Karthika Deepam 11 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 1323 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ పేరేంటమ్మా అని చంద్రమ్మ హిమను అడిగితే.. పేరు చెప్పబోతుంది. ఇంతలో వద్దు నీ పేరు చెప్పకు. నీకు తింగరి అనే పేరే కరెక్ట్ గా సెట్ అయింది అంటుంది జ్వాల. నీ పేరు తింగరి అంతే అంటుంది జ్వాల. ఆ తర్వాత జ్వాల చేతిని తీసుకొని తన చేతుల్లో పెట్టుకుంటుంది హిమ. చిన్నప్పటి మెమోరీస్ ను గుర్తుకు తెచ్చుకుంటుంది హిమ. ఏంటి తింగరి.. ఇప్పుడే భయం లేదన్నావు. మళ్లీ ఇదేంటి అని అడుగుతుంది. దీంతో ఇలా పట్టుకుంటే నాకు ధైర్యం ఇంకా పెరుగుతుంది అంటుంది తింగరి.
దీంతో ఓసి నా తింగరి అంటుంది శౌర్య. తనను గట్టిగా హత్తుకుంటుంది హిమ. గట్టిగా హత్తుకొని సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏమైంది తింగరి నీకు అంటుంది. దీంతో ఏం కాలేదు అంటుంది. మరోవైపు ఆనంద రావు దీనంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇంతలో స్వప్న వస్తుంది. డాడీ అని పిలుస్తుంది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. ఏదో లోకంలో ఉంటావు ఏంటి అని అడుగుతుంది స్వప్న. జరిగిపోయిన వేవో జరిగిపోయాయి. వాటినే తలుచుకుంటూ కూర్చోవడం కరెక్ట్ కాదు కదా అంటుంది స్వప్న.
కానీ.. ఆనంద రావు మనం కలవాలి అనే మాటలు మాట్లాడేసరికి.. వద్దు డాడీ.. మనం కలవాలి అనే విషయం వద్దు అంటుంది స్వప్న. పెద్దోడు, దీప పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోయారు. ఇద్దరూ విడివిడిగా ఉన్నారు. అక్కడ దీప కష్టపడింది. ఇక్కడ కార్తీక్ కష్టపడ్డాడు. వాళ్లిద్దరినీ చూడలేక మేము ఇబ్బందులు పడ్డాం. చివరకు వాళ్లే లేకుండా పోయారు అంటాడు ఆనందరావు.
వాళ్లను భగవంతుడు తీసుకెళ్లిపోయాడు అంటే.. వాళ్లు మీ మనవరాలు చేసిన పని వల్లే చనిపోయారు అని అంటుంది స్వప్న. ఎవరో చేసిన తప్పుకు ఎవరికో పాపం తగులుతుంది అంటే ఇదే డాడీ అంటుంది. ఆదిత్య అమెరికా వెళ్లిపోయాడు. శౌర్య ఎక్కడికో వెళ్లిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురువు నువ్వు.. అందరినీ దూరం చేసుకొని ఏకాకిగా ఉండిపోయావు అంటాడు ఆనందరావు.
దేవుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు డాడీ.. మనుషులు చేసే తప్పుల వల్ల వాళ్లు అనుభవిస్తారు అంటుంది స్వప్న. కట్ చేస్తే హిమ డాక్టర్ కాబట్టి.. తనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతాడు ఇంద్రుడు. నాకు చేతులు వణుకుతున్నాయి.. కాస్త పరిగెత్తినా ఆయాసం వస్తోంది అంటాడు ఇంద్రుడు.
లేట్ అవుతోంది నువ్వు వెళ్లు అంటుంది జ్వాల. దీంతో భోజనం వేళ అయింది కదా.. తిని వెళ్తుందిలే అంటుంది చంద్రమ్మ. వాళ్ల స్థాయి ఏంటి.. మన స్థాయి ఏంటి.. మన భోజనం వాళ్లు ఎక్కడ తింటారు అంటుంది జ్వాల. దీంతో నేను తింటాను.. నాకు ఆకలిగా ఉంది అంటుంది తింగరి.
తర్వాత తింగరికి భోజనం వడ్డిస్తుంది జ్వాల. ఈ క్షణం కోసం ఎన్నేళ్లు వెయిట్ చేశాను శౌర్య అని అనుకుంటుంది హిమ. తీరా నీ మీద కోపం అని తెలిసి నేనేంటో చెప్పలేకపోయాను అంటుంది. మరోవైపు తింగరి నీకు ఏదంటే ఇష్టం అని అడుగుతుంది జ్వాల. దీంతో దోసకాయ పచ్చడి అంటుంది హిమ.
దీంతో జ్వాల షాక్ అవుతుంది. దోసకాయ పచ్చడా అంటుంది. మా జ్వాలకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు. అసలు దోసకాయ పచ్చడి అంటేనే అరుస్తుంది. కానీ.. నాకు, గండాకు మాత్రం దోసకాయ పచ్చడి అంటే మాత్రం చాలా ఇష్టం అంటుంది చంద్రమ్మ.
ఇక ఆపండి అంటుంది జ్వాల. ఆ పచ్చడి అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు అని అడుగుతుంది తింగరి. దీంతో నాకు నచ్చని వాళ్లకు ఆ పచ్చడి ఇష్టం. అందుకే నాకు ఆ పచ్చడి నచ్చదు అంటుంది జ్వాల. నా మీద నీకు ఇంత కోపం ఉంది. ఈ కోపాన్ని ఎలా పోగొట్టగలను అని అనుకుంటుంది తింగరి.
ఇంతకీ ఏం కూరలు వండావు అని అడుగుతుంది జ్వాల. దీంతో దోసకాయ పచ్చడే చేశాను అంటుంది చంద్రమ్మ. దీంతో సరే కానీయ్.. పెట్టు అంటుంది జ్వాల. విడిపోయి కలిశామని సంతోషపడాలా.. కలిసి ఉండి కూడా విడిపోతున్నామని బాధపడాలా అర్థం కావడం లేదు అని అనుకుంటుంది తింగరి.
మరోవైపు అన్నం తింటూ రెండు ముద్దలు పక్కన పెడుతుంది జ్వాల. దీంతో ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతుంది తింగరి. దీంతో నాకు కావాల్సిన వాళ్ల కోసం అంటుంది జ్వాల. రోజూ ఇంతేలే అమ్మ నువ్వు తిను అంటాడు ఇంద్రుడు.
నువ్వు తిను అంటుంది జ్వాల. దీంతో సరే అని అన్నం తింటూ ఉంటుంది హిమ. అమ్మానాన్నలు నిన్ను చూసుకోమని చెప్పారు. కానీ.. నువ్వే నన్ను చూసుకుంటున్నావా అని అనుకుంటుంది హిమ. హిమ ఏడవడం చూసి ఏమైంది.. కారం ఎక్కువైందా.. నేను చెప్పానా మా ఇంట్లో కారం ఎక్కువగా ఉంటుందని.. అయినా అదేం తినడం నేను తినిపిస్తా అని తనకు తినిపిస్తుంది జ్వాల.
దీంతో హిమకు ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. తన పాత మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి. నేను మనకు అమ్మానాన్నలను లేకుండా చేస్తే నువ్వు నాకు అమ్మగా మారి ముద్దలు తినిపిస్తున్నావా శౌర్య అని అనుకుంటుంది తింగరి. ఏంటా కన్నీళ్లు.. కారం తగ్గలేదా అంటుంది.
దీంతో లేదు కారం తగ్గింది అని అంటుంది తింగరి. నేను ఎవరో తెలియక ఇంత ప్రేమ చూపిస్తున్నావు. నేనే హిమ అని తెలిస్తే ఏం చేస్తావు శౌర్య అని మనసులో అనుకుంటుంది హిమ. గండా వీళ్లిద్దరినీ చూస్తుంటే ఏదో అక్కాచెల్లెళ్లలా అనిపిస్తోంది కదా అని అంటుంది చంద్రమ్మ.
దీంతో జ్వాలకు కోపం వస్తుంది. జ్వాల నీకు అక్కాచెళ్లెళ్లు అంటే ఇష్టం ఉండదా ఎందుకని అని అడుగుతుంది తింగరి. దీంతో అవన్నీ ఇప్పుడు ఎందుకు.. ఇష్టం లేదని చెప్పాను కదా. ముందు అన్నం తిను అంటుంది. ఇంతలో తింగరికి పొర పోతుంది. దీంతో మంచినీళ్లు తాగిస్తుంది జ్వాల.
మీ అమ్మానాన్న తలుచుకుంటున్నారేమోనమ్మా అని అంటుంది చంద్రమ్మ. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతుంది హిమ. మరోవైపు తన ఫోటోలను చూస్తూ మురిసిపోతుంది హిమ. నిన్ను పిలవాలని.. నీతో కబుర్లు చెప్పాలని ఎన్నో అనుకున్నా తెలుసా శౌర్య అని ఫోటోతో మాట్లాడుతుంది.
నువ్వు దొరికావని ఇప్పటివరకు నమ్మలేకపోతున్నాను తెలుసా అని అంటుంది. సంతోషంగా ఇంట్లో డ్యాన్సులు చేస్తున్న హిమను చూసి సౌందర్య షాక్ అవుతుంది. ఇంత సంతోషంగా హిమ ఎందుకు ఉంది అని అనుకుంటుంది. కానీ.. శౌర్య కనిపించిన విషయం తనకు తెలియదు.
మరోవైపు తింగరిని నీలా స్ట్రాంగ్ గా చేయి అని జ్వాలకు చెబుతాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vaibhav Suryavanshi : క్రికెట్లో ఐపీఎల్కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యమా అని…
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ…
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న…
Bull : అదుపుతప్పిన ఓ ఎద్దు పేట్రేగిపోయింది. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ 15 మందిని గాయపరిచింది. ఎద్దు స్వైర విహారానికి…
Surya : కోలీవుడ్ స్టార్ సూర్యకు కంగువ ఇచ్చిన షాక్ గురించి అందరికీ తెలిసిందే. శివ డైరెక్షన్లో 350 కోట్ల…
Birth Certificate : ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య అన్ని గుర్తింపు ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వ సేవలకు యాక్సెసింగ్ చాలా ఈజీ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్గా 12 వారాలు పూర్తి చేసుకోగా,…
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా…
This website uses cookies.