Karthika Deepam 13 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 1325 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను నీకు దగ్గర అవుదామనుకుంటే.. నువ్వు నాకు దూరం అవుతున్నావా శౌర్య. నువ్వు ఎంత దూరం వెళ్లినా నీ నీడలా నీ వెంటే ఉంటాను. నీ కోపం తగ్గేలా నేను చూసుకుంటాను శౌర్య అని అనుకుంటుంది హిమ. తనను అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్లడంతో ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంటుంది హిమ. ఇంతలో ఆటో కావాలా అంటూ మళ్లీ వస్తుంది జ్వాల. ఏయ్ తింగరి ఎక్కు అంటుంది జ్వాల. దీంతో ఆటో ఎక్కుతుంది తింగరి. చేతుల్లో సెల్ ఫోన్ ఉంది కదా.. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా. నువ్వు నిజంగా తింగరి దానివే అంటుంది జ్వాల.
చూడు ఇప్పుడే చెబుతున్నాను. మళ్లీ నా విషయాలు అడగొద్దు. నా టాపిక్ తీయొద్దు. పోనీలే పాపం తింగరి అని చెప్పి మళ్లీ వెనక్కి వచ్చాను.. అర్థం అయిందా అంటుంది. దీంతో సరే.. అర్థం అయింది అంటుంది తింగరి. నువ్వు నాకోసం వెనక్కి వచ్చావంటే ఖచ్చితంగా నీ మీద నాకు కొంచెం ప్రేమ ఉందని అర్థం అయింది. అంటే.. నిన్ను మార్చడం పెద్ద కష్టమేమీ కాదు అని అనుకుంటుంది హిమ. మరోవైపు లాప్ టాప్ లో హిమ ఫోటోలను చూస్తుంటాడు ప్రేమ్. నా మనసులో మాటను ఎలాగైనా చెప్పేస్తాను అని అనుకుంటాడు.
మరోవైపు శౌర్యకు ఉన్న దూకుడుతనాన్ని తగ్గించాలి అని అనుకుంటుంది జ్వాల. నీ మీద నాకు కోపం లేదు.. కొండంత ప్రేమ ఉంది. అది చూపించే టైమ్ రావట్లేదు అని అనుకుంటుంది. ఆటో వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపుతారు. లైసెన్స్ చూపించమని అడుగుతారు. పోలీస్ అన్నీ చెక్ చేస్తాడు. బండి పేపర్ వాలిడిటీ అయిపోయింది కదా.. రెన్యువల్ చేయించుకోవాలి కదా అంటాడు.
దీంతో ఈరోజుకు వదిలేయండి సార్.. చేయించుకుంటాను అంటుంది. ఇంతలో ప్రేమ్ స్కూటీని కూడా ఆపుతారు. ఇంతలో ప్రేమ్ వీళ్లను చూస్తాడు. వెళ్లి తన పేపర్స్ చూపిస్తాడు. అతడివి అన్నీ ఓకే ఉంటాయి. కానీ.. జ్వాల ఆటో పేపర్స్ సరిగ్గా లేకపోవడంతో తనను అస్సలు వదిలిపెట్టకండి అంటాడు ప్రేమ్.
ఈ ఆటోను, వీలైతే తిక్కను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లండి అంటాడు ప్రేమ్. పొద్దున్నే లేచి ఈరోజు ఎవరి మొహం చూశానో.. నా కళ్లతో ఇంత మంచి సీన్ చూస్తున్నాను అని అనుకుంటాడు ప్రేమ్. దేవుడా నువ్వు ఉన్నావయ్యా.. ఉన్నావు అని అనుకుంటాడు.
ఎక్స్ ట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు అంటుంది జ్వాల. ఇంతలో స్కూటీ కీని తీసి దాచేస్తుంది. దీంతో కీ ఎక్కడ పోయిందో అని వెతుకుతూ ఉంటాడు. కీ తన దగ్గరే ఉందని చెబుతుంది. ఇచ్చేయ్ అంటాడు కానీ.. తను ఇవ్వదు. ఆగు.. నీ ఆటో కీ తీస్తా అని ఆటోలోకి వెళ్లగానే బైక్ పై కూర్చొని వెళ్లిపోతారు జ్వాల, తింగరి.
ఆటో కీ ప్రేమ్ కు ఇచ్చి.. అందులో సత్యం సార్ కు ఇచ్చే బాక్స్ ఉంది. దాన్ని ఇచ్చేసి ఆటో తీసుకొనిరా అని చెబుతుంది. మరోవైపు నిరుపమ్ కూడా హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి శౌర్యతో పోల్చితే నువ్వు సైలెంట్ అని విన్నాను కానీ.. కార్తీక్ మామయ్య, దీప అత్తయ్యల సంఘటన ద్వారా నువ్వు ఇంకా సైలెంట్ అయిపోయావు.
అందుకే నిన్న మార్చమని జ్వాలకు చెప్పాను. ఈ మధ్య నువ్వు బాగా హుషారు అయ్యావు. మిగిలింది ఏమైనా ఉంటే నేను మార్చుకుంటాను. శౌర్యతో కన్నా నీతోనే నాకు ఎక్కువ ఫ్రెండ్ షిప్ ఉండేది. నీతో మాట్లాడాలని, టైమ్ స్పెండ్ చేయాలని నాకు ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అనుకుంటాడు నిరుపమ్.
మరోవైపు బైక్ మీద వెళ్తున్న హిమ, జ్వాలను చూసిన సౌందర్య వాళ్లను ఫాలో అవుతుంది. హిమ ఎక్కడికి వెళ్తోంది అని అనుకుంటుంది. మరోవైపు ఆటో తీసుకొని వస్తుంటాడు ప్రేమ్. ఇంతలో స్వప్న అతడిని చూసి షాక్ అవుతుంది. నువ్వేంట్రా ఆటోలో వస్తున్నావు అంటుంది.
అసలు నువ్వు ఏం చేస్తున్నావు.. నీకు ఏమైంది అని అడుగుతుంది. ఆటో ఎందుకు నడుపుతున్నావు అని అడుగుతుంది. దీంతో జరిగిన స్టోరీ మొత్తం చెబుతుంది. దీంతో ఆ ఆటోది అంత పని చేసిందా అని అంటుంది స్వప్న. అది నీ బైక్ తీసుకెళ్తుంటే ఆపకుండా నువ్వు చేసిన పనేంటి అంటుంది.
మరోవైపు తన కారు బ్రేక్ డౌన్ అవడంతో కారును బాగు చేస్తాడు ప్రేమ్. మరోవైపు హిమ బైక్ నే ఫాలో అవుతూ.. హారన్ కొడుతుంది సౌందర్య. హిమ కావాలని ఎందుకు తప్పించుకుంటోంది అని అనుకుంటుంది. ఇంతలో జ్వాల బైక్ ఆపుతుంది. ఇంతలో కారు దిగి వాళ్ల వైపు వెళ్తుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.