Karthika Deepam 1 Sep Today Episode : కార్తీక దీపం 1 సెప్టెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1133 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసు కదా. మోనిత ఆసుపత్రికి వచ్చి.. కార్తీక్ కు కనిపించి.. తనను పెళ్లి చేసుకోవాలని.. లేకుంటే ఇంట్లో అందరినీ చంపేస్తా అని చెప్పి బెదిరించి వెళ్లిపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక కార్తీక్ సతమతమవుతాడు.
దీపకు చెబుదామనుకున్నా.. దీపకు చెప్పానని తెలిస్తే.. దీపను ఏం చేస్తుందో అని తెగ భయపడతాడు కార్తీక్. ఇక లాభం లేదు.. మోనితను వదలకూడదు. చంపేస్తాను. ఇన్ని దారుణాలు, మోసాలు చేసినందుకు మోనిత బతకకూడదు. దాన్ని చంపడమే కరెక్ట్. మోనిత ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందని ఏనాడూ అనుకోలేదు. నేను ఏదైనా చేస్తే.. ఇంట్లో వాళ్లను వదిలేలా లేదు. దీపను కూడా వదిలేలా లేదు.. అంటూ బాధపడుతాడు కార్తీక్.
డాక్టర్ బాబు.. తనలో తానే భయపడుతుండగా… అప్పుడే వచ్చిన దీప.. ఇక్కడెందుకు ఉన్నావు.. వెళ్లు ఇంటికి వెళ్లిపో.. అంటాడు. నిన్ను ఈ స్థితిలో వదిలిపెట్టి ఎలా వెళ్లగలను.. అంటుంది దీప. శిక్ష నాకు నీకు కాదు. నువ్వు ఇక్కడ నాతో పాటు ఉంటే నీకు గౌరవంగా ఉండదు. నేరస్థుడి భార్యగా చూస్తారు ఇక్కడ.. అని అంటాడు కార్తీక్.
నేను నేరం చేయలేదని అంత గాఢంగా ఎలా నమ్ముతున్నావు.. అంటే నమ్ముతున్నాను డాక్టర్ బాబు.. ఆరోజు కూడా మోనితకు గర్భం ఎలా వచ్చిందో తెలియదన్నారు. నమ్మాను.. నేను నమ్మింది నిజం అయింది కదా. ఇది కూడా అంతే. నేను దాన్ని చూశాను. గన్ పట్టుకొని తిరుగుతుంది.. అని చెబితే ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ.. మోనిత బతికే ఉంది.. అనగానే.. అవును.. దీప నువ్వు చెప్పింది నిజమే.. ఆ రాక్షసి బతికే ఉంది. నేను ఒక పాముతో స్నేహం చేసినందుకు.. ఆ పాము నన్ను కాటేసినా పర్వాలేదు.. కానీ.. నా కుటుంబం మీద ఆ కాటు ఏనాటికీ పడనివ్వను.. అని అనుకుంటాడు కార్తీక్.
డాక్టర్ బాబు.. మీ కడుపునొప్పి తగ్గిందా? మరి ఎందుకు అలా ఉన్నారు.. అని అడుగుతుంది దీప. అందరూ బాగుండాలి. నువ్వు ఈ రాత్రి ఎక్కడికీ వెళ్లకు. నాతోనే ఉండు. సరేనా. రౌడీకి జ్వరం వచ్చిందన్నావు కదా.. వెళ్తావా మరి. వద్దులే. నువ్వు ఇక్కడే ఉండు.. అని అంటాడు కార్తీక్.
దీంతో డాక్టర్ బాబు.. మానసికంగా వీక్ అయినట్టున్నారు. ఎప్పుడూ లేనిది.. ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు.. ఏమైంది.. అని ఆలోచిస్తుంది దీప.
కట్ చేస్తే.. మోనిత తన రూమ్ కు వచ్చి రెడీ అవుతుంది. ఏం నాన్న.. మీ అమ్మ కడుపులో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి రావాలా? అని ఆరాట పడుతున్నావా? కొన్ని నెలలే. నువ్వు బయటికి రావడం.. మీ నాన్న కూడా బయటికి రావడం.. అన్నీ ఒకేసారి జరుగుతాయి. అప్పుడు నువ్వు, నేను.. అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అన్నట్టు నాన్నను చూశావా? ఎలా ఉన్నాడు.
అందగాడు కూడా నాన్నా. అందుకే.. ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నా. కానీ.. మీ నాన్నే నిన్ను నన్ను వదులుకోవడం లేదు. దానికి కారణం మీ పెద్దమ్మ. వంటలక్క. మీ నాన్నతో తను చూస్తే.. ఏం చేస్తాం.. మీ నాన్నను విడిచి ఒక్క క్షణం కూడా వదలలేని నన్ను కాదని.. 10 ఏళ్లు దూరం పెట్టినా తన కోసం ఆరాటపడుతున్నాడు. అయినా నేను అన్నీ సెట్ చేస్తా. నువ్వు బయటికి వచ్చేలోపు అన్నీ సెట్ చేస్తా.. సరేనా.. నువ్వేం టెన్షన్ పడకు.. అని చెబుతుంది మోనిత. గుడ్ నైట్ నాన్న.. అని చెప్పి పడుకుంటుంది.
కట్ చేస్తే.. సౌందర్య.. యాపిల్ కట్ చేసి రౌడీకి, హిమకు ఇస్తుంది. రాత్రంతా అమ్మ నాన్న దగ్గరే ఉందా నానమ్మా.. అంటే అవును అంటుంది. అయ్యో.. నాన్నకు ఏమన్నా జ్వరం వచ్చిందేమో అంటుంది. ఏంటే నీ ఉద్దేశం.. రాత్రంతా మీ అమ్మ.. ఏం తినకుండా అక్కడే ఉంటే.. మీ నాన్నకు ఏమైందో అని ఆలోచిస్తావేంటి.. అని అంటుంది సౌందర్య. మా అమ్మకు ఏమైంది.. బాగానే ఉంది కదా.. అంటే.. హే ఆపండి… కాస్తయినా సానుభూతి చూపించండి.. అంటే సానుభూతి అంటే ఏంటో తెలియదు అని అంటారు. విశ్వాసం కూడా చూపించారా? అని అడుగుతుంది సౌందర్య.
మరి.. నువ్వు ఆ సానుభూతి, విశ్వాసం మా నాన్న మీద ఎందుకు చూపించడం లేదు.. అని అడుగుతారు పిల్లలు. నీకు మా నాన్న అంటే ఇష్టం లేదు. నీకే కాదు.. అసలు ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎవ్వరూ మా నాన్నను సరిగ్గా అర్థమే చేసుకోరు. మా నాన్న మా ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్వరైనా అక్కడికి వచ్చారా? అదే మా అమ్మ ఉన్నప్పుడు డెయిలీ వచ్చి ఏడ్చేసేవారు. మీరంతా కలిసి మా నాన్నను ఇంటికి తీసుకురావచ్చు కదా.. అంటే ఇది మీ తప్పు కాదే.. మా తప్పే. మీ అమ్మతో నువ్వు.. మీ నాన్నతో ఇది.. విడివిడిగా పెరగడం వల్ల.. వయసుకు మించిన ప్రశ్నలు వేస్తున్నారు. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నారు.
పాపం.. దాని బతుకు ఎప్పుడూ అంతేనే. ఎప్పుడూ ఏదో ఒక సమస్యను మోసుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. నాలుగు రోజులు మీ అపార్థాలను పక్కన పెట్టండి. మీ నాన్న క్షేమంగా తిరిగి వస్తాడు. అందరం కలిసి సంతోషంగా ఉంటాం. అప్పటి వరకు నా కోడలును ఇంకొక మాట అన్నారో.. జాగ్రత్త.. అని బెదిరించి వెళ్తుంది సౌందర్య.
కట్ చేస్తే.. ఆసుపత్రికి వచ్చి చూసేసరికి.. డాక్టర్ బాబు కనిపించడు. డాక్టర్ బాబు.. అంటూ అడుగుతుంది దీప. ఆయన ఎటు వెళ్లారు.. అంటూ అటూ ఇటూ చూడగా.. కార్తీక్ బయట కూర్చొని ఉంటాడు. అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు అని అనుకుంటుంది దీప. అక్కడికెళ్లి చూస్తుంది. కార్తీక్ పక్కన కూర్చుంటుంది. డాక్టర్ బాబు.. ఏంటిది డాక్టర్ బాబు.. మీరు ఇక్కడ కూర్చున్నారేంటి.. ఏమైంది.. అని అడుగుతుంది.
దీప.. వచ్చావా? ఎందుకో ఎవ్వరూ లేకపోతే.. గదిలో ఉండలేకపోతున్నాను.. అనగానే మీరు దేనికైనా భయపడుతున్నారా? అనగానే…. నేను అనవసరంగా మోనితకు భయపడుతున్నానా? అని అనుకుంటాడు. మీరు ఇంతకు ముందులా లేరు. కడుపునొప్పి తగ్గిపోయింది.. అయినా టెన్షన్ పడుతున్నారు.. దేనికి.. ఏ శక్తి మిమ్మల్ని ఇంత నిర్వీర్యం చేసింది. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంతలా భయపడుతున్నారు.. అని అడుగుతుంది దీప.
వద్దు.. మోనిత విషయం అస్సలు దీపకు తెలియకూడదు.. ఇంకా నేను నా వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టలేదు.. అని మనసులో అనుకుంటాడు. చెప్పండి.. డాక్టర్ బాబు.. అని ప్రశ్నిస్తుంది దీప. ఎప్పుడూ దైర్యంగా కనబడే మీరు ఎందుకు ఇంతలా బేలగా మారిపోయారు.. అనగానే నాకేమైంది. నేను బాగానే ఉన్నాను. ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది.. అని బాధపడతాను. ఇదేగా నా జీవితంలో అధమ స్థాయి.. ఇంతకు మించి కష్టాలు ఏముంటాయి. నేను ఆలోచించేది.. నా గురించి కాదు. నావల్ల అందరూ సఫర్ అవుతున్నారు. డాడీకి ఆరోగ్యం బాగా లేదు. అందరూ బాధపడుతున్నారు.
నువ్వయితే నాకోసం పిచ్చిదానివి అయిపోతున్నావు. నన్ను కాపాడుకునే దారి దొరకక.. అగమ్యగోచరంగా తిరుగుతున్నావు. మీరందరూ నావల్లే కదా ఇంత బాధపడేది. అందుకు బాధపడుతున్నాను. నా తప్పు.. నా పొరపాటు.. నా గుడ్డి నమ్మకం.. నన్ను బలహీనుడిని చేశాయి. ఆ నమ్మకద్రోహి మోనిత ముందు నా నిజాయితీ ఎందుకూ పనికిరాకుండా పోయింది. అందుకు బాధపడుతున్నాను. అంతే.. అని అంటాడు కార్తీక్.
మీరు చేయని నేరం మీ మీద పడింది. మీరు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లూ మా అందరికీ మీరు ఉన్నారు. ఇప్పుడు మీ ఒక్కరికి మేమందరం ఉన్నాం. అది గుర్తు పెట్టుకోండి.. అని చెబుతుంది దీప. నాకు తెలుసు.. అంతా తెలుసు. ఇప్పుడు పుట్టిపెరిగిన ఇన్నేళ్లకు ఎవరు ఏంటో తెలుసుకున్నాను. ప్రశాంతంగా ఇంటికి వెళ్లు దీప. డాడీని, ఆదిత్యను రమ్మను. పిల్లలకు నేను హాస్పిటల్ లో ఉన్నానని చెప్పకు అని అంటాడు కార్తీక్.
దీప.. నువ్వంటే నాకు చాలా ఇష్టం దీప.. అంటాడు కార్తీక్. కట్ చేస్తే మోనితను రత్నసీత కలుస్తుంది. ఏంటి రత్నసీత.. అలా షాక్ అవుతున్నావు.. అంటుంది మోనిత. ఈ తాళి ఏంటనా. ఈ రోజు నేను కార్తీక్ ను పెళ్లి చేసుకోబోతున్నాను.. అంటుంది మోనిత. నేను 11.30 కి అక్కడికి వస్తాను.. అని చెబుతుంది. కట్ చేస్తే దీప తన అత్త, మామతో మాట్లాడుతుంది. ఇప్పుడు టైమ్ 11 అయింది.
ఇప్పుడు బయలుదేరితే 11.30 వరకు అక్కడికి వెళ్లొచ్చు. అప్పుడే డాక్టర్ గారు కూడా రౌండ్స్ కు వస్తారట.. అని తన అత్తయ్య, మామయ్యకు చెబుతుంది దీప. అప్పుడే డాక్టర్ గారు కూడా రౌండ్స్ కు వస్తారట.. ఆసుపత్రికి వెళ్లండి.. అని చెబుతుంది దీప. సరిగ్గా.. 11.30 కు కార్తీక్ ను చూడటానికి మారు వేషంలో వస్తుంది మోనిత. అప్పుడే సౌందర్య, తన భర్త ఆసుపత్రికి వస్తారా? వాళ్లు.. మోనితను చూస్తారా? ఆ తర్వాత ఏమౌతుందో తెలియాలంటే.. తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.