Karthika Deepam 13 August 2022 Full Episode
Karthika Deepam 13 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 1430 శనివారం ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ప్రేమ్ హిమలు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని మాట్లాడుకుంటారు. అంతలో సౌందర్య అక్కడికి వచ్చి హిమ ను తీసుకెళ్తుంది. కట్ చేస్తే సౌర్య రెడీ అవుతుంది. అక్కడికి ఆనందరావు వచ్చి సౌర్యాన్ని చూసి నువ్వు చీర లో చాలా బాగున్నావ్ రా తల్లి మనం ఒక ఫోటో దిగుదాం అని సెల్ఫీ దిగుతారు. సౌర్యాని ఇప్పుడు నిన్ను ఎవరైనా చూస్తే ఆటో నడుపుకునే దానివి అంటారా… చాలా బాగున్నావ్ బంగారం. అసలు ఆటో నీ లైఫ్ లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు సౌర్య నేను చిన్నప్పుడు అలా వెళ్తుండగా నాకు వారణాసి కలిసాడు. అప్పుడు నిన్ను ఎవరు పంపించారు అని నేను గట్టిగా అడిగాను. కానీ నేనే వచ్చాను నన్నెవరూ పంపించలేదు అని అన్నాడు. నేను ప్రతిరోజు హాస్పిటల్ కెళ్ళి చూస్తున్నాను అమ్మ నాన్న ల శవాలు కనిపిస్తాయేమోనని అని అంటాడు. అప్పుడు సౌర్య నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు వారణాసి అని అన్నాను.
అప్పుడు వారణాసిని నువ్వు నాకు ఆటో నేర్పించాలి అని గట్టిగా అడిగాను నేర్పిస్తా అని అన్నాడు. తర్వాత ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్ళాము అక్కడ అమ్మానాన్న బాడీలు కనిపిస్తాయేమో అనుకున్నాను కానీ కనిపించలేదు. అని వాళ్ళ తాతయ్యకి చెప్తుంది. ఆటో అంటే నాకు చాలా ఇష్టం తాతయ్య నాకు అది దేవుడిచ్చిన వరమనుకుంటా.. ఎందుకంటే అమ్మ ఎప్పుడు వారణాసి ఆటోలో కూర్చొని వెళ్ళేది అందుకే నేను ఆటోలో వెళుతున్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అమ్మ కూర్చున్నట్లు అనిపిస్తుంది.. అందుకే నేను దానిని ఎప్పటికీ వదలను తాతయ్య అని అంటుంది. అప్పుడు నేనొకటి చెప్తాను సౌర్య నన్ను కొట్టొద్దు అని అంటాడు ఆనందరావు. చెప్పు తాతయ్య అని అంటుంది. అప్పుడు వారణాసిని పంపించింది నేనే అమ్మ సౌర్య అని అంటాడు. అంటే చిన్నప్పటినుంచి మోసం చేయడం మొదలు పెట్టారా తాతయ్య అని అనగానే.. సౌందర్య వచ్చి సౌర్య చంప పగలగొడుతుంది. నిన్ను మోసం చేయడం ఏంటి మేము నీకోసం చిన్నప్పుడు వచ్చాను. బ్రతిమిలాడాను అయినా రాలేదు అని అంటుంది.
Karthika Deepam 13 August 2022 Full Episode
అప్పుడు సౌర్య మేము చిన్నపిల్లలం కదా ఇలాగే చంప దెబ్బ కొట్టి తీసుకురావచ్చు కదా.. అమ్మకిచ్చిన మాట కోసం నేను కలెక్టర్ అయ్యేదాన్ని కదా అని అంటుంది.. అంతలో హిమ అక్కడికి వస్తుంది. నేను కూడా అమ్మానాన్నలకి ఇచ్చిన మాటని నెరవేర్చాలని అనుకుంటున్నా అని సౌర్యతో అంటుంది హిమ. అప్పుడు శౌర్య తనతో గొడవపడుతుంది. దాంతో సౌందర్య గట్టిగా ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి పదండి గుడికి వెళ్దాం అని వచ్చేముందు మీ అమ్మానాన్నలకి దండం పెట్టి రండి అని అంటుంది. అప్పుడు వాళ్లు ఇద్దరు వచ్చి అక్కడ దండం పెట్టుకుంటూ ఉండగా వారి ఫోటోల మీద దండలు ఉండవు . అప్పుడు సౌందర్య ఫోటోలు కి దండలు ఎవరు తీసారండి అని ఆనంద్ రావు ని అడుగుతుంది. ఏమో సౌందర్య నేను కూడా గమనించలేదు అని అంటారు. అంతలో ఒక ఫోన్ వస్తుంది అందరూ గుడికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే నిరూపం శౌర్య, హిమ లు ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి ప్రేమ్ వస్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.