Karthika Deepam 13 Jan Today Episode : దీపను దక్కించుకోవడం కోసం మోనిత మెడలో తాళి కట్టేందుకు కార్తీక్ సిద్ధం.. మోనిత చెప్పినట్టుగా దీపకు గుండెను ఇస్తుందా?

Karthika Deepam 13 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జనవరి 2023, శుక్రవారం ఎపిసోడ్ 1561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఎలాగూ నన్ను దగ్గరకు రానివ్వవని తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను కార్తీక్ అంటుంది మోనిత. దీంతో వదిలేసి వెళ్లిపోతావా? ఇంకెప్పుడూ నాకు కనిపించవా అంటాడు కార్తీక్. దీంతో కనిపించను కార్తీక్. నువ్వు పిలిచినా రాలేనంత దూరం వెళ్లిపోతాను అంటుంది మోనిత. కానీ.. నా గుండె చప్పుడు మాత్రం ఎప్పుడూ నీకు వినిపిస్తూనే ఉంటుంది అంటుంది మోనిత. నీ మాటలు కూడా నీలా ఏం అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్. దీంతో నీకు దీప బతకడం కావాలి. బతికే అవకాశం ఉందని చెబుతున్నా అంటుంది మోనిత. దీప బతికే అవకాశం ఉందా? ఏమంటున్నావు. ఎవరైనా గుండెను డొనేట్ చేసి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే తప్ప బతికే అవకాశం లేదు అని అంటాడు కార్తీక్.

karthika deepam 13 january 2023 full episode

దీంతో తెలుసు కార్తీక్.. రిపోర్ట్స్ చూశాను అర్థం అయింది అంటుంది. దీంతో ఇప్పటికిప్పుడు గుండె ఎక్కడ దొరుకుతుంది, చెప్పు మోనిత అంటాడు కార్తీక్. చూశావా కార్తీక్.. దీప బతుకుతుంది అనగానే నువ్వు నాతో ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నావు అంటుంది మోనిత. కోపంతో లేచి వెళ్లిపోతున్న కార్తీక్ ను ఆపుతుంది. నీ మంచి కోసమే మాట్లాడుతున్నా. నేను మారిపోయాను అంటుంది మోనిత. కార్తీక్ నేను చెప్పేది విను. దీప చనిపోదు. నేను చనిపోతాను. నా గుండెను దీపకు మార్పిడి చేయి అంటుంది మోనిత. అవును కార్తీక్.. నాకు ఎలాగూ నీకు దగ్గరగా ఉండే అవకాశం లేదు. ఇలా చేస్తే అన్నా నా గుండె చప్పుడు రూపంలో నీకు దగ్గరగా ఉంటాను. నువ్వు దీపలో నన్ను, నా ప్రేమను చూసుకునేలా చేస్తాను కార్తీక్. నన్ను నమ్ము కార్తీక్ అంటుంది మోనిత.

నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే పిచ్చి కార్తీక్. నీకు మతి లేనప్పుడు నిన్ను చంటిపాపలా చూసుకున్నాను. గుర్తులేదా అంటుంది. పెళ్లి చేసుకోకున్నా కృత్రిమంగా బిడ్డను ఎవరు కంటారు కార్తీక్. నేను కన్నాను. నీ మీద నా ప్రేమకు ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి. నీకోసం ప్రాణాలు అయినా ఇచ్చేస్తారు కార్తీక్. ఇప్పుడు అవకాశం వచ్చింది. అందుకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. తీసుకో కార్తీక్.

మాట్లాడటం లేదు ఏంటి కార్తీక్. నమ్మకం కలగడం లేదా? నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు. దీప నీ మనసులో ఉండగా నాకు నీ మనసులో చోటు దక్కదు. నన్ను నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. నీకు ఇష్టం అయిన దీప నీతో ఉన్నట్టు ఉంటుంది. అలాగే నేను నీతో ఉన్నట్టు ఉంటుంది అంటుంది మోనిత.

Karthika Deepam 13 Jan Today Episode : హేమ చంద్ర మీద సౌందర్యకు డౌట్

దీంతో ఇంతేనా.. ఇంకేమైనా ఉందా అంటాడు కార్తీక్. నువ్వు మారావంటే నమ్ముతాను కానీ.. దీప కోసం నువ్వు ప్రాణాలు ఇస్తానంటే నేను అస్సలు నమ్మను అంటాడు కార్తీక్. మాట్లాడకు. ఎన్నిసార్లు దీప అడ్డు తొలగించాలని అనుకున్నావో.. నాకు తెలియదనుకున్నావా?

అలాంటి నువ్వు దీప ప్రాణాలు కాపాడాలని అనుకుంటున్నావు అంటే నేను నమ్మాలా? అది కూడా నీ ప్రాణాలు ఇచ్చి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతాడు కార్తీక్. దీంతో ప్లీజ్ కూర్చో కార్తీక్ అంటుంది మోనిత. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు. అప్పుడంటే ఎలాగైనా నిన్ను దక్కించుకుంటానన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు అది లేదు.

నీకు దగ్గరగా ఉండటానికి ఇంతకన్నా వేరే దారి లేదు. నన్ను నమ్ము అంటుంది మోనిత. దీంతో నిన్ను నమ్మను మోనిత. నువ్వు నీ గురించి కాకుండా వేరే వాళ్ల గురించి ఆలోచించవు అంటాడు కార్తీక్. ఇందులో స్వార్థం ఉంది. నా జీవితంలో ఉన్న ఏకైక కోరిక ఏంటో తెలుసా? నీతో మూడు ముళ్లు వేయించుకొని నీ భార్యను అనిపించుకోవడం అంటుంది మోనిత.

నాకు తాళి కట్టి ఆ తర్వాత గుండె తీసుకో. నీ భార్యగా సంతోషంగా ప్రాణాలు వదిలేస్తాను అంటుంది మోనిత. దీంతో నిన్ను అంటూ సీరియస్ అవుతాడు. నీ భార్యగా చనిపోయే అవకాశం కూడా ఇవ్వవా? అంటుంది మోనిత. నువ్వు దీప సంతోషంగా ఉండండి అంటుంది మోనిత.

నాది ఇంకో కోరిక. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకోండి చాలు అంటుంది మోనిత. దీంతో చాలు. ఇక ఆపు నీ నాటకాలు. సిగ్గు లేదా నీకు. దీప పరిస్థితికి అయ్యో పాపం అనలేవు కానీ.. దాన్ని అడ్డం పెట్టుకొని నీ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నావా? మానవత్వం అనేదే లేదా నీకు అంటాడు కార్తీక్.

ఇన్నేళ్లుగా నిన్ను చూస్తున్నాను. నీ బుర్రలో ఉండే చెత్త ప్లాన్ ఏంటో నేను ఊహించలేనా? నీ మెడలో తాళి కట్టిన తర్వాత ఏం చేస్తావో నాకు తెలియదా? అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మరోవైపు హేమచంద్ర.. దీప దగ్గరికి వెళ్తాడు. నీ ఆరోగ్యం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పారా? అంటాడు.

ఇంతలో సౌందర్య వస్తుంది. ఇదివరకు హేమచంద్ర కార్తీక్, దీప ఫోటో చూసి తనకు తెలియదు అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది సౌందర్య. ఇంతలో కార్తీక్ వస్తాడు. మరోవైపు భోగి మంటలు ఏర్పాటు చేద్దామని శౌర్య, హిమ అడుగుతారు. దీంతో ఇప్పుడు మంటలు అవి ఎందుకు అంటాడు కార్తీక్.

దీంతో ఏం కాదులే అంటుంది సౌందర్య. ఆ తర్వాత అందరూ కలిసి సంక్రాంతికి పిండి వంటలు చేస్తుంటారు. దీప కూడా పిండి వంటలు చేస్తుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అమ్మ. మేము చేస్తాం లే అంటుంది చంద్రమ్మ. మరోవైపు హేమచంద్రతో మాట్లాడుతాడు కార్తీక్.

ఆ తర్వాత నాకు నిండు నూరేళ్లు బతకాలని ఉంది అంటుంది దీప. నేను బతికే అవకాశం ఉందా అంటుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కార్తీక్ ను అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

24 minutes ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

1 hour ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

3 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

5 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

7 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

9 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

10 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

11 hours ago