Home » Entertainment » Karthika Deepam 13 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 13 July Today Episode : జ్వాలే శౌర్య అని తెలిసి నిరుపమ్ షాకింగ్ నిర్ణయం.. హిమను కాకుండా జ్వాలను పెళ్లి చేసుకుంటాడా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 13, 2022, 10:39 am
Advertisement

Karthika Deepam 13 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 1403 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చంద్రమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హాస్పిటల్ లో చేర్పిస్తాడు ఇంద్రుడు. హాస్పిటల్ లో హిమ ట్రీట్ మెంట్ చేస్తుంది. ఇంతలో శౌర్యకు విషయం తెలియడంతో హాస్పిటల్ కు వస్తుంది. అక్కడ హిమను చూసి శౌర్య షాక్ అవుతుంది. తను ఇక్కడ ఉంది ఏంటి అని అడుగుతుంది శౌర్య. దీంతో మీ పిన్నికి కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో హిమ వచ్చి దగ్గర్లో ఉందని ఈ ఆసుపత్రికి తీసుకొచ్చింది అని చెబుతాడు ఇంద్రుడు. దీంతో శౌర్యకు కోపం వస్తుంది. బాబాయి.. పిన్నికి ఏం కాదు. చిన్న ప్రాబ్లమే అంటుంది హిమ. వెళ్తున్న శౌర్యను ఆపి.. ఆగమంటున్నానా? నీతో మాట్లాడాలి అంటుంది హిమ. దీంతో ఆగుతుంది శౌర్య. ఏంటి అంటుంది.. డాక్టర్ సాబ్ ను నా నుంచి దూరం చేశావు. ఇంకా ఏం మాట్లాడుతావు అని అడుగుతుంది శౌర్య.

Advertisement

karthika deepam 13 july 2022 full episode

దీంతో జరిగింది వేరు.. నువ్వు అర్థం చేసుకున్నది వేరు అంటుంది హిమ. కానీ.. శౌర్య మాత్రం వినదు. ఏం జరిగినా నాకే కదా మోసం జరిగింది అంటుంది జ్వాల. శౌర్య ప్లీజ్ నేను చెప్పేది విను. జరిగినవన్నీ నీకు చెప్పాలనే ఆసుపత్రికి వచ్చాను. అప్పుడే పిన్నికి కడుపునొప్పి వచ్చింది అంటుంది హిమ. శోభ నాకు మొత్తం చెప్పింది అంటుంది శౌర్య. దీంతో హిమ షాక్ అవుతుంది. శోభ చెప్పడం ఏంటి.. తను చెప్పేవన్నీ అబద్ధాలు. నమ్మకు శౌర్య అంటుంది హిమ. కానీ.. శౌర్య మాత్రం వినదు. అబద్ధాల గురించి.. మోసాల గురించి నువ్వు చెబుతున్నావా అంటుంది శౌర్య. ఏం నటించావే.. ఏం ప్లాన్ చేశావే.. పెళ్లి జరిపిస్తాను అన్నావు.. చివరికి క్యాన్సర్ డ్రామా ఆడావు అంటుంది శౌర్య.

Advertisement

ఏం చేసినా నీ మంచి కోసమే.. నీ కోసమే చేశాను శౌర్య అంటుంది హిమ. దీంతో ఆపవే నీ దొంగ నాటకాలు అంటుంది. ఇంకా కొత్త కొత్త ప్లాన్లు వేస్తూనే ఉన్నావా? ఇంకేం మిగిలిందే నా ప్రాణం ఒకటి తప్ప. నువ్వు అబద్ధం.. నువ్వు చూపించిన స్నేహం అబద్ధం.. అంటుంది జ్వాల.

Karthika Deepam 13 July Today Episode : శౌర్య కోసం ఎదురు చూసిన హిమ, సౌందర్య, ఆనంద రావు

నాకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పాను కానీ.. అలా చేస్తే అయినా నిరుపమ్ బావ అంటూ చెప్పబోతుండగా వినదు శౌర్య. నువ్వు అసలు నన్ను ముట్టుకోకు అంటూ సీరియస్ అవుతుంది జ్వాల. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శౌర్య ఆగు అన్నా కూడా వినకుండా వెళ్లిపోతుంది జ్వాల.

Advertisement

కట్ చేస్తే శౌర్య, హిమ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను హాల్ లో పెడుతుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వస్తుంది స్వప్న. చప్పట్లు కొడుతుంది. మమ్మీ.. డాడీ మీరు సూపర్. మీరు అద్భుతం. ఇప్పటి దాకా దాన్ని నెత్తిన ఎక్కించుకున్నారు. ఇప్పుడు దాని ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? అసలు మీరు మనుషులేనా అని అడుగుతుంది స్వప్న.

హిమకు క్యాన్సర్ లేదనే విషయం నాకు తెలిసింది అంటుంది స్వప్న. దీంతో తనకు క్యాన్సర్ లేకపోతే సంతోషించు అంటుంది సౌందర్య. ఈ పెళ్లికి ఒప్పుకోను అంటే.. పెళ్లి ఎక్కడ జరగదో అని క్యాన్సర్ డ్రామా ఆడింది నీ మనవరాలు అంటుంది స్వప్న. దీంతో డ్రామా ఏంటి.. ఈ జ్వాల ఎవరో కాదు.. మన శౌర్య అంటుంది సౌందర్య.

అంటే నా కొడుకు వెంట నీ ఇద్దరు మనవరాళ్లు ప్రేమా ప్రేమా అని తిరుగుతున్నారన్నమాట. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ పెళ్లి ఆపేస్తాను అంటుంది స్వప్న. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నా మనసులో మాట చెప్పేశాను. నిరుపమ్ పెళ్లి శోభతోనే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

కట్ చేస్తే నిరుపమ్ అన్నం తింటూ ఉంటాడు. హిమకు క్యాన్సర్ లేదనే విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటుంది స్వప్న. ఆ జ్వాలను పెళ్లి చేసుకోమని అనడం ఏంటి.. అసలు నీకు ఈ పెళ్లి అవసరమా అంటుంది స్వప్న. దీంతో హిమ అంటే నాకు చాలా ఇష్టం అంటాడు నిరుపమ్.

Advertisement

దీంతో ఆ జ్వాల ఎవరో కాదు.. శౌర్య అని చెబుతుంది స్వప్న. దీంతో షాక్ అవుతాడు నిరుపమ్. లేదు మమ్మీ నేను నమ్మను. నువ్వేదో జ్వాల మీద హిమ మీద కోపంతో చెబుతున్నావా అని అంటాడు నిరుపమ్. దీంతో నీకు అబద్ధాలు ఎందుకు చెబుతాను అని అంటుంది స్వప్న.

మరోవైపు శౌర్య కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇంతలో శౌర్య ఆటోలో బ్యాగ్ తీసుకొని వస్తుంది. మీ ఇంట్లో ఉంటున్నాను కదా అని తక్కువ అంచనా వేయొద్దు. నా జీవితం నాది.. నాకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉంటాను. ఎవరైనా ఎదురు చెబితే మరుక్షణమే వెళ్లిపోతాను అంటుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి