Karthika Deepam 1 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1264 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా శౌర్య బాగు అవ్వాలంటే డబ్బులు కావాలి అని రుద్రాణితో అంటుంది హిమ. అయ్యో.. డబ్బులు నేనిస్తాను బంగారం. నువ్వు ఇక్కడే ఉండు. కనీసం ఈ స్వీట్ అయినా తిను అని అంటుంది రుద్రాణి. దీంతో హిమ.. శౌర్యనే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇవన్నీ నీకేనమ్మా. నా ఆస్తులన్నీ నీకే. నిన్ను తాడికొండలో మరో రుద్రాణిలా తయారుచేస్తా అంటుంది రుద్రాణి. ఇంతలో దీప వచ్చి రుద్రాణి అంటూ సీరియస్ అవుతుంది. వచ్చావా దీప రారారా.. తల్లిప్రేమ కదా. తల్లి ప్రేమ నిన్ను ఇక్కడికి రప్పించేలా చేసింది. రుద్రాణి మర్యాదగా మాట్లాడండి. హిమను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది.
దీంతో బాగుంది దీప.. నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. ఈ స్వీట్స్ నేనే తీసుకొచ్చాను. కానీ.. హిమను నేను తీసుకురాలేదు అంటుంది రుద్రాణి. తనెందుకు వస్తుంది. మీరే ఎత్తుకొచ్చారు అంటుంది దీప. లేదు… నేను వచ్చానమ్మా అంటుంది హిమ. తన అక్కకు ట్రీట్ మెంట్ బదులుగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది అని అంటుంది రుద్రాణి. దీంతో అమ్మ నేను ఇక్కడే ఉంటా అమ్మా. ఆంటి దగ్గర డబ్బులు తీసుకొ.. శౌర్యకు బాగు చేయించు అంటుంది. కానీ.. దీప వినదు. నీకు ఏం తెలియదు పదా అంటుంది దీప. కానీ.. హిమ వినదు. దీంతో దీప నీ కూతురే చెబుతుంది కదా. తనే ఉంటానంటుంది కదా. డబ్బులు తీసుకెళ్లు దీప అంటుంది. కానీ.. హిమను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
దేవుడా మాకు ఏంటి ఈ పరిస్థితి అని అనుకుంటుంది దీప. పాత విషయాలను గురర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎంతో మందికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ బాబు చేతులు కట్టేశావు. డాక్టర్ బాబు ట్రీట్ మెంట్ చేయకుండా చేశావు అని అనుకుంటూ నడుస్తుంటుంది దీప.
వెళ్తూ.. ఒక పెద్దాయనను ఎవరైనా అప్పు ఇస్తారా అని అడుగుతుంది. దీంతో ముక్కు మొహం తెలియని వాళ్లకు ఎవరైనా అప్పు ఇస్తారా అంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్లకు అప్పు ఎవరు ఇస్తారు అంటాడు. ఊళ్లో వాళ్లందరినీ అడుగుతుంటుంది. కానీ.. ఎవ్వరూ ఇవ్వరు అంటారు.
కొందరైతే దీపను కూడా పట్టించుకోరు. దీంతో ఏం చేయాలో దీపకు అర్థం కాదు. తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ రుద్రాణి ఉంటుంది. ఏంటి దీపమ్మ.. అప్పుల కోసం చెప్పులరిగేలా తిరిగి అలసిపోయినట్టున్నావు. నువ్వు తిరిగితే తిరిగావు కానీ.. పాపం చంటిపిల్లను ఎందుకు తిప్పుతున్నావు అంటుంది.
ఏమ్మా దాహం వేస్తోందా.. కూల్ డ్రింక్ ఇప్పించనా అంటుంది. రుద్రాణి అంటూ అరుస్తుంది దీప. అరవకు దీప.. నువ్వు ఎంత తిరిగినా తాడికొండలో నయా పైస అప్పు పుట్టదు. కాదు కాదు.. అప్పు పుట్టకుండా నేను చేశాను. ఎంత మందిని అడుగుతావో అంతమందిని అడుగు. ఎంతమందిని బతిమిలాడుతావో అంతమందిని బతిమిలాడుకో. తాడికొండ గ్రామం అంటేనే అందరికీ గుర్తొచ్చేది రుద్రాణి.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీప మళ్లీ ఆలోచించుకో. డబ్బులు ఇస్తానంటున్నాను. బిడ్డను ఇవ్వమని అంటున్నాను. డబ్బులు తీసుకెళ్లి నీ బిడ్డకు వైద్యం చేయించు. మొండితనానికి వెళ్తే నీ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త అని అంటుంది రుద్రాణి. అయినా కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
నువ్వు ఎంతో దూరం వెళ్లలేవు దీప. మళ్లీ నా దగ్గరికే రావాలి. నేను ఇచ్చే డబ్బులే తీసుకెళ్లాలి. ఆలస్యం చేస్తే నీ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం గుర్తుపెట్టుకో.. అని అంటుంది రుద్రాణి. దీంతో ఏం చేయాలో దీపకు అర్థం కాదు. ఇంతలో శౌర్యను మరో ఆసుపత్రికి తీసుకెళ్తారు.
అర్జెంట్ గా డాక్టర్ ను పిలవండి అంటాడు కార్తీక్. అప్పారావుకు ఫోన్ చేస్తుంది దీప. వేరే ఆసుపత్రికి తీసుకొచ్చాం అని చెబుతాడు అప్పారావు. దీంతో దీప ఆసుపత్రికి బయలుదేరుతుంది. ఆటోలో వెంటనే ఆసుపత్రికి వచ్చేస్తుంది. శౌర్యను అప్పటి వరకు ఓ టేబుల్ మీద పడుకోబెడతారు.
ఏమైందండి అంటే.. టైమ్ పడుతుందట. డాక్టర్ ఇంకా రాలేదు.. అంటాడు కార్తీక్. నేను చాలా చోట్ల డబ్బుల కోసం ప్రయత్నించాను కానీ.. దొరకలేదు అంటుంది దీప. శౌర్యకు ఇంకా ట్రీట్ మెంట్ చేయలేదు ఎందుకు. ఇంకా ఇక్కడే ఉంచారు అని అడుగుతుంది హిమ.
మరోవైపు రుద్రాణి.. హిమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా డబ్బు అయినా వసూలు చేయాలి.. లేదా పిల్లనైనా తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. బండి తీయండిరా.. వాళ్లను పరామర్శిద్దాం అంటుంది రుద్రాణి. ఏ ఆసుపత్రిలో ఉన్నారో చెక్ చేస్తూ ఉంటుంది రుద్రాణి.
మరోవైపు కార్తీక్ మెడికల్ షాపునకు వెళ్తాడు. ఓ మహిళ మందులు తీసుకుంటూ ఉంటుంది. ఆ మందులు లేవు అని మెడికల్ షాపు అతడు అంటాడు. ఆ చిట్టి చూసి అవి లేకున్నా ఇవి ఇవ్వొచ్చు అని వేరే ట్యాబ్లెట్లు ఇప్పిస్తాడు. తర్వాత తనకు కొన్ని ట్యాబ్లెట్లు కావాలని అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.