
karthika deepam 11 june 2022 full episode
Karthika Deepam 11 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 1376 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది ఆటో నడుపుతుంది. కానీ.. హిమకు దానికి ఫ్రెండ్ షిప్ ఏంటి.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది. అదేంటి అని అనుకుంటుంది శోభ. ఇంతలో శాంతాబాయి వచ్చి ఈరోజు ఆశ్రమానికి డాక్టర్ బాబు, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు అంటుంది. నిరుపమ్ సార్ మాత్రం ఎందుకో బాధగా కనిపించారు అని చెబుతుంది శాంతాబాయి. ఏదో జరుగుతోంది. వీళ్ల ముగ్గురిలో ఏదో లింక్ ఉండి ఉండాలి అదేంటి. నేను సీరియస్ గా తీసుకోకపోతే.. పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉంది. వాళ్ల విషయాన్ని గట్టిగా పట్టించుకోవాలి అని అనుకుంటుంది శోభ. మరోవైపు బావ నువ్వు రిపోర్ట్స్ చింపేస్తున్నావు. దేవుడేమో నా ఆయుష్షును క్యాలెండర్ లో చింపేస్తున్నాడు. చూడు.. ఇవి నా లేటెస్ట్ రిపోర్ట్స్ అంటుంది హిమ.
karthika deepam 11 june 2022 full episode
ఎందుకు బావ.. ఇవన్నీ చూసి కూడా నా మీద ప్రేమను పెంచుకుంటున్నావు అని అడుగుతుంది హిమ. దీంతో పెంచుకోవడం కాదు.. నీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు అంటాడు నిరుపమ్. బావ నేను కూడా నిన్ను ప్రేమించాను కానీ.. నేను ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోతున్నాను. అప్పుడు నేను నీకు ఉండను కదా బావ. నా ప్రేమ కూడా ఉండదు అంటుంది హిమ. అందుకని.. నా మాట విను బావ అంటుంది హిమ. మనిషి పోయాక కళ్లు, అవయవాలు దానం చేస్తారు కదా. అవి మరో వ్యక్తి దగ్గర జీవిస్తాయి. వాళ్లకు తోడుగా నిలుస్తాయి అంటుంది. నా ప్రేమను కూడా నీకు వేరే వాళ్ల రూపంలో అందించబోతున్నాను. అది నువ్వు స్వీకరించాలి బావ అంటుంది హిమ. నాకు బదులుగా నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటుంది హిమ. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు. వీళ్ల మాటలను చాటుగా వింటూ ఉంటుంది శోభ.
నా ప్రేమను ఆ అమ్మాయి రూపంలో నీకు అందిస్తాను. ఆమెలో నన్ను చూసుకో బావ అంటుంది హిమ. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. వేరే అమ్మాయిలో నేను నీ ప్రేమను చూసుకోవాలా? ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడుగుతాడు నిరుపమ్.
దీంతో నువ్వు తనను పెళ్లి చేసుకుంటా అంటేనే నేను చెబుతాను అంటుంది హిమ. నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే.. నేను చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది హిమ. నీ మీద ప్రేమ ఉంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటాడు నిరుపమ్.
దీంతో చెప్పాను కదా బావ. నా ప్రేమను తనలో చూసుకోవాలి. బావ నాకు ప్రామిస్ చేస్తున్నావు అని అంటుంది హిమ. నాకు నువ్వు ప్రామిస్ చేస్తున్నావు. ఇదే నాకు ప్రామిస్ అంటుంది హిమ. నువ్వు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో బావ అంటుంది హిమ.
ఆ అమ్మాయే నీకు కరెక్ట్ అంటుంది హిమ. దీంతో ఇంతకీ ఎవరో చెప్పు హిమ అంటాడు నిరుపమ్. దీంతో జ్వాల అంటుంది హిమ. దీంతో శోభ, నిరుపమ్ ఇద్దరూ షాక్ అవుతారు. హేయ్ హిమ.. ఏం మాట్లాడుతున్నావు. జ్వాలను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు నిరుపమ్.
దీంతో తనే నీకు కరెక్ట్. తను నిన్ను బాగా చూసుకుంటుంది అంటుంది. నేను ఎటూ చచ్చిపోతున్నాను. నా మాట వినను బావ అంటుంది హిమ. నువ్వు జ్వాలను ఎందుకు చేసుకోమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు తనేంటి.. నేనేంటి అంటాడు.
దీంతో నా మాట విను ప్లీజ్. జ్వాలకు కూడా నువ్వంటే ఇష్టం బావ అంటుంది హిమ. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు. శోభకు మాత్రం చాలా కోపం వస్తుంది. చీచీ.. ఈ దరిద్రం పోవడానికి కూడా నేను ఇచ్చిన ఐడియానే కారణం అయిందా అని అనుకుంటుంది శోభ.
నా మీద నీకు ఎలాంటి ప్రేమ ఉన్నా.. నువ్వు జ్వాలనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మూర్చబోతుంది హిమ. మరోవైపు కార్తీక్, దీప ఇద్దరి ఫోటోలను చూస్తూ నిలబడతాడు ఆనంద రావు. ఏమైందండి… అని అడుగుతుంది సౌందర్య. దీంతో నా కష్టాలను నా కొడుకు కోడలుతో చెప్పుకుంటున్నాను అంటాడు ఆనంద రావు.
హిమకు నిరపమ్ అంటే ఇష్టం. ఇక్కడి దాకా ఓకే. తనకు క్యాన్సర్ ఉందని ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. కానీ.. తన బావను ఆటో దానికి కట్టబెట్టడమే నాట్ ఓకే. ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని అనుకుంటుంది శోభ. ఒక డాక్టర్ ను ఆటోదానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు హిమ అనుకుంటుంది అని డౌట్ పడుతుంది శోభ.
ఈ రెండు ఫ్యామిలీ మధ్య ఏదో తెలియని లింక్ ఉంది అని అనుకుంటుంది శోభ. మరోవైపు స్వప్నను కలుస్తుంది శోభ. అది ఎటూ చనిపోతుంది కదా. ఆ తర్వాత నిరుపమ్ తో నీకు పెళ్లి చేస్తాను. అదే మాట నేను మమ్మీకి కూడా చెబుతాను అంటుంది స్వప్న.
కానీ.. మీకు నిరుపమ్ ను జ్వాల పెళ్లి చేసుకోవాలని హిమ కోరింది ఆ విషయం తెలిస్తే మీరు ఏం చేస్తారో అని మనసులో అనుకుంటుంది శోభ. మరోవైపు జ్వాలను కలుస్తుంది హిమ. ఏమైంది తింగరి అని అడుగుతుంది జ్వాల. ఇన్నాళ్లు నీ డాక్టర్ సాబ్ కు ప్రేమ విషయం చెబుతానంటే నేను ఆపాను.
ఇప్పుడు నువ్వు చెప్పేయొచ్చు అంటుంది హిమ. ఏంటి మళ్లీ చెప్పు అంటుంది జ్వాల. దీంతో నిజం అంటుంది హిమ. మీ డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్లి నీ స్టయిల్ లో ఎలా చెబుతావో చెప్పు అంటుంది హిమ. దీంతో జ్వాల చాలా సంతోషిస్తుంది. నువ్వు నిజంగా గుడ్ న్యూస్ చెప్పావు అంటుంది జ్వాల.
దీంతో డాక్టర్ సాబ్ కు ఎలా ఐలవ్యూ చెప్పాలా అని అనుకుంటుంది జ్వాల. బాధ్యత బాధ్యత అంటున్నావు నీ బాధ్యత తీరిందా అని అంటుంది జ్వాల. దీంతో ఏమో.. మనిద్దరం పోయిన జన్మలో అక్కాచెళ్లెళ్లమేమో అంటుంది హిమ. దీంతో ఆ బంధం గురించి నాకు చెప్పకు. మనిద్దరం ఫ్రెండ్స్.. అంతకంటే ఎక్కువ మనం ఫిక్స్ అయిపో అంటుంది జ్వాల.
మరోవైపు హిమకు సిస్టర్ ఉందనే విషయం నాకు లేట్ గా తెలిసిందా? ఇంట్లో నుంచి పారిపోయింది ఆ జ్వాలనేనా అనే డౌట్ వస్తుంది శోభకు. ఇద్దరూ సిస్టర్స్ అయితే ఒకరి గురించి మరొకరికి తెలియదా. ఇద్దరు సిస్టర్స్ కాకపోతే జ్వాల మీద హిమకు అంత ప్రేమ ఎందుకు ఉంది అని అనుకుంటుంది శోభ.
ఇంతలో గీతకు ఫోన్ చేస్తుంది శోభ. నువ్వు ఎక్కడున్నావు చెప్పు నేను వస్తాను అంటుంది. దీంతో సరే నేను పంపిస్తాను అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, జనసేన…
YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా నుండి మళ్ళీ పూర్వ వైభవం…
Ustaad Bhagath Singh : టాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ సినిమాల గోల మామూలుగా లేదు. మన స్టార్ హీరోలు…
Realme C100 : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ రియల్‌మి C100 5Gను…
Induction Stove : ఇటీవలి కాలంలో చాలా ఇళ్లలో గ్యాస్ స్టవ్‌తో పాటు ఇండక్షన్ స్టవ్ వినియోగం గణనీయంగా పెరిగింది.…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇప్పుడు ముదురు పాకాన పడింది. ముఖ్యంగా…
Gold Silver Price Drop 17 March 2026 : బంగారం కొనాలనుకునే వారికి, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి…
Karthika Deepam 2 March 17 Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ 'కార్తీక…
Raw mango : వేసవి కాలం ప్రారంభమయ్యిందంటే మార్కెట్లలో పచ్చి మామిడి పండ్ల హడావిడి మొదలవుతుంది. పుల్లగా, కారం కలిపి…
Coconut Water : వేసవికాలం వచ్చేసరికి ఎండలు తీవ్రంగా పెరుగుతాయి. ఈ సమయంలో శరీరానికి చల్లదనం కలిగించే పానీయాలపై చాలా…
Astrology : మన భారతీయ సంప్రదాయంలో మంగళసూత్రం, గాజులు, మెట్టెలు వంటి ఆభరణాలు కేవలం అలంకారాలకే పరిమితం కావు. అవి…
JaiShankar : భారత విదేశాంగ విధానం ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా మారుతోంది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ…
This website uses cookies.