Home » Entertainment » Karthika Deepam 12 August 2022 Full Episode
Entertainment

Karthika Deepam 12 August 2022 Episode : ప్రేమ్ గురించి భయపడుతున్న నిరూపం.. నిరూపం, సౌర్యల పెళ్లి ఎలాగైనా చేయాలి అని చూస్తున్న హిమ..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: August 12, 2022, 10:34 am
Advertisement

Karthika Deepam 12 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 12 శుక్రవారం ఎపిసోడ్ 1429 ఇప్పుడు చూద్దాం.. సౌందర్య, శౌర్యతో చిన్నప్పటి గతమంతా చెప్తుంది. ఇప్పుడు చెప్పవే నీకోసం నేను చిన్నప్పుడు రాలేదా అని అంటుంది.. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్న నాయనమ్మ ఏదో ఉంటున్న అంటే ఉంటున్న అని అంటుంది శౌర్య. నేనెవరో కొత్త వాళ్ళ ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది మీ నాటకాలు మీరు అని అంటుంది. అంతలో అక్కడికి హిమ ఆనందరావు వస్తారు. అప్పుడు హిమ ఏంటి సౌర్య నువ్వు అలా మాట్లాడుతున్నావ్ నాకెంత బాధ్యత ఉందో నీకు కూడా అంతే బాధ్యత ఉంది అని అంటుంది. అప్పుడు సౌర్య ఊరుకో బాధ్యత బాధ్యత అని ఇక్కడదాకా తీసుకొచ్చావు అని అంటుంది. ఇప్పటికీ నేను అదే మాట మీద ఉన్న మీ ఇద్దరి పెళ్లి కచ్చితంగా చేస్తాను అని అంటుంది హిమ. ఆనందరావు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ ఇక పెళ్లి పీటల దగ్గరికి వచ్చింది. అని ముగ్గురు హిమను తిడతారు. కట్ చేస్తే స్వప్న పెళ్లి గురించి అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటుంది.

Advertisement

కట్ చేస్తే ప్రేమ్ హిమ గురించి ఆలోచించుకుంటూ ఫోన్లో హిమ ఫోటోను చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నిరూపం వచ్చి ఫోన్ లాక్కుంటాడు. ఇందులో ఏం సీక్రెట్స్ ఉన్నాయ్ రా అని అడుగుతాడు. అలాంటివి ఏమి లేవు రా అన్ని ఓపెన్ అని అంటాడు. ఇంతలో సప్న, సత్యం కూడా వస్తారు. వాళ్లు ముగ్గురు ప్రేమ్ ని పెళ్లి గ్రాండ్ గా జరిగేలా చూసుకోవాలి అని చెప్తారు. అప్పుడు ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. వాళ్లు ముగ్గురు ప్రేమ్ ఎందుకు ముభావంగా ఉంటున్నాడు ఏమి చెప్పట్లేదు అని అనుకుంటారు. కట్ చేస్తే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. హిమ ఒకపక్క ఈ పెళ్లి ఆపి సౌర్య తో పెళ్లి జరిపించాలని ఆలోచిస్తూ ఇంకొకపక్క ప్రేమ్ ప్రపోజలను తో భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సత్యం స్వప్న బట్టలు తీసుకొని వస్తారు. స్వప్న నీకు కూడా చాలా చీరలు తెచ్చానే అని సౌర్య అని ఉంటుంది. అప్పుడు శౌర్య నాకెందుకు తీసుకొచ్చావు. నాకు బట్టలు లేవు అని నీకు నేను చెప్పాన.. ఒకరు ప్రేమని చూపిస్తున్నారు. ఒకళ్ళు శాడిజం చూపిస్తున్నారు. ఇవి చూడలేక చచ్చిపోతున్నా..

Karthika Deepam 12 August 2022 Full Episode

Advertisement

ఈ పెళ్లి జరిగిన తర్వాత నా దారి నేను చూసుకుంటా… అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ప్రేమ్ ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నిరూపం అక్కడికి వచ్చి ఏమైంది అసలు నీకు నువ్వు ఎందుకు మూడీగా ఉంటున్నావ్ ఏదో ఆలోచిస్తున్నావ్ అని అంటాడు. ఇక్కడ నిరుపం ప్రేమ్ ని అడుగుతుంటాడు. అక్కడ హిమ సౌర్యాన్ని అడుగుతూ ఉంటుంది. సౌర్య అసలు ఈ సమస్య ఏమిటి నా దగ్గరికి ఎందుకు వచ్చావు. అని అంటుంది. అప్పుడు హిమ నువ్వు నాతో ఫ్రెండ్ లా ఉండలేవా అని అంటుంది. మోసం చేసే ఫ్రెండ్ ఉంటారా. అని అంటుంది శౌర్య. ఇక్కడ నిరుపం ప్రేమ్ ని ఎవరినైనా ప్రేమించావా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు రా చెప్పు ఎలాంటి ప్రాబ్లం అయినా చెప్పు అని అంటాడు. అప్పుడు ప్రేమ్ మనసులో హీమని ఇద్దరము ఇష్టపడుతున్నాం నీకెలా చెప్పాలి రా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ హిమ, నిరూపం బావని ఇద్దరం ఇష్టపడ్డాము కానీ నీకోసం నేను త్యాగం చేస్తున్న అది అర్థం చేసుకోవచ్చు గా సౌర్య అని హీమ మనసులో అని అనుకుంటుంది.అప్పుడు సౌర్య ఇక ఇక్కడి నుంచి వెళ్ళు అని బయటికి తీసుకెళ్లి వదిలేస్తుంది.

కట్ చేస్తే సౌర్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఆనందరావు వస్తాడు. పెళ్లి కార్యక్రమాలు చూసుకునే వాళ్ళు వచ్చి మీరు చెప్పిన పని అయిపోయింది సార్ . మేము వెళ్ళిపోతున్నాం అని మీ మనవరాలకి బంగారం లాంటి భర్త దొరికారండి అని అంటారు. అప్పుడు ఆనందరావు నా మనవరాలు మనసు మారుద్దామని నేను వస్తే ఇది బెడ్స్ కొట్టేలా ఉందిగా అని అనుకుంటాడు. అప్పుడు ఆనందరావు ఏం చేస్తున్నావ్ బంగారం అని సౌర్య నీ అంటాడు. అప్పుడు నన్ను బంగారమని పిలవద్దు తాతయ్య నాకు ఇలాంటి నచ్చవు అని అంటుంది. నేను ఒక విషయం చెప్పనా నువ్వు వచ్చిన వేళా విశేషం ఈ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతున్నాయి. మీ అత్త ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టింటి కి రావడం మానేసింది. తనని నువ్వు మార్చి మళ్లీ ఈ పుట్టింటికి దగ్గర చేశావు. ఇది విశేషమే కదా.. అని అంటాడు. అప్పుడు ఇప్పుడు ఏంటి తాతయ్య నాకు శాలువా కప్పి అవార్డు లాంటి ఇస్తావా ఏంటి అని అంటుంది. నిజంగా నీకు శాలువా కప్పి సన్మానం చేసి అవార్డులు ఇచ్చే అంత గొప్ప పని చేశావు నువ్వు.

Advertisement

ఇది నిజంగా రా బంగారం అని అంటాడు. అప్పుడు శౌర్య నాకు పొగడ్తలు నచ్చవు తాతయ్య. అని అంటుంది. అప్పుడు ఆనంద్ రావు మీ స్వప్న అత్త కలిసిపోయింది కదా.. నువ్వు కూడా హిమతో కలిసి పోరాదు రా అని అంటాడు. అప్పుడు శౌర్య ఈ జన్మకు అది జరగదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నిరూపం, ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.  నా పెళ్లయిన తర్వాత వాడి ప్రాబ్లం క్లియర్ చేయాలి అని అనుకుంటాడు. తర్వాత హిమ గురించి ఆలోచిస్తాడు. హిమ పెళ్లి చివరి క్షణంలో కూడా సౌర్య గురించి ఏదో ఒకటి చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే హిమ, శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి సౌందర్య వచ్చి ఇంకా నువ్వు రెడీ అవ్వమంటే ఇక్కడ నిల్చున్నావ్ ఏంటి వెళ్లి రెడీ అవ్వు అని అంటుంది.అప్పుడు నాయనమ్మ నాయనమ్మ అని అంటూ ఉంటుంది. నువ్వు వెళ్లి తొందరగా రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ ఈ పెళ్లి ఎలా ఆపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి