Karthika Deepam 11 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 డిసెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 1220 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన కొడుకు వెళ్లిపోయాడని.. దిగాలుగా కూర్చొని ఆలోచిస్తుంటుంది సౌందర్య. తన మనవరాళ్లు కూడా గుర్తొస్తారు తనకు. ఇంతలో ఆదిత్య, ఆనంద రావు అక్కడికి వస్తారు. పెద్దోడి గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా అని అడుగుతుంది సౌందర్య. అదే చూస్తున్నాం.. అంటాడు ఆదిత్య. సెల్ ఫోన్ టవర్ ద్వారా ట్రాక్ చేయొచ్చు కదా.. అని అడుగుతుంది. అదే చూస్తున్నాం మమ్మీ.. అంటాడు ఆదిత్య. పిల్లలు లేని ఈ ఇల్లు బొసి పోయినట్టుగా కనిపిస్తోంది. నానమ్మ అది చేయి.. ఇది చేయి.. అంటూ ఎప్పుడూ ఇంట్లో హడావుడి ఉండేది. అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. ఇప్పుడు అన్నయ్య ఇలా చేయడం ఏంటి అని అంటాడు ఆదిత్య. వాళ్లంతట వాళ్లు వస్తే తప్పితే.. మనం ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు అని అంటాడు ఆదిత్య.
కట్ చేస్తే.. దేవుడి గుడికి వెళ్తుంది దీప. అమ్మ నువ్వు జీవితంలో నాకు పరీక్షలు పెట్టావో నాకు తెలియదు కానీ.. నేను ఏనాడూ పరిగెత్తడం ఆపలేదు. ఈ సమయంలో నేను డాక్టర్ బాబుకు అండగా ఉండాలి. నేను ఆయనకు అండగా ఉండేలా ధైర్యం నాకివ్వు. నా పిల్లలు ఏం జరిగిందో అని టెన్షన్ పడుతున్నారు. నా డాక్టర్ బాబును.. మళ్లీ పాత డాక్టర్ బాబుగా తిరిగి చూడాలి. నాకు కష్టాలు ఇవ్వొద్దు అని నేను అనడం లేదు. కానీ.. నాకు ఎదుర్కునే ధైర్యాన్ని ఇవ్వు అని కోరుతున్నా.. అంటుంది దీప. మరోవైపు కార్తీక్ ఫోన్ ను దొంగలించిన వ్యక్తి.. ఈ ఫోన్ ను ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు. తెగ ఫోన్లు వస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఫోన్ కావాలని అక్కడ వదిలేసి వెళ్లాడు. ఫోన్ ఎత్తితే వాళ్ల టార్చర్ తట్టుకోలేం. దాన్ని అమ్మేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటాడు మహేశ్.
మరోవైపు సౌందర్య.. బస్తీకి వెళ్తుంది. దీప అక్కడికి వచ్చిందేమో అని ఎంక్వయిరీ చేస్తుంది. ఇక్కడికి రాలేదమ్మా. మాకు తెలియదమ్మా అని చెబుతారు. వారణాసి.. అక్క అక్క అంటూ తోడబుట్టిన తమ్ముడిలా వెంట ఉన్నావు కదరా.. నీకు కూడా చెప్పలేదా అని అడుగుతుంది. మీకు దండం పెడతాను.. దీప ఎక్కడుందో చెప్పండి అని అడుగుతుంది సౌందర్య. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం.. మాకు ఏం తెలియదు అంటారు.
కట్ చేస్తే రాత్రి అవుతుంది. డాక్టర్ బాబు రా.. వచ్చి పడుకో అని చెబుతుంది దీప. సారీరా రౌడీ, సారీ హిమ అంటాడు కార్తీక్. మిమ్మల్ని ఇలాంటి ప్లేస్ కు తీసుకొచ్చి కష్టపెడుతున్నను అంటాడు కార్తీక్. ఒకప్పుడు నా వల్ల నువ్వు, మీ అమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కష్టాలే తీసుకొచ్చాను అంటాడు కార్తీక్.
నాన్నా.. ఈ కష్టాలు మాకు బస్తీలో అలవాటే. అప్పుడు బస్తీలో నువ్వు లేవు కానీ.. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా.. మాకు ఎలాంటి కష్టాలు లేవు.. అంటుంది శౌర్య. మనందరం కలిసి ఉంటే చాలు.. ఎటువంటి కష్టాలను అయినా ఓర్చుకుంటాం అంటుంది హిమ.
ఇంతలో బయట ఎవరికో నొప్పులు పుడుతుంటాయి. ఓర్చుకో అని అందరూ అంటుంటారు. శ్రీవల్లి ఓర్చుకో అంటారు. పురిటి నొప్పులు పడుతుంటాయి. కొంచెం ఓర్చుకో అమ్మ అంటారు. అయ్యో.. ఊళ్లో డాక్టర్ కూడా లేడే అని బాధపడుతుంటారు. ఇంతలో దీప, కార్తీక్ ను తీసుకొని అక్కడికి వెళ్తుంది.
డాక్టర్ లేడు.. ఉన్న ఒక్క మంత్రగత్తె లేదు.. తనను చంపేస్తావరా.. అని ఒకవిడ అడుగుతుంది. ఏం చేద్దాం.. ఉన్న ఒక డాక్టర్ లేడు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. వెంటనే దీప.. డాక్టర్ బాబు మీరేదైనా ట్రీట్ మెంట్ చేయొచ్చు కదా అని అంటుంది. సారీ దీప అంటాడు కార్తీక్.
నాలో డాక్టర్ ఎప్పుడో చచ్చిపోయాడు దీప అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు ఆ అమ్మాయి చచ్చిపోతుంది అంటుంది దీప. మనం వెళ్దాం పదా అంటాడు. కానీ.. దీప వినిపించుకోదు. అటు చూడండి డాక్టర్ బాబు. మీరేం చేయలేరా.. అంటుంది. నేనేం చేయలేను దీప అంటాడు కార్తీక్.
మీరేం చేయలేరా అని అంటే.. ఎవరి దగ్గరైనా ఫోన్ ఉందా అని అడుగు అంటాడు కార్తీక్. అంబులెన్స్ కు ఫోన్ చేస్తాడు. ఏం కాదమ్మా ఊరుకో అంటుంది దీప. ఇంతలో అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ లోకి పురిటి నొప్పులు వస్తున్నావిడను ఎక్కించి తీసుకెళ్తారు.
అమ్మ నిద్రొస్తుంది అంటే.. మీరు పడుకోండి.. అంటుంది దీప. ఏమండి మీరు ఒకసారి ఇలా రండి అంటుంది. ఏంటండి మీరు.. ఏమైంది మీకు.. ఒక ప్రాణం మీ కళ్ల ముందు విలవిలలాడుతుంటే చూస్తూ నిలుచున్నారేంటి అంటుంది. ఏం చేయాలి దీప అంటాడు. మీరొక డాక్టర్ అది మరిచిపోయారా అంటుంది. నేను డాక్టర్ ను కాదు అంటాడు కార్తీక్.
నేను ఇప్పుడు డాక్టర్ ను కాదు దీప. నా డాక్టర్ పట్టా రద్దు చేశారు. నేను డాక్టర్ గా కొనసాగకుండా నన్ను సస్పెండ్ చేశారు. నేను ఇప్పుడు డాక్టర్ ను కాదు అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.