Karthika Deepam 1 January Today Episode : కోటేశ్, శ్రీవల్లిని చంపించిన రుద్రాణి.. మరోవైపు హిమను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్.. ఇంతలో మరో ట్విస్ట్

Advertisement
Advertisement

Karthika Deepam 1 January Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 1238 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఒక్కడే ఇంట్లో కూర్చొని తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మమ్మీ, డాడీ మిమ్మల్ని చాలా బాధపెట్టాను. కానీ పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వస్తోంది. నన్ను క్షమించండి అంటాడు కార్తీక్. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. ఊయలలో బాబు ఏడుస్తుంటే వెళ్లి బాబును ఎత్తుకుంటాడు. నీకు, నాకు ఏ జన్మల బంధమోరా నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తున్నావు. నీకు, నాకు ఏంట్రా ఈ అంతుచిక్కని బంధం అంటాడు కార్తీక్. మళ్లీ ఊయలలో పడుకోబెట్టగానే మళ్లీ ఏడుస్తాడు బాబు. దీంతో మరోసారి ఎత్తుకుంటాడు కార్తీక్.

Advertisement

karthika deepam 1 january 2022 full episode

ఏంటో మేడమ్ మోనిత గారు మా బస్తీలో హాస్పిటల్ పెట్టారంటే నాకు ఇంకా అర్థం కావడం లేదు.. అని వారణాసి వచ్చి సౌందర్యతో చెబుతాడు. దీప, కార్తీక్ ఎప్పటికైనా అక్కడికే వస్తారని తన నమ్మకం కావచ్చు అంటుంది సౌందర్య. తను ఆసుపత్రి పెట్టింది కానీ.. తన ఆసుపత్రికి ఎవ్వరూ వెళ్లడం లేదు. తనకు చివరకు పాలు, కూరగాయలు కూడా ఎవ్వరూ అమ్మడం లేదు. బస్తీ బస్తీ మొత్తం ఏకమై అందరం మోనిత మీద నిరసన చేస్తున్నాం మేడం. తన ఆసుపత్రికి కూడా ఎవ్వరం వెళ్లడం లేదు.. అని చెబుతాడు వారణాసి. దీప నీకు ఫోన్ చేసిందా అని అడుగుతుంది సౌందర్య. దీపక్క ఫోన్ చేయలేదు మేడమ్. తను ఫోన్ చేస్తే నేను మీకు వెంటనే చెప్పేస్తాను మేడమ్ అంటాడు వారణాసి.

Advertisement

నా పెద్ద కోడలు దీప మీద బస్తీ వాళ్లు ఇంతగా అభిమానం చూపిస్తున్నారంటే.. నా పెద్ద కోడలు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. బస్తీ వాళ్లనే ఇంతగా ప్రభావితం చేసిందంటే.. ఇక తన భర్తను ఇంకెంత సంతోషంగా చూసుకుంటుందో కదండి.. అంటుంది సౌందర్య. మీరే అన్నారు కదా.. దీప కార్తీక్ ను ఎప్పుడూ ఓడిపోనివ్వదని.. అలాగైనా నీ బాధ కాస్త తగ్గుతుంది అని అంటాడు ఆనంద రావు.

మరోవైపు రుద్రాణి.. ట్రక్ తో గుద్ది కోటేశ్, శ్రీవల్లిని చంపేయాలని అబ్బులుకు చెబుతుంది. దీంతో అబ్బు ట్రక్ తో బయలు దేరుతాడు. శ్రీవల్లి, కోటేశ్ ఇద్దరూ స్కూటీ మీద గుడికి వెళ్లి వస్తుంటారు. ట్రక్ ను ఫాస్ట్ గా తీసుకెళ్లి వాళ్ల స్కూటీని గుద్ది అక్కడి నుంచి ట్రక్ వెళ్లిపోతుంది.

కోటేశ్, శ్రీవల్లి ఇద్దరూ రోడ్డు పక్కన పడతారు. వాళ్లకు తీవ్రంగా గాయాలు అవుతాయి. ఇంతలో గ్రామస్థులు అక్కడికి వస్తారు. కోటేశ్ కోటేశ్ అంటూ అరుస్తారు. అంబులెన్స్ కు ఫోన్ చేసే లోపే ఇద్దరూ చనిపోతారు. వాళ్లిద్దరూ చనిపోయారు అని నిర్దారించుకున్న తర్వాత అబ్బులు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Karthika Deepam 1 January Today Episode : రుద్రాణికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్

మరోవైపు మోనిత దగ్గరికి వెళ్లిన వారణాసి, బస్తీ వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతారు. కానీ.. మోనిత మాత్రం వినదు. ఇది నా ఇల్లు. నన్ను వెళ్లమనే హక్కు మీకు లేదు.. అంటూ వాళ్ల మీద సీరియస్ అవుతుంది. దీంతో బస్తీ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మరోవైపు రుద్రాణి తన రూమ్ లో పిల్లల ఫోటోలను పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. నాకు దయ లేదు.. జాలి లేదు అంటారు. ఇప్పుడు ఏమైందో చూశారు కదా. కోటేశ్, శ్రీవల్లి వద్దని ఛెప్పినా వినకుండా ప్రాణాలను తీసుకున్నారు అని రుద్రాణి తనలో తానే అనుకుంటుండగానే.. కార్తీక్ కోపంగా తన దగ్గరికి వస్తాడు. అసలు నువ్వు మనిషివేనా.. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అంటాడు కార్తీక్.

ఇద్దరి ప్రాణాలు తీశావు కదా.. అంటూ కార్తీక్ చెప్పగానే ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతుంది రుద్రాణి. ఏంటి సారు.. ఏం మాట్లాడుతున్నారు.. నాకేం అర్థం కావడం లేదు అంటుంది రుద్రాణి. వాళ్లను చంపించింది నువ్వే అని నాకు తెలుసు అంటాడు కార్తీక్.

నువ్వు నటించకు. నాకు తెలుసు ఇది నీ పనే అని. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో కానీ.. ఒక మనిషిని చంపి రాక్షసానందం పొందావు. నీ అప్పు తీరుస్తా అని చెప్పాక కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే.. ఇక లాభం లేదనుకొని నేను చంపించాను.. అంటుంది రుద్రాణి.

నా ఇంటికి పోలీసులు వచ్చారు నాకు కోపం వచ్చింది. ఆ పోలీస్ నన్ను ఘోరంగా అవమానించింది. ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయింది. నా పగ ఎవరి మీద తీర్చుకోవాలి. నా మీద కేసు పెట్టి నా ఇంటికి పోలీసులను తీసుకొచ్చిన శ్రీవల్లి, కోటేశ్ లను ఎలా వదిలేస్తాను. వాళ్లు నా అభిమానం మీద దెబ్బకొట్టారు తట్టుకోలేకపోయాను.. అని కార్తీక్ కు అసలు నిజం చెబుతుంది రుద్రాణి.

దీంతో చేసిన తప్పును ఒప్పుకొని లొంగిపో లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కార్తీక్.. రుద్రాణిని బెదిరించినా రుద్రాణి ఏమాత్రం భయపడదు. ముందు నువ్వు డబ్బు చెల్లించే పనిలో ఉండు. ఒప్పందం ప్రకారం నువ్వు డబ్బు సమయానికి డబ్బు కట్టకపోతే నీ కూతురు హిమను దత్తత తీసుకుంటాను అని చెప్పి బెదిరిస్తుంది రుద్రాణి.

Advertisement

Recent Posts

Hyundai Kia EV Cars : హ్యుందాయ్, కియా 2 లక్షలకు పైగా EV కార్ల‌ రీకాల్…!

Hyundai Kia EV Cars : ప‌వ‌ర్ డ్రైవ్ స‌మ‌స్య కార‌ణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…

51 mins ago

Pushpa 2 Rashmika Mandanna : పుష్ప 2 రష్మిక ఫ్యాన్స్ కి పండగే పండగ.. అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడంటే..?

Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…

2 hours ago

Elon Musk : చ‌రిత్రలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మస్క్ అవ‌త‌ర‌ణ‌

Elon Musk : చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మ‌స్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాల‌ర్ల…

3 hours ago

Nayanthara : న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లకి ఘోర అవ‌మానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో…!

Nayanthara : కోలీవుడ్ Kollywood  క్రేజీ జంట‌ల‌లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జంట ఒక‌టి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…

4 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా…

5 hours ago

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus  1st Test Match : పెర్త్ వేదిక‌గా భార‌త్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్…

6 hours ago

Maharashtra Jharkhand Election Results 2024 : మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌ల‌లో అధికార కూట‌ముల‌దే హ‌వా..!

Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.…

6 hours ago

Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…

7 hours ago

This website uses cookies.