Home » Entertainment » Karthika Deepam 13 January 2022 Full Episode
Entertainment

Karthika Deepam 13 Jan Today Episode : రుద్రాణికి దీప వార్నింగ్.. మోనిత విషయంలో మరోసారి కార్తీక్ కు టెన్షన్.. ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్లేందుకు కార్తీక్ ప్రయత్నాలు

Authored By
Varun G
The Telugu News | Published on: January 13, 2022, 2:00 pm
Advertisement

Karthika Deepam 13 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జనవరి 2022 గురువారం ఎపిసోడ్ 1248 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత.. భోజనం తినడం కోసం కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కు వెళ్తుంది. తను సర్వర్ తో మాట్లాడుతుండగా తన మాటలను కార్తీక్ వింటాడు. మోనిత వాయిస్ లా ఉందేంటి అని అనుకుంటాడు కార్తీక్. వెంటనే కిచెన్ లో నుంచి మోనితను చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత మోనిత వాష్ బేసిన్ కోసం అటూ ఇటూ చూస్తుంది. తనను చూసిందేమో అని టెన్షన్ పడి దాక్కుంటాడు కార్తీక్. వాష్ బేసిన్ కోసం కిచెన్ లోకి వస్తుంది. ఆ తర్వాత సర్వర్ తనను టేబుల్ మీద కూర్చోబెడతాడు. మీరు ఏం చేస్తుంటారు మేడమ్ అని అడుగుతాడు సర్వర్ అప్పారావు. నేను డాక్టర్ అంటుంది. మీరు డాక్టర్ అంటే మీ వారు కూడా డాక్టరే అయి ఉంటారు కదా అంటాడు అప్పారావు.

Advertisement

karthika deepam 13 january 2022 full episode

అవును కరెక్ట్ గా చెప్పావు. నీకెలా తెలుసు అంటుంది మోనిత. ఆ తర్వాత ఆర్డర్ చెబుతుంది. ఎగ్ బిర్యానీ తీసుకురా జూనియర్ అంటూ కార్తీక్ ను పిలుస్తాడు అప్పారావు. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు తను ఫుడ్ తీసుకెళ్తే.. మోనిత చూస్తుంది అనుకుంటాడు. మోనిత ఇక్కడి దాకా వచ్చిందంటే.. మమ్మల్ని ఖచ్చితంగా కనిపెడుతుంది. ఎలా మోనిత నుంచి తప్పించుకోవాలి అని భయపడతాడు కార్తీక్. ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్లాలా అని అనుకుంటాడు కార్తీక్. మోనిత వచ్చిందని ఊరు దాటి వెళ్తే.. రుద్రాణి సంగతి.. తన బాకీ సంగతి ఏంటి అని అనుకుంటాడు కార్తీక్. మేడమ్ ఐయామ్ అప్పారావు మేడమ్.. నేను సినిమాలకు ట్రై చేస్తున్నా అంటాడు. నాకు చిరాకీ తెప్పించకు. ముందు ఎగ్ బిర్యానీ తీసుకురా అంటాడు. దీంతో కుక్.. ఎగ్ బిర్యానీ తెచ్చి కార్తీక్ కు ఇస్తాడు. ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు.

Advertisement

దీంతో చాక్ తో వేలు కోసుకుంటాడు. ఇంతలో అప్పారావు వచ్చి ఏమైంది అంటాడు. చేయి కోసుకుంది అంటాడు. రా ట్రీట్ మెంట్ చేయిస్తా అంటాడు. దీంతో వద్దు అంటాడు. అప్పారావే తీసుకెళ్లి తనకు బిర్యానీ ఇస్తాడు. మరోవైపు దీప ఇంట్లో పని చేస్తుండగా లక్ష్మి వస్తుంది.

రుద్రాణి గురించి చెబుతుంది. నువ్వు మంచిదానివి దీప. ఆ రుద్రాణి మంచిది కాదు. నీ పిల్లల మీద కన్నేసింది. వచ్చే నెల ఆ రుద్రాణి పుట్టిన రోజు అట. తనకు జాకెట్లు కుట్టమని నాకు ఇచ్చింది. వాటితో పాటు రెండు గౌన్లు కూడా కుట్టమని నాకు కొలతలు ఇచ్చింది. ఆ గౌను కొలతలు నీ పిల్లల కొలతలు. దీప నీచుట్టూ పెద్ద కుట్ర జరుగుతోందని నా అనుమానం.. అని చెప్పి వెళ్లిపోతుంది లక్ష్మి.

Advertisement

Karthika Deepam 13 Jan Today Episode : నన్ను క్షమించు తల్లి అంటూ మోనిత కారు నెంబర్ పుస్తకంలో రాసిన కోటేశ్

దీంతో ఏం చేయాలో దీపకు అర్థం కాదు. ఇంతలో బీరువా దగ్గరికి వెళ్లి బీరువాకా ఆనుకోగానే.. దాని మీది నుంచి ఒక సూట్ కేసు కింద పడుతుంది. దాంట్లో కోటేశ్ ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నాడో వాటి వివరాలు అన్నీ ఉంటాయి. అందులో ఒక వాహనం నెంబర్ రాసి ఉంటుంది. నన్ను క్షమించు తల్లి అని రాసి ఉంటుంది. ఇది ఎవరి బండి నెంబర్.. అని అనుకుంటుంది.

మరోవైపు భోజనం చేశాక.. అక్కడి నుంచి కారులో వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు ప్రకృతి వైద్యశాలలో సౌందర్య, ఆనందరావు సేద తీరుతూ ఉంటారు. నాకెందుకో పెద్దోడు త్వరలోనే మనకు కనిపిస్తాడని అనిపిస్తోంది అంటుంది సౌందర్య. ఏమో సౌందర్య.. నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు అంటాడు.

కట్ చేస్తే.. రుద్రాణి ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీసు పని గురించి తన పనివాళ్లకు చెబుతుంది. తర్వాత తను ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్లగానే దీప వంట చేస్తూ కనిపిస్తుంది. అబ్బులూ అని పిలుస్తుంది. ఏంట్రా ఇది.. ఏం చూస్తున్నాను నేను అంటుంది. ఏంటి రుద్రాణి గారూ అంతా కులాశానా అంటుంది దీప.

ఊళ్లో వడ్డీలు బాగా వసూలు అవుతున్నాయా అని ప్రశ్నిస్తుంది. నువ్వేంటి మా ఇంట్లో అది వంటగదిలో అంటుంది. ఏం లేదు రుద్రాణి గారు. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. వంట చేసుకొని వెళ్దామని బియ్యం, కూరగాయలు తెచ్చుకున్నాను. అయిపోయింది.. నేను వంట త్వరగా చేస్తాను అంటుంది.

Advertisement

మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే.. మా ఇంటికి వచ్చి వంట చేసుకోవడం ఏంటి అంటుంది. ఊరుకోండి.. మీరు ఎవరు రుద్రాణి గారు. తాడికొండ గ్రామానికి కావాల్సిన వాళ్లు.. అంటుంది. నువ్వేంటి నా ఇంట్లోకి వచ్చి వంట వండటం ఏంటి అనగానే.. ఇప్పుడు కరెక్ట్  పాయింట్ మాట్లాడారు.

నీ వంట గదిలోకి వస్తేనే నీకు అంత కోపం వస్తే.. నా ప్రాణం.. నా పిల్లల మీద నువ్వు కన్నేస్తే నాకెంత కోపం రావాలి. అర్థం అయింది కదా.. రుద్రాణి గారు. నా పిల్లల జోలికి రాకండి అని గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి