బొమ్మలు అమ్మడానికి వెళ్తూ ఉండగా గండ, చంద్ర వద్దమ్మా నువ్వు చిన్నపిల్లవి అని అంటుండగా.. సౌర్య నేను అలా వెళ్తుంటేనే మా అమ్మ నాన్నలు కనిపిస్తారు అని వెళ్ళిపోతుంది. ఇక కట్ చేస్తే మౌనిత కార్తీక్ నీ ఎలాగైనా దీప దగ్గరికి వెళ్లకుండా చేయాలి అని ఆలోచిస్తుండగా..
కార్తీక్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ మౌనిత అని అంటాడు. అప్పుడు రేపు దీప రమ్మంది కదా మీరు అక్కడికి వెళ్ళద్దు అని అంటుంది. అదేంటి మౌనిత అలా అంటావు అని తను నాకు ఎంతో హెల్ప్ చేసింది పాపం పిలిచింది కదా వెళ్లాలి కదా అని అంటాడు. అప్పుడు వద్దు కార్తీక్ నా భయం నాకు ఉంటుంది. నాకోసం వెళ్లవద్దు అని అంటుంది. అప్పుడు కార్తీక్ సరే నేను వెళ్ళను కానీ ఆ వంటలక్కనే ఇక్కడికి రమ్మను లేకపోతే నేను వెళ్తాను అక్కడికి అని అంటాడు. అప్పుడు సరే అని మౌనిత అనగానే కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక మౌనిత ఆవేశంలో అన్ని విసిరేస్తు మండిపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ వల్ల ఇంటికి వెళ్లి పెద్దావిడకి జరిగిందంతా చెప్పి నాకు దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ గుంజుకుంటున్నాడమ్మా అని అంటుంది. అప్పుడు పెద్ద ఆవిడ నీకు నీ భర్త దొరికినప్పుడు నువ్వు ఇంటికి తీసుకొచ్చుకోవాలి కానీ అలా మళ్లీ దాని చేతిలోనే ఎలా పెడతావు అని అంటుంది.
అప్పుడు అలా చేయాలంటే నేను దానిని తన్ని ఎప్పుడో నా భర్తను తెచ్చుకునేదాన్ని కానీ అలా కాకుండా నా డాక్టర్ బాబు దాన్ని వదిలేసి నేనే తన భార్యని అని రావాలి అని అంటుంది. అప్పుడు డాక్టర్ కూడా నువ్వు చేసింది కరెక్ట్ అమ్మ అలాగే చేయాలి. లేదా నువ్వు బలవంతంగా తీసుకువస్తే నీపై చెడు అభిప్రాయం కలుగుతుంది. ఇక ఎప్పుడూ మౌనిత తన భార్య అనుకుంటాడు అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత దీపా ఇంటికి వెళ్లి ఎటకారంగా దీపని పిలుస్తుంది. తప్పకుండా నీ కోసమైనా వస్తాను అని దీప కూడా ఎటకారంగా సమాధానం ఇస్తుంది. ఇక మోనిత, కార్తీక్ వినాయకుడు విగ్రహాన్ని కొనడానికి వెళ్తూ ఉండగా.. కార్తీక్ సౌర్యాన్ని చూసి మౌనితకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ ఏంటి తనని గుర్తుపట్టాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.