karthika deepam 11 november 2021 full episode
Karthika Deepam 11 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్, 2021 గురువారం 1194 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దోష నివారణ పూజ అయిపోగానే.. కార్తీక్, మోనిత మధ్య గొడవ జరుగుతుంది. నీ బతుకు నువ్వు బతకు.. నాకు ఎదురు పడకు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. చేసింది చాలు.. గుడ్ బై అని చెప్పి కార్తీక్ వెళ్లబోతాడు. దీంతో కార్తీక్ ను అస్సలు వెళ్లనీయదు మోనిత. ఆనంద రావు గారు మీ డాడీ వెళ్తున్నారు. డాడీ నేను కూడా వస్తాను అంటావా?
karthika deepam 11 november 2021 full episode
దీంతో కార్తీక్ కు కోపం వస్తుంది. తనను కొట్టబోతాడు కానీ.. సౌందర్య కార్తీక్ ను కూల్ చేసి అక్కడి నుంచి కార్తీక్ ను తీసుకెళ్తుంది. ఇంతలో కార్తీక్, సౌందర్య కారు దిగుతారు. వారణాసి అక్కడే ఉండి కారు తూడుస్తుంటాడు. మమ్మీ గుడి దగ్గరికి దీప వచ్చినట్టు అనిపించింది నాకు అంటాడు. ఏంటి కార్తీక్.. అక్కడికి దీప రావడం ఏంటి.. దీప వస్తే ఊరుకుంటుందా? అని అంటాడు. నాకైతే దీప కనిపించింది అంటాడు కార్తీక్. అదంతా నీ ఊహ. అస్తమానం దీప గురించి కంగారు పడుతున్నావు కదా అని సర్దిచెబుతుంది సౌందర్య.
అయితే.. కారులో దీప రాకపోవడం చూసి.. మేడమ్.. దీపక్క రాలేదా మేడమ్ అంటాడు వారణాసి. దీప మాతోటి ఎందుకు వస్తుంది అంటుంది సౌందర్య. దారిలో గుడి దగ్గర మీ కారును చూసి మీ కారులో వస్తాను వెళ్లమంది. దీంతో నేను వచ్చేశాను.. అంటాడు వారణాసి. అక్క గుడి ముందు మీ కారు చూసి లోపలికి వచ్చింది. అప్పటికి నేను ఉంటాను అన్నాను కానీ.. అక్క నన్ను వెళ్లిపోమంది.
మిమ్మల్ని దీపక్క కలవలేదా మేడమ్ అంటుంది వారణాసి. మరి ఇంటికి కూడా రాలేదు కదా మేడమ్ అంటాడు వారణాసి. దీంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు. కార్తీక్ ఇంట్లోకి వెళ్లి మెట్ల మీద కూలబడతాడు. అంటే దీప గుడిలోకి వచ్చిందా? దీప.. మనం చేసే పూజ చూసిందంటావా? అంటుంది సౌందర్య. తను నాకు దూరం నుంచి కనిపించింది అని చెప్పాను కదా మమ్మీ అంటాడు కార్తీక్. అయిపోయిందిరా పెద్దోడా? అంతా అయిపోయింది.. అని అంటుంది సౌందర్య.
పూజ చూసి ఇంకా ఇంటికి రాలేదు అంటే.. దీప ఎక్కడికి వెళ్లి ఉంటుంది. ఏమై ఉంటుంది అంటుంది సౌందర్య. ఇప్పుడు నేను ఏం చేయాలి. తనకు ఏమని సమాధానం చెప్పాలి అంటాడు కార్తీక్. దీప ఎక్కడికి వెళ్లి ఉంటుంది మమ్మీ అంటాడు కార్తీక్. దీప వస్తుందా? దీపకు నా మొహం ఎలా చూపించాలి మమ్మీ అంటాడు.
వద్దు వద్దు అంటున్నా తీసుకెళ్లావు కదా మమ్మీ. ఇప్పుడు ఏం చెబుతావు మమ్మీ. దీప నన్ను నమ్ముతుందా. నేనెలా నమ్మించాలి దీపను. నేనే తప్పు చేయలేదని ఎలా చెప్పాలి అంటాడు కార్తీక్. దీంతో సౌందర్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈశ్వరా ఏంటి ఈ పరీక్ష. దీప ఎక్కడికి వెళ్లింది.. అని టెన్షన్ పడుతుంది సౌందర్య.
మరోవైపు ఇంటికి వచ్చిన మోనిత.. తనను తాను పొగుడుకుంటుంది. నువ్వు ఎంతైనా గ్రేట్ మోనిత. కార్తీక్ తో పూజలో కూర్చున్నావు. సౌందర్య అత్తగారితో పూజ చేయించావు. ఇంతకన్నా పెద్ద విజయం ఏముంటుంది. మోనిత.. నువ్వు సూపరో సూపర్ అనుకుంటుంది. అవును.. కార్తీక్ తిట్టాడుగా నన్ను అనుకుంటుంది. అవును.. కార్తీక్ తిట్టాడు అని వెంటనే బాధపడుతుంది.
దీప బస్తీకి వెళ్తుంది. దీంతో అందరూ నువ్వు మళ్లీ బస్తీకి రావడం ఏంటి అంటారు. మీరు అమెరికా వెళ్లిపోయినా బాగుండేది అక్క అంటాడు వారణాసి. పెద్దమనుషులతో మాట్లాడుదాం. పంచాయితీ పెట్టిందాం అని అందరూ అంటారు. అందరూ బాధపడతారు. కానీ.. దీప మాత్రం ఏం మాట్లాడదు. దీప.. 11 ఏళ్ల సీతమ్మలా కష్టాలు పడ్డావు. వనమాసం చేసినట్టు ఎన్నో కష్టాలు పడింది ఇక్కడికి రావడానికా అంటారు.
కానీ.. దీప మాత్రం ఏం మాట్లాడదు. మాట్లాడక్కా.. మళ్లీ వంటలక్కలా కష్టపడుతుంటే నేను అయితే చూస్తూ ఊరుకోలేను అక్క అంటాడు వారణాసి. అయితే.. ఇదంతా కల.. నడుచుకుంటూ దీప బస్తీకెళ్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటుంది. దీంతో దీపకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు.
ఈ విషయం తెలిసి ఆనందరావు సీరియస్ అవుతాడు. అనుకున్నదే జరిగింది. నేను ముందే చెప్పా.. దీపకు అన్ని విషయాలు చెప్పండి అని. కానీ.. మీరు వినలేదు. ఇప్పుడు ఏం చేయాలి. కనీసం బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి అంటూ ఏదేదో మాట్లాడుతుంటే.. డాడీ ప్లీజ్ ఆపండి.. నీకు దండం పెడతాను అంటాడు కార్తీక్. కోపం వస్తుందా. నేను అన్నదాంట్లో తప్పేముంది.. అంటాడు ఆనందరావు.
మరోవైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దీప.. నేను చూసింది నిజమేనా.. అని అనుకుంటుంది. దోషనివారణ పూజ అంటే ఇదేనా. అత్తయ్య దగ్గరుండి ఈ పూజ చేయించడం ఏంటి అని అనుకుంటుంది దీప. అసలు నా జీవితం ఏమౌతోంది అని అనుకొని బాధపడుతుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ వ్యక్తితో సంబంధం…
Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న…
Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…
Kingdom Movie : టాలీవుడ్ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, vijay devarakonda , bhagya…
Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి…
This website uses cookies.