Karthika Deepam 11 Jan Today Episode : అందరూ ఒకే చోటుకు.. తాడికొండలో ల్యాండ్ అయిన మోనిత, సౌందర్య, ఆనందరావు.. దీపను మోనిత చూస్తుందా?

Karthika Deepam 11 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1246 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య, ఆనందరావు ఇద్దరూ బయలుదేరుతారు. కొన్ని రోజులు ఫ్రశాంతంగా ఉండటం కోసం బయలుదేరుతారు. వాళ్లు వెళ్లడాన్ని మోనిత చూస్తుంది. వాళ్ల కారును ఫాలో చేస్తుంది. వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెడుతుంది. మరోవైపు దీప.. ఆనంద్ కోసం పాలు కలుపుతూ ఉంటుంది. ఏరా ఆనంద్.. రాత్రి అయింది ఇక పడుకోవా అని అంటాడు కార్తీక్. వీడు పగలు పడుకుంటాడు.. రాత్రి పూట నిద్రపోడు. కానీ.. వీడు ఎక్కువగా ఏడవడు.. అంటుంది దీప. అవునా.. నువ్వు ఏడవవా.. అంటాడు కార్తీక్. రా అని అనేసరికి.. ఏమండి వాడిని ఏరా అని పిలవకండి. వాడి పేరు మామయ్య పేరే అంటుంది దీప.

karthika deepam 11 january 2022 full episode

వీడి పేరు పెట్టి పిలిచినప్పుడు నీకు మామయ్య గారు గుర్తొస్తున్నారు. నాకు ఆ మోనిత చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి అని అంటుంది దీప. తర్వాత పాలు తాగిపిస్తాడు కార్తీక్. ఇంత దూరం వచ్చి కూడా మనం మోనితను మరిచిపోకపోతే ఎలా అండి. మనం వచ్చిందే చేదు విషయాలను మరిచిపోవడానికి.. అంటుంది దీప. కానీ.. నా వల్ల కావట్లేదు దీప.. అంటాడు కార్తీక్. మరోవైపు సౌందర్య కారు నడుపుతూ ఉంటుంది. వాళ్ల కారునే ఫాలో అవుతూ ఉంటుంది మోనిత. కార్తీక్, దీప ఎక్కడున్నారో వీళ్లకు తెలిసిందా. అక్కడికే వెళ్తున్నారా అని అనుమానిస్తుంది మోనిత. కార్తీక్, నేను కలవకుండా ఏవైనా కొత్త ఎత్తుగడలు వేశారా అని అనుకుంటుంది మోనిత. మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా.. నేను ఒక అడుగు ముందే ఉంటాను అని అనుకుంటుంది మోనిత.

కార్తీక్.. పిల్లాడిని ఊయలలో పడుకోబెట్టి.. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లారంట కదా. డబ్బులు లేవు కదా ఎలా తీసుకెళ్లారు అంటుంది దీప. డబ్బులు లేవు కానీ.. ప్రేమ బోలెడు ఉంది అంటాడు కార్తీక్. నేను రేపటి నుంచి పొరుగూరిలో వంట చేయడానికి వెళ్తున్నా అని చెబుతుంది దీప.

Karthika Deepam 11 Jan Today Episode : తాడికొండలో ప్రకృతి వైద్యశాలకు వెళ్లిన సౌందర్య, ఆనంద రావు

మీరు ఏదేదో ఆలోచించకండి. మన కష్టాలు తీరుతాయి అని చెబుతుంది దీప. అన్నం వడ్డిస్తుంది కార్తీక్ కు. మరోవైపు రాత్రి నుంచి సౌందర్య.. కారును డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. భారతి చెప్పిన ప్రకృతి వైద్యశాల ఇదే అనుకుంటా అని అనుకొని తాడికొండ ఊరికి కారును తీసుకొని వెళ్తుంది. మోనిత కూడా ఆమె కారును ఫాలో అవుతుంది.

అమ్మా.. ఇదంతా ప్రియమణి ప్లానా అని అనుకుంటుంది మోనిత. వస్తున్నా.. నువ్వేంటో.. అసలు సౌందర్య ఆంటి నీ దగ్గరికి ఎందుకు వస్తుందో తెలుస్తుంది. కార్తీక్.. నువ్వు ఎక్కడున్నావు అని అనుకుంటుంది మోనిత. మరోవైపు పిల్లలు స్కూల్ కు రెడీ అవుతుంటారు. రండి.. భోంచేద్దురు అంటాడు కార్తీక్.

మరోవైపు కారులో సౌందర్య.. ప్రకృతి వైద్యశాలకు వెళ్తుంది. మీరు ముందు రెస్ట్ తీసుకోండి.. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు.. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతారు. వాళ్లనే ఫాలో అవుతూ వస్తుంది మోనిత. వీళ్లు వచ్చింది ఇందుకా.. అని అనుకుంటుంది మోనిత.

అమ్మా.. మమ్మల్ని స్కూల్ కు తీసుకెళ్తావా అని అంటారు పిల్లలు. అమ్మ ఇప్పుడే అలిసిపోయి వచ్చింది కదరా. నేను తీసుకెళ్తాలే అంటాడు కార్తీక్. దీప.. నేను రావడానికి లేట్ అవుతుంది కంగారు పడకు అంటాడు కార్తీక్. పిండి వంటలు అమ్మడానికి దీప.. పిల్లాడిని తీసుకొని బయటికి వెళ్తుంది. అప్పుడే మోనిత కారు ఆపి.. వేరే వాళ్లను కార్తీక్ గురించి వివరాలు అడుగుతూ ఉంటుంది. అప్పుడే బాబు ఏడుస్తుంటాడు. ఎవరు అంటూ వెతుకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

29 minutes ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

12 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

15 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

19 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

22 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago