Home » Entertainment » Karthika Deepam 11 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 11 July Today Episode : హిమకు క్యాన్సర్ ఉందని అబద్ధం ఆడిందని జ్వాలకు చెప్పిన శోభ.. ఇంతలో జ్వాలకు మరో షాక్.. దీంతో జ్వాల షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: July 11, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 11 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జులై 2022, 1401 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఇంట్లోకి రావచ్చుగా అని అడుగుతుంది హిమ. కానీ.. ఇంట్లోకి రాకుండానే వెళ్లిపోతుంది శౌర్య. తడిచి ఇంటికి వచ్చిన హిమను చూసి సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. శౌర్య.. మన శౌర్య డాడీ ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోయింది అని కార్తీక్, దీప ఫోటో చూసి మాట్లాడుతుంది. ఇంతలో సౌందర్య వచ్చి ఏమైంది ఇప్పటిదాకా రాలేదు. ఈ అవతారం ఏంటి అని అడుగుతుంది సౌందర్య. శౌర్య కోసం వాళ్ల ఇంటి ముందు తన మనసు కరుగుతుందేమోనని నిలుచుకున్నా నానమ్మ. ఈ విషయం మీకు ఎలా చెప్పను అని అనుకుంటుంది హిమ. శౌర్య దగ్గరికే వెళ్లావు కదా. ఇంత ఆలస్యం ఎందుకు అయింది అని అడుగుతుంది సౌందర్య. దీంతో శౌర్య రానంటుంది నానమ్మ. ఎంత చెప్పినా.. ఎంత బతిమిలాడినా.. అస్సలు నా మాటే వినడం లేదు అంటుంది హిమ. ఏదో విధంగా తన మనసు మారుద్దాం. ఏడవకు అంటుంది సౌందర్య.

Advertisement

karthika deepam 11 july 2022 full episode

మరోవైపు ఇంటికి వెళ్తున్న జ్వాలను శోభ చూసి ఆపుతుంది. హాయ్ ఎలా ఉన్నావు. నీతో మాట్లాడాలి అని అంటుంది శోభ. దీంతో నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటుంది జ్వాల. దీంతో లేదు శౌర్య.. ఏంటి షాక్ అయ్యావా.. నాకు అన్నీ తెలిసిపోయాయి. నువ్వు చాలా తెలివైన దానివి అని నాకు తెలుసు. నీకు తెలియని రహస్యం నా దగ్గర ఉంది. అది నేను చెబుతాను. విని నువ్వు ఆశ్చర్యపోతావు. నన్ను నమ్ము.. నిజం.. ప్రామీస్ అంటుంది శోభ. నువ్వొద్దు నీ రహస్యం వద్దు నీ లిఫ్ట్ వద్దు. నా దారిలో నేను వెళ్లిపోతాను అంటుంది జ్వాల. దీంతో సరే.. నీకు నా కారులో రావడం ఇష్టం లేనట్టుంది. ఇక్కడే చెబుతాను. నీకో విషయం తెలుసా? నువ్వే అసలు శౌర్య అని హిమకు ఈ విషయం ఎప్పుడు తెలుసో తెలుసా? బ్లడ్ డొనేషన్ క్యాంపులో నీ శత్రువు గురించి చెబుతున్నప్పుడు.. హిమ దూరం నుంచి చూసింది. అప్పుడే హిమకు అసలు విషయం తెలిసిపోయింది అని అంటుంది శోభ.

Advertisement

అప్పటి నుంచి ఇప్పటి దాకా తను ఎవరో నీకు చెప్పలేదు అంటే ఏంటి అర్థం. నిన్ను నైస్ గా మోసం చేసినట్టే కదా అంటుంది. నువ్వు మీ డాక్టర్ సాబ్ ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత డాక్టర్ సాబ్ ను ఇష్టపడుతున్న హిమ.. తన గుండె జారి పోయింది. అయ్యయ్యో ఏం చేయాలి.. డాక్టర్ సాబ్ దగ్గర్నుంచి నిన్ను ఎలా దూరం చేయాలని ఆలోచించి అద్భుతమైన ప్లాన్ వేసింది.

Karthika Deepam 11 July Today Episode : శోభ చెంప చెళ్లుమనిపించిన జ్వాల

ఆ ప్లానే.. తనకు క్యాన్సర్ ఉందని చెప్పింది అంటుంది శోభ. దీంతో ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది జ్వాల. దీంతో నిజాలు మాట్లాడుతున్నాను. హిమకు క్యాన్సర్ లేదు. నువ్వు నమ్మవు కదా. నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. చూపిస్తాను చూడు అంటుంది శోభ.

Advertisement

నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే మోసం. 2 నెలల కంటే ఎక్కువ బతకదని నమ్మించి.. నీ డాక్టర్ బాబును పెళ్లి చేసుకునేందుకు సెట్ చేసుకుంది. ఇప్పుడు చెప్పు హిమ నిన్ను మోసం చేసిందా లేదా.. చెప్పు. నువ్వేమో వదిలేదేలే అని ఆటో వెనుక రాసుకొని తిరిగావు. కానీ.. ఏం జరిగింది. మోసం జరిగింది.

నిన్ను వెన్నుపోటు పొడిచి నీ ప్రేమను దూరం చేసి ఆ హిమ హ్యాపీగా పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పుడు చెప్పు శౌర్య.. నిన్ను ఇంతగా మోసం చేసిన నీ శత్రువు మీద పగ తీర్చుకుంటావు కదా. ఎలా పగ తీర్చుకుంటావో నీ ఇష్టం. షాక్ అయ్యావా? నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావని. సరే.. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో అంటుంది.

మరి ఇంత మంచి రహస్యం చెప్పినందుకు నాకు థాంక్స్ చెప్పవా అని అడుగుతుంది శోభ. దీంతో థాంక్యూ.. ఒక థాంక్స్ చాలా.. ఇంకొకటి కావాలా అని అడుగుతుంది జ్వాల. నా శత్రువు.. నా పగ నా ఇష్టం. దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఇవ్వకు అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది జ్వాల.

మరోవైపు హిమ ఇంత పని చేసిందని తెలిసి.. జ్వాల చాలా బాధపడుతుంది. ఇంతలో తనకు ఒళ్లంతా నొప్పులు వస్తాయి. ఒంట్లో నీరసంగా ఉంటుంది. జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది అని అనుకుంటుంది జ్వాల. దీంతో బెడ్ మీద దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది.

Advertisement

జ్వాల ఒళ్లు కాలిపోవడంతో.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని అంటుంది చంద్రమ్మ. ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. ఏమైంది పిన్ని.. శౌర్యకు ఏమైంది అని అడుగుతుంది. దీంతో ఒళ్లు కాలిపోతోంది అని అంటుంది. తనను టెస్ట్ చేస్తుంది హిమ. జ్వరం వచ్చింది అని తెలుసుకుంటుంది.

జ్వరం ఎక్కువగా ఉంది అని అంటుంది హిమ. వెంటనే ఎవరికో ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే జ్వాల వేరే ఇంట్లో ఉంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను. ఎవరి ఇల్లు ఇది అని అనుకుంటుంది. పక్కనే హిమ, జ్వాల కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది. అసలు ఏమైంది అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి సౌందర్య, ఆనంద రావు వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి