Home » Entertainment » Karthika Deepam 13 December 2021 Full Episode
Entertainment

Karthika Deepam 13 Dec Today Episode : ఎరువుల కొట్టులో పని చేస్తున్న కార్తీక్.. మరోవైపు కార్తీక్ ఎక్కడికెళ్లాడో తెలుసుకున్న మోనిత ఏం చేసింది?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 13, 2021 9:02 am
Advertisement

Karthika Deepam 13 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1221 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటండి మీరు.. ఒక ప్రాణం చావు బతుకుల్లో ఉంటే అలా చూస్తూ ఊరుకున్నారేంటి అంటుంది దీప. మీరు ఒక డాక్టర్ అన్న విషయం మరిచిపోయారా అని అడుగుతుంది కార్తీక్ ను. నేను ఇప్పుడు డాక్టర్ ను కాదు. నా డాక్టర్ పట్టాను రద్దు చేశాను. నేను డాక్టర్ గా కొనసాగకుండా సస్పెండ్ చేశారు.. అంటాడు కార్తీక్. దీంతో డాక్టర్ బాబు.. అంటూ దీప అనబోయే సరికి.. దీప ప్లీజ్.. నన్ను ఇంకోసారి డాక్టర్ బాబు అనకు అంటాడు కార్తీక్. వృత్తి వదిలేశారు. కానీ మీరు మానవత్వానికి కూడా దూరమయ్యారా? ఒక నిండు గర్భిణి నొప్పులు పడుతోంది. ఇంతకుముందు పాపం కాన్పులు పోయాయి. మీరు మాత్రం ఏమీ పట్టనట్టు అలా ఎలా ఉండగలిగారు అని అడుగుతుంది దీప.

Advertisement

karthika deepam 13 december 2021 full episode

నేను మానసికంగా ఆ పేషెంట్ చనిపోయినప్పుడే చచ్చిపోయాను దీప. ఇప్పుడు నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నవా? అని అంటాడు కార్తీక్. శ్రీవల్లికి ఏదైనా అయితే ఎలా.. మీరు ఇక్కడే పురుడుపోసేవాళ్లు కానీ.. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఊరు పేరు తెలియకపోయినా.. సాటి మనిషిని ఆదుకోవడమే మానవత్వం. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ శ్రీవల్లి వాళ్లది.. అని చెబుతుంది దీప. పాపం.. వాళ్లు చెట్టు కింద ఉంటున్నారు. వాళ్ల ఇంట్లోనే మనం ఉంటున్నాం. రుద్రాణి.. వాళ్లను ఇల్లు ఖాళీ చేయించింది. భూమిలో నుంచి కొబ్బరి చెట్టు తియ్యని నీళ్లు ఇస్తుంది. కానీ.. కొబ్బరి నీళ్లను భూమి రుచి చూడదు కదా. సాయం అంతే.. అంటుంది దీప. ఇంతలో నేను ఇప్పుడే వస్తాను దీప. నువ్వు పిల్లల దగ్గర ఉండు అంటాడు కార్తీక్.

Advertisement

మరోవైపు కార్తీక్ ఎక్కడికి వెళ్లాడో అని తెగ టెన్షన్ పడుతుంటుంది మోనిత. ఏం ప్లాన్ చేశారు వీళ్లందరూ కలిసి అని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. ఇంతలో ఆ ఫోన్ తీసుకున్న పిచ్చోడు.. ఎవరు అంటాడు. కార్తీక్ ఎక్కడున్నావు అంటుంది. కార్తీక్ ఎవడు.. అంటాడు.

Karthika Deepam 13 Dec Today Episode : కార్తీక్ ఫోన్ ద్వారా అసలు విషయాలు తెలుసుకున్న మోనిత

ఒరేయ్ నువ్వెవడ్రా.. అంటుంది. కార్తీక్ కాదు మహేశ్ ఇక్కడ అంటాడు. కార్తీక్ ఫోన్ నీకెక్కడ నుంచి వచ్చింది అని అడుగుతుంది మోనిత. దీంతో డబ్బులు పంపిస్తే అన్ని విషయాలు చెబుతాను అంటాడు. దీంతో అతడి అకౌంట్ కి 25 వేలు పంపిస్తుంది. దీంతో ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో అన్ని విషయాలు చెబుతాడు మహేశ్. బస్సు ఎక్కి వెళ్తే ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటుంది మోనిత.

Advertisement

కట్ చేస్తే.. కార్తీక్ వెళ్లి శ్రీవల్లి సామాన్లు చూస్తాడు. శ్రీవల్లికి ఎలాగూ సాయం చేయలేకపోయాను. కనీసం వాళ్ల సామాన్లను అయినా వాళ్ల ఇంట్లో పెడతాను అని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో ముగ్గురు వ్యక్తులు వస్తారు. నువ్వేం చేస్తున్నావో తెలుసా అని అడుగుతారు. ఇంట్లో ఉన్న సామాన్లు లోపల వేస్తున్నాను అంటాడు.

మేము ఎవరమో తెలుసా? రుద్రక్క మనుషులం. ఇది రుద్రక్క సామ్రాజ్యం. మాతో పెట్టుకోకు.. వెళ్లిపో అంటారు. అయినా కూడా వినకుండా కార్తీక్.. ఆ సామాన్లు తీసుకొని వెళ్లబోతాడు. వాళ్లు అడ్డుకునే సరికి.. వాళ్లను చితకబాదుతాడు. మమ్మల్నే కొడతావురా.. ఈరోజు అయిపోయావురా నువ్వు అని చెప్పి వెళ్లిపోతారు.

మరోవైపు పిల్లలు ఇద్దరూ అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి పిల్లలను పిలుస్తాడు. ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతాడు. ఇప్పటి నుంచి మీరు నేను డాక్టర్ అనే విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. మీరు మరిచిపోవాలి అని చెబుతాడు కార్తీక్.

మరి మీ డాడీ ఏం చేస్తాడు అని అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతారు పిల్లలు. ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడు అని చెప్పండి… అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు.. మీ నాన్న ఏం చేస్తాడు.. అంటే ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడు అని అంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి