Home » Entertainment » Karthika Deepam 12 January 2022 Full Episode
Entertainment

Karthika Deepam 12 Jan Today Episode : హోటల్ లో మోనితను చూసి కార్తీక్ షాక్.. మోనిత కార్తీక్ ను చూస్తుందా? కార్తీక్ ఎక్కడున్నాడో మోనితకు తెలిసిపోతుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: January 12, 2022, 2:00 pm
Advertisement

Karthika Deepam 12 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జనవరి 2022, బుధవారం 1247 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే ఆదిత్య, శ్రావ్య.. సౌందర్య, ఆనంద రావు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరూ ప్రకృతి వైద్యశాలకు వెళ్లారన్న విషయం కూడా మరిచిపోతాడు ఆదిత్య. ఏంటో.. మన కుటుంబం మొత్తం చెల్లాచెదురుఅయిపోయింది అని బాధపడుతుంటాడు ఆదిత్య. మరోవైపు ప్రియమణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. తాడికొండలో ప్రియమణి జాడ ఎలా కనుక్కోవాలని తన ఫోటోను అందరికీ చూపిస్తూ ప్రియమణి గురించి ఆరా తీస్తూ ఉంటుంది. ఇంతలో దీప వెనుక పిల్లాడితో మోనిత ఉన్న రోడ్డు నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ.. మోనితను దీప చూడదు.

Advertisement

karthika deepam 12 january 2022 full episode

ప్రియమణి గురించి ఎవ్వరిని అడిగినా మాకు తెలియదు అంటారు. దీంతో ప్రియమణిది అసలు ఈ ఊరేనా అని అనుకుంటుంది మోనిత. ఇంతలో ఆనంద్ గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. పిల్లాడి ఏడుపు విన్న మోనిత.. ఎవరు పిల్లాడు.. అంటూ చూస్తుంటుంది. ఏమైంది నాన్న ఇప్పటి దాకా బాగానే ఉన్నావు కదా అని ఒక చోట కూర్చొని ఆనంద్ ను ఎత్తుకుంటుంది దీప. మరోవైపు ఎవరు పిల్లాడు ఏడుస్తున్నాడని అక్కడా ఇక్కడా వెతుకుతుంది మోనిత. ఇంతలో తనకు తన కొడుకు గుర్తొస్తాడు. కాసేపు బాధపడుతుంది. ఇంతలో ఆకలేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు హోటల్ లో పనిచేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.

Advertisement

కార్తీక్ వాలకం చూసి.. నువ్వు ఏం చదువుకున్నావు అంటాడు. చదువుతో పని ఏముంది సార్. పని దైవం అని భావించే వాళ్లకు ఏ పని చేసినా సిగ్గుపడకూడదు.. అంటాడు కార్తీక్. చదువుకున్నోడే అయినా పని శ్రద్ధగా చేస్తున్నాడు అని అనుకుంటాడు హోటల్ అతడు.

మరోవైపు దీప.. ఒకరి ఇంటికి వెళ్తుంది. కష్టాల్లో ఉన్నాను చీటీ కావాలి ముందే అని అంటుంది. 3 లక్షల చీటీ అంటే కష్టం. ఎవరైనా ష్యూరిటీ ఇవ్వాలి అంటుంది. కానీ.. నాకు ఇక్కడ తెలిసిన వాళ్లు ఎవ్వరూ లేరు. నా గుర్తింపు కార్డులన్నీ నీకే ఇచ్చేస్తా.. అనగానే సరే నేను ఇస్తానులే అని చెప్పి దీపను పంపిస్తుంది. తర్వాత రుద్రాణికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది ఆ మహిళ.

Advertisement

Karthika Deepam 12 Jan Today Episode : కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కు వచ్చిన మోనిత

కార్తీక్ హోటల్ లో అందరికీ భోజనం వడ్డిస్తుంటాడు. కార్తీక్ హుషారుగా అందరికీ వడ్డిస్తుంటాడు. ఇంతలో ఆ హోటల్ కు మోనిత వస్తుంది. కానీ.. అప్పుడే కార్తీక్ పార్శిల్ కట్టడం కోసం లోపలికి వెళ్తాడు. మరోవైపు ప్రకృతి వైద్యశాలలో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది సౌందర్య.

మరోవైపు మహేశ్ కు ఫోన్ చేసి.. కార్తీక్ జాడ గురించి అడుగుతుంది సౌందర్య. మేము తాడికొండ గ్రామానికి వచ్చాము.. ప్రస్తుతానికి ఇక ప్రకృతి వైద్యశాలలో ఉన్నాం అని చెబుతుంది సౌందర్య. మీరు అక్కడికి వచ్చారా.. నేను ఆ ఊరంతా వెతికాను మేడం.. అని చెబుతాడు మహేశ్.

కట్ చేస్తే మోనిత హోటల్ లో కూర్చుంటుంది. కస్టమర్ అమ్మాయి కావడంతో కార్తీక్ ను కాకుండా అప్పరావు అనే మరో సర్వర్ వెళ్లి తనకు ఫుడ్ సర్వ్ చేయడానికి అడుగుతాడు. మీరు సినిమా హీరోయిన్ లా ఉన్నారు అంటూ సర్వర్ తనను పొగుడుతాడు. తన వాయిస్ విని కార్తీక్ షాక్ అవుతాడు. మోనిత వాయిస్ లా ఉందేంటి అని అనుకుంటాడు కార్తీక్.

మోనితను చూసి షాక్ అవుతాడు. మోనిత ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకొని కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి