karthika deepam 10 november 2021 full episode
Karthika Deepam 10 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు నవంబర్ 10, 2021, బుధవారం ఎపిసోడ్ 1193 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, మోనిత ఇద్దరూ పూజలో కూర్చుంటారు. కార్తీక్ అయిష్టంగానే పూజ చేస్తుంటాడు. మోనిత మాత్రం చాలా సంతోషిస్తుంది. బిడ్డ పేగు మెడకు వేసుకొని పుట్టడం వల్ల రాహు పూజ చేయాలి. నేను చెప్పినట్టు చేయండి అని పూజారి చెబుతాడు. ఇంతలో దీప కారులో అటునుంచే వెళ్తుంటుంది. సౌందర్య కారు చూస్తుంది. దిగి.. వీళ్లు ఇక్కడేం చేస్తున్నారు అనుకుంటుంది. వారణాసి.. నువ్వు వెళ్లిపో. మన కారు ఉంది కదా.. నేను ఈ కారులో వస్తాను.. అని చెబుతుంది దీప. దీంతో సరే అక్క అంటాడు. కానీ.. ఎందుకో నిన్ను చూస్తే భయం వేస్తుంది అంటాడు. నువ్వు చాలా మారిపోయావు అక్క అంటాడు.
karthika deepam 10 november 2021 full episode
దీప గుడిలోకి వచ్చి.. వీళ్లు ఎక్కడున్నారని వెతుకుతుంది. కార్తీక్, మోనిత పూజ చేస్తుండటం చూసి షాక్ అవుతుంది. అదేంటి.. మోనిత పక్కన డాక్టర్ బాబు కూర్చొని పూజ చేస్తున్నారని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇద్దరు పక్కపక్క కూర్చొని పూజ చేస్తున్నారా? అత్తయ్య దగ్గరుండి జరిపిస్తున్నారా? అనుకుంటుంది. షాక్ అవుతుంది. ఏడుపు ఆపుకోలేకపోతుంది. డాక్టర్ బాబు ఏం చేస్తున్నారిక్కడ. ఈ పూజలు ఏంటి.. అని తెగ బాధపడిపోతుంది. 11 ఏళ్లు మిమ్మల్ని నమ్మాను కదా.. అని అనుకుంటుంది దీప.
డాక్టర్ బాబు హాస్పిటల్ కు వెళ్లి సంతకం పెట్టారంటే మానవత్వం అని అనుకున్నాను. ఈ విషయం నా దగ్గర దాచిపెట్టారంటే నేను ఏమనుకుంటానో అనుకొని భయపడ్డారని అనుకున్నాను.. అని దీప అనుకుంటుండగానే దీప అక్కడికి రావడం చూస్తాడు కార్తీక్. దీంతో షాక్ అవుతాడు. దీప వచ్చిందా? లేక వచ్చినట్టు నాకు అనిపించిందా? అనుకుంటాడు. రవి.. పూజ అయిపోయింది. నువ్వు వెళ్లి ఈ తైలాన్ని నైరుతి వైపున ప్రాంతంలో పోసిరా అంటాడు పూజారి. దీంతో రవి.. ఆ తైలాన్ని బయటికి తీసుకెళ్తాడు.
మరోవైపు దీప ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. దీప.. ఎందుకు ఈ పేరు నాకు పెట్టారో.. ఎప్పటికైనా ఆరిపోతుందనా అని అనుకుంటుండగా.. రవి అక్కడికి వస్తాడు. పంతులు గారు అక్కడ ఏం పూజ జరుగుతోంది.. అని అడుగుతుంది. బాబు పేగు మెడకు వేసుకొని జన్మించాడట. తండ్రికి ప్రాణగండం అని దోష నివారణ పూజను ఆ దంపతులు చేస్తున్నారమ్మా.. అంటాడు. ఇంతకీ మీరెవరు అంటే.. అదే తెలియడం లేదు పంతులు గారు అంటుంది దీప. వెళ్లిపోతున్నారు.. దైవ దర్శనం చేసుకున్నారా అమ్మా? అంటాడు. దర్శనం బాగా అయింది అని చెప్పి అక్కడి నుంచి దీప వెళ్లిపోతుంది.
మరోవైపు పూజ అయిపోతుంది. ఇక దోషం తొలగినట్టే అని పూజారి చెబుతాడు. ఇక మోనిత కాస్త ఓవర్ చేస్తుంది. పూజారి గారు మా బాబును ఆశీర్వదించండి. మా బాబుకు మా మామ గారి పేరు పెట్టాను అంటుంది. ఇంకా ఏదేదో మాట్లాడుతుంటే.. పంతులు గారు పూజ అయిపోయింది కదా.. ఇక వెళ్లొచ్చా అంటాడు కార్తీక్. అయ్యో.. అప్పుడేనా.. ఇంకో 5 నిమిషాలు ఉండి వెళ్లండి అని చెప్పి పూజారి వెళ్లిపోతాడు.
karthika deepam 10 november 2021 full episode
ఇదే కరెక్ట్ చాన్స్ అనుకొని.. ఏమండి.. మన బాబును చూశారా అని అడుగుతుంది. కార్తీక్ కు ఫుల్ కోపం వస్తుంది. ఏయ్.. ఎక్కువ మాట్లాడకు అంటాడు కార్తీక్. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానండి.. నేనేమీ ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అనలేదు కదా.. అంటుంది మోనిత. ఇప్పుడు రాను కానీ.. త్వరలో వస్తాను ఇంటికి. మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగు పెడతా అని చెబుతుంది మోనిత.
కట్ చేస్తే.. మోనిత ఇంటికి వెళ్తుంది దీప. మోనిత ఏదో మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన దీప.. తనకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక నీ ఖేల్ ఖతం అంటుంది. నువ్వు ఇన్ని రోజులు ఎన్నో నాటకాలు ఆడావు. ఇక అవన్నీ కుదరవు.. అంటూ బెదిరిస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
This website uses cookies.